Guntur Kaaram Movie: అమెరికాలో ‘గుంటూరు కారం’ జోష్, ఫ్యాన్స్ పండగ చేసుకొనే వార్త
Guntur Kaaram Movie: అమెరికాలో ‘గుంటూరు కారం’ జోష్ మొదలయ్యింది. ట్రైలర్ విడుదల కానప్పటికీ బుకింగ్స్ మాత్రం శరవేగంగా జరుగుతున్నాయి.
Guntur Kaaram Storms In USA: అమెరికాలో ‘గుంటూరు కారం’ సందడి మొదలయ్యింది. ట్రైలర్ రిలీజ్ కాకపోయినప్పటికీ మూవీ లవర్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ మూవీ గతంలో ఏ సినిమా లేనంత భారీ స్థాయిలో రిలీజ్ కు రెడీ అవుతోంది.
అమెరికాలో ‘గుంటూరు కారం’ జోష్
అటు ‘గుంటూరు కారం’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా కొనసాగుతున్నాయి. ప్రీమియర్స్ ప్రీ సేల్స్ లో ఇప్పటికే హాఫ్ మిలియన్ మార్కు దాటించింది. సినిమాకు సంబంధించిన వీడియో కంటెంట్ లేకున్నా, ట్రైలర్ విడుదల కాకున్నా బుకింగ్స్ మాత్రం శరవేగంగా జరుగుతున్నాయి. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ అమెరికాలో మ్యాజిక్ చేస్తోంది. డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాను రికార్డు స్థాయి స్క్రీన్లలో విడుదల చేస్తామని తెలిపారు.
భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజనెస్
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొత్తంగా రూ. 104.1 కోట్ల బిజినెస్ అందుకుంది. రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.9.5 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 21 కోట్ల బిజినెస్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.134.6 కోట్లుగా బిజినెస్ జరుపుకుంది. ఇది సూపర్ స్టార్ కెరీర్ లోనే అత్యధిక బిజినెస్. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించాలంటే సుమారు రూ.135 కోట్లకు పైగా సాధించాలి.
‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా
అటు ‘గుంటూరు కారం’ ట్రైలర్ ను ఇవాళ(జనవరి 6న) జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే, పోలీసులు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో కార్యక్రమాన్ని రద్దు చేశారు. “మేము చాలా ప్రయత్నించినప్పటికీ ఊహించని పరిస్థితులతో ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 6న నిర్వహించడం లేదు. ముఖ్యంగా భద్రతా పరమైన అనుమతుల సమస్యల కారణంగా పోస్ట్ పోన్ చేశాం. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా వేసినందుకు అభిమానులను క్షమాపణలు కోరుతున్నాము. ఈవెంట్ వేదికతో పాటు కొత్త డేట్ ను త్వరలో ప్రకటిస్తాం” అని మేకర్స్ వెల్లడించారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న ‘గుంటూరు కారం’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. త్రివిక్రమ్, మహేశ్ కాంబోలో వస్తున్న మూడవ చిత్రం ఇది కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. . హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు.
Read Also: ‘అర్జున్ రెడ్డి’ హిట్ కాకపోతే సందీప్ ఆ పని చేసేవాడు - ‘యానిమల్’ నిర్మాత ప్రణయ్ వంగ