అన్వేషించండి

Extra Ordinary Man OTT: ఓటీటీలోకి నితిన్ మూవీ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ - ఎప్పుడు, ఎక్కడంటే?

Extra Ordinary Man: నితిన్, శ్రీలీల జంటగా నటించిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ థియేటర్లలో డిసాస్టర్ అయ్యింది. దీంతో ఓటీటీలో అయినా ప్రేక్షకులను మెప్పించడానికి వచ్చేస్తోంది.

Extra Ordinary Man OTT Update: థియేటర్లలో ఘోరంగా డిజస్టర్ అందుకున్న ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’.. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధమయ్యింది. గతేడాది డిసెంబర్‌లో గట్టి పోటీ మధ్య ఈ మూవీ థియేటర్లలో విడుదలయ్యింది. ఒకవేళ టాక్ బాగుంటే యావరేజ్ హిట్‌గా అయినా నిలిచేది కానీ.. మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే నెగిటివ్ టాక్ అందుకుంది. దీంతో ప్రేక్షకులంతా ఈ సినిమాను స్కిప్ చేసి ఇతర సినిమాలు చూడడానికి ప్రాధాన్యత ఇచ్చారు. 

నిర్మాతగా నితిన్‌కు భారీ నష్టాలు..
డిసెంబర్ 8న థియేటర్లలో విడుదలయ్యింది ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’. ఇక ఈ మూవీ విడుదలయ్యి నెలరోజులు అవుతుండడంతో ఓటీటీ రిలీజ్ వివరాలను బయటపెట్టారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 12 నుండి ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర సౌత్ భాషల్లో కూడా ఈ మూవీ అందుబాటులోకి రానుంది. కేవలం ఈ మూవీలో హీరోగా మాత్రమే కాకుండా దీనికి నిర్మాతగా కూడా వ్యవహరించినందుకు నితిన్.. భారీ నష్టాలనే చవిచూశాడు. హీరోయిన్‌గా శ్రీలీల క్రేజ్, డ్యాన్స్ కూడా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ను కాపాడకపోగా.. అలాంటి పాత్రను సెలక్ట్ చేసుకున్నందుకు తనపై విమర్శలు కూడా వచ్చాయి.

మ్యూజిక్ కూడా మెప్పించలేదు..
తన డ్యాన్స్‌తో టాలీవుడ్ మేకర్స్ అందరినీ తనవైపు తిప్పుకుంది శ్రీలీల. కానీ కేవలం డ్యాన్స్ కోసమే తనను కమర్షియల్ సినిమాల్లో క్యాస్ట్ చేసుకుంటున్నారని.. శ్రీలీల ఆ విషయాన్ని గుర్తించాలని నెటిజన్లు విమర్శిస్తున్నారు. డ్యాన్స్‌తో పాటు పర్ఫార్మెన్స్‌కు కూడా ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటే తన కెరీర్ బాగుంటుందని అనుకుంటున్నారు. ఇక నితిన్ సరసన నటించిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’లో శ్రీలీల క్యారెక్టర్‌ను అంతగా హైలెట్ చేయలేదు దర్శకుడు. కేవలం పాటల్లోనే తన సత్తా మొత్తం చూపించింది. చాలాకాలం తర్వాత ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన హారీస్ జయరాజ్ మ్యూజిక్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

పోటీలో నిలబడలేకపోయిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’..
‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ థియేటర్లలో విడుదలయ్యే సమయానికి ‘యానిమల్’ మూవీ ఫుల్ ఫార్మ్‌లో ఉంది. అయినా ‘యానిమల్’ విడుదలయిన వారం తర్వాత ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాను విడుదల చేశారు మేకర్స్. అదే సమయంలో ‘హాయ్ నాన్న’తో కూడా పోటీపడ్డాడు ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’. కానీ నెగిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులంతా ‘యానిమల్’, ‘హాయ్ నాన్న’నే మళ్లీ మళ్లీ చూడడానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఎన్నో సినిమాలకు సక్సెస్‌ఫుల్ రైటర్‌గా పనిచేసిన వక్కంతం వంశీ.. దర్శకుడిగా మాత్రం సక్సెస్ అవ్వలేకపోతున్నాడు. ‘నా పేరు సూర్య’ చిత్రంతో దర్శకుడిగా మారిన వక్కంతం వంశీకి మొదటి అడుగులోనే ఓటమి ఎదురయ్యింది. అయినా కూడా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ను తెరకెక్కించి మరోసారి ఫ్లాప్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. మరి, ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులనైనా ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.

Also Read: నేను సీఎం కదా 4 గంటలు ఎక్స్‌ట్రా కావాలంటే రావు - ప్రభాస్‌తో మూవీపై మారుతీ ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget