అన్వేషించండి

Thandel Movie: ‘తండేల్’ అంటే ఏమిటీ? దాని వెనుక అంత కథ ఉందా?

Thandel Movie నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘తండేల్’. ఇంతకీ ఆ సినిమా టైటిల్ అర్థం ఏంటో తాజాగా వివరించారు దర్శకుడు.

Meaning of  Thandel : టాలీవుడ్ యంగ్ హీరో  అక్కినేని నాగ చైతన్య చివరిగా కనిపించిన ‘కస్టడీ’ మూవీ ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం విడుదలైనా, ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. ప్రస్తుతం నాగ చైతన్య తన  ఆశలన్నీ తర్వాతి సినిమా ‘తండేల్’ మీదే పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన చందు మొండేటి దర్శకత్వంలో ఈ మూవీ చేస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ లో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ సంస్థ '100 పర్సెంట్ లవ్' నిర్మించింది. ఇప్పుడు మళ్లీ ‘తండేల్’ మూవీని నిర్మిస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా విడుదలైన వీడియో గ్లింప్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచింది.

నాగ చైతన్య కెరీర్ లో 23వ సినిమాగా ‘తండేల్’ తెరకెక్కుతోంది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ‘తండేల్’ కోసం మరోసారి జోడీ కడుతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇంతకీ ‘తండేల్’ అంటే ఏంటి? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఎవరి తోచినట్టుగా వారు ‘తండేల్’ అర్థాలు చెప్తున్నారు.  

‘తండేల్’ అంటే ఏమిటీ?

తాజాగా ‘తండేల్’ అంటే ఏంటో స్వయంగా చిత్ర దర్శకుడు చందూ మొండేటి వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన టైటిల్ మీనింగ్ చెప్పారు. గుజరాతీ భాషలో ‘తండేల్’ అంటే బోటు నడిపే ఆపరేట్ అని అర్థం అన్నారు. గుజరాత్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోని గ్రామాల ప్రజలు ‘తండేల్’ అనే పదాన్ని ఉపయోగిస్తారని చెప్పారు. బతుకుతెరువు కోసం గుజరాత్‌ వీరవల్‌కు వెళ్లిన కొంత మంది శ్రీకాకుళం మత్స్యకారులు, చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్‌ కోస్టుగార్డులకు చిక్కుతారు. ఆ తర్వాత ఏం జరిగిందనే కథాంశంతో ‘తండేల్’ సినిమా తెరకెక్కనుంది. ఇందులో నాగ చైతన్య గుజరాత్ సముద్రతీర జలాల్లో చిక్కుకున్న శ్రీకాకుళానికి చెందిన జాలరి పాత్రలో కనిపించనున్నారు.

నాగ చైతన్య రీసెంట్ గా ‘ధూత’ అనే వెబ్ సిరీస్ లో నటించాడు. జర్నలిస్టు పాత్రలో కనిపించిన ఆయన అద్భుత నటనతో ఆకట్టుకున్నాడు. ప్రైమ్ వీడియోలో రీసెంట్ గా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చింది.  సూపర్ నేచురల్ హారర్ కథాంశంతో ఈ సిరీస్ తెరకెక్కింది. ఈ వెబ్ సిరీస్‌కు విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించారు. మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్‌ తో ఉన్న ఈ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

Read Also: ‘సూపర్ మ్యాన్’ కాదు అమీర్ ఖాన్ కొడుకు - అతడిని చూస్తే మీరూ ఇలాగే కన్‌ఫ్యూజ్ అవుతారు!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

JD Chakravarthy : కమల్ హాసన్ కాలిగోటికి సరిపోను - కానీ ఈ రోల్ నా అదృష్టం... గాయపడ్డ సింహంపై జేడీ చక్రవర్తి రియాక్షన్
కమల్ హాసన్ కాలిగోటికి సరిపోను - కానీ ఈ రోల్ నా అదృష్టం... గాయపడ్డ సింహంపై జేడీ చక్రవర్తి రియాక్షన్
Biker Collection : బాక్సాఫీస్ సూపర్ రేసర్ బైకర్ - ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
బాక్సాఫీస్ సూపర్ రేసర్ బైకర్ - ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
Rakasa Collection : రాకాస సూపర్ కలెక్షన్స్ - ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిందిగా...
రాకాస సూపర్ కలెక్షన్స్ - ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిందిగా...
Zayn Marie Khan : డెకాయిట్ బ్యూటీ ఫోటోస్ వైరల్ - బాలీవుడ్ To టాలీవుడ్... అసలెవరీ జైన్ మేరీ ఖాన్?
డెకాయిట్ బ్యూటీ ఫోటోస్ వైరల్ - బాలీవుడ్ To టాలీవుడ్... అసలెవరీ జైన్ మేరీ ఖాన్?

వీడియోలు

CSK Bowling Failure vs RCB IPL 2026 | చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన ఆర్సీబీ
IPL 2026 RCB VS CSK Highlights | ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ
LSG Owner Sanjiv Goenka Tears Up IPL 2026 | కన్నీటి పర్యంతమైన ఓనర్ సంజీవ్ గోయెంకా
IPL 2026 SRH VS LSG Highlights | ఐపీఎల్ లో బోణీ కొట్టిన ల‌క్నో
RCB 250 vs CSK Chinnaswamy IPL 2026 | చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ పరుగుల వరద

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gujarat Love Marriage Conditions: ప్రేమ పెళ్లిచేసుకోవాలంటే తల్లిదండ్రుల పర్మిషన్ తప్పనిసరి - గుజరాత్‌లో చట్టం - ఈ పెద్దోళ్లున్నారే?
ప్రేమ పెళ్లిచేసుకోవాలంటే తల్లిదండ్రుల పర్మిషన్ తప్పనిసరి - గుజరాత్‌లో చట్టం - ఈ పెద్దోళ్లున్నారే?
Madhya Pradesh Love Story: వయసు కేవలం అంకె మాత్రమే 40 ఏళ్ల వ్యక్తితో 19 ఏళ్ల యువతి సహజీవనం.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్!
వయసు కేవలం అంకె మాత్రమే 40 ఏళ్ల వ్యక్తితో 19 ఏళ్ల యువతి సహజీవనం.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్!
Tank Bund Shiva:ట్యాంక్‌బండ్‌లో దూకేవాళ్ల కథలన్నీ అలాంటివే! ట్యాంక్ బండ్ శివతో ABPదేశం ఇంట్రాక్షన్
ట్యాంక్‌బండ్‌లో దూకేవాళ్ల కథలన్నీ అలాంటివే! ట్యాంక్ బండ్ శివతో ABPదేశం ఇంట్రాక్షన్
Food Storage Tips : సమ్మర్​లో ఫుడ్ స్టోర్ చేయడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. ఆహారం పాడవకుండా తాజాగా ఉంటుంది
సమ్మర్​లో ఫుడ్ స్టోర్ చేయడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. ఆహారం పాడవకుండా తాజాగా ఉంటుంది
Salman Khan Shoes: టార్న్ జీన్స్ లాగా.. చినిగిపోయిన, మట్టికొట్టుకుపోయిన బ్రాండెడ్ షూలు - సల్మాన్ స్టైల్ వైరల్
టార్న్ జీన్స్ లాగా.. చినిగిపోయిన, మట్టికొట్టుకుపోయిన బ్రాండెడ్ షూలు - సల్మాన్ స్టైల్ వైరల్
Who Is Prashant Veer: మరో జడేజాగా భావిస్తున్న CSK అన్‌క్యాప్డ్ కాస్ట్‌లీ ప్లేయర్! ఎవరీ ప్రశాంత్ వీర్.. బ్యాగ్రౌండ్ ఏంటీ?
మరో జడేజాగా భావిస్తున్న CSK అన్‌క్యాప్డ్ కాస్ట్‌లీ ప్లేయర్! ఎవరీ ప్రశాంత్ వీర్.. బ్యాగ్రౌండ్ ఏంటీ?
Personal Finance Tips: పన్ను విధానంలో మార్పుల వేళ ఈ ఐదు ఆర్థిక సూత్రాలు పాటిస్తేనే ఉద్యోగులకు మేలు!
పన్ను విధానంలో మార్పుల వేళ ఈ ఐదు ఆర్థిక సూత్రాలు పాటిస్తేనే ఉద్యోగులకు మేలు!
Iran-US ceasefire: అమెరికా - ఇరాన్ మధ్య కాల్పుల విరమణ దిశగా ముందడుగు - 45 రోజుల ఒప్పందం జరిగే చాన్స్
అమెరికా - ఇరాన్ మధ్య కాల్పుల విరమణ దిశగా ముందడుగు - 45 రోజుల ఒప్పందం జరిగే చాన్స్
Embed widget