అన్వేషించండి

Prabhas Maruthi Movie: నేను సీఎం కదా 4 గంటలు ఎక్స్‌ట్రా కావాలంటే రావు - ప్రభాస్‌తో మూవీపై మారుతీ ఆసక్తికర వ్యాఖ్యలు

Prabhas Maruthi Movie: ప్రభాస్, మారుతీ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ గురించి ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేవు. కానీ ఉన్న అంచనాలకంటే తన సినిమా ఎక్కువే ఉంటుందని మారుతీ వ్యాఖ్యలు చేశారు.

Maruthi about Prabhas Movie: పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్న తర్వాత కూడా ప్రభాస్.. సుజీత్, రాధాకృష్ణలాంటి యంగ్ టాలెంట్‌తో సినిమాలు చేయడానికి ఒప్పుకున్నాడు. ఇక అదే విధంగా ఉన్నట్టుండి దర్శకుడు మారుతీతో తన మూవీ ఉంటుందని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ప్రభాస్ గానీ, మారుతీ గానీ ఈ ప్రాజెక్ట్ గురించి రివీల్ చేయడానికి ఇష్టపడలేదు. అనుకోకుండా సంక్రాంతికి ఈ మూవీ ఫస్ట్ లుక్ వచ్చేస్తుందని అప్డేట్ వచ్చింది. దీంతో ఈ సినిమా గురించి మాట్లాడడానికి మారుతీ ముందుకొచ్చారు.

సరదాగా మాట్లాడలేం..
‘‘ఆ సినిమా ఎలా ప్రారంభం అయ్యింది, ఎలా ముగుస్తుంది అని చెప్పాలంటే పెద్ద గ్రంథంలాగా ఉంటుంది. సింపుల్‌గా మాట్లాడే విషయం కాదు. అంత పెద్ద ప్రాజెక్ట్ గురించి సరదాగా మాట్లాడలేం. ఆయన ఏం నమ్మాడు, నాలో ఏం చూశాడు, మేమిద్దరం కలిసి ప్రపంచానికి ఏం చెప్పదలచుకున్నాం, ఆయన ద్వారా నేనేం చెప్పదలచుకున్నాను.. ఇవన్నీ చాలా పెద్ద విషయాలు. ప్రేక్షకులు ఏదైతే ఆశిస్తున్నారో దానికి ఒక శాతం ఎక్కువే ఇస్తాను. ఒక్క శాతం కూడా తగ్గించను అని మాటిస్తాను. ఎందుకంటే వేరేవాళ్లను ఆయన వాల్యూ ఎలా తెలుసో.. నాకు కూడా తెలుసు. చాలామంది ప్రేక్షకులు, ఫ్యాన్స్ అనుకుంటారు ఎలా తీస్తాడో అని, వాళ్లు అనుకున్నదానికంటే ఒక శాతం ఎక్కువే ఉంటాను నేను. అలా ఉంటేనే ఈ స్థాయిలో ఉండగలుగుతాను’’ అంటూ ప్రభాస్‌తో చేస్తున్న సినిమా గురించి గొప్పగా మాట్లాడారు మారుతీ.

త్వరలో మీకూ తెలుస్తుంది..
‘‘ఫ్యాన్స్ ఏం చూడాలనుకుంటున్నారో.. హీరోకు నచ్చజెప్పి, అది ఆయన దగ్గర నుండి తీసుకొని ప్రేక్షకులకు చూపించగలుగుతున్నాం. అది నేను కరెక్ట్‌గా చేయగలుగుతున్నానా లేదా అన్నది నా మనస్సాక్షికి తెలుసు. అది త్వరలో మీకు కూడా తెలుస్తుంది. ప్రేక్షకులకే కాదు నాకు కూడా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టే ఇది. సీఏంకు అయినా 24 గంటలే, మామూలు మనిషికి అయినా 24 గంటలే. సీఎం సీట్‌లో కూర్చున్నాను నాకు 4 గంటలు ఎక్స్‌ట్రా కావాలంటే రావు. కానీ మన పనులను ఎలా డివైడ్ చేస్తున్నాం, అన్నింటి మధ్య మానసికంగా ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నాం, దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం, మన పనులకు వాల్యూ ఎంత ఇస్తున్నాం అనేదానిపై అన్ని ఆధారపడి ఉంటాయి. నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నాను’’ అంటూ ప్రభాస్ ప్రాజెక్ట్‌పైనే తన దృష్టి ఉందని చెప్పుకొచ్చారు మారుతీ.

ఫస్ట్ లుక్ కోసం ఎదురుచూపులు..
ప్రభాస్‌తో చేస్తున్న ప్రాజెక్ట్ గురించి ఇలా కాస్త హింట్ ఇచ్చిన మారుతీ.. జనరల్ ఐడియా మాత్రమే చెప్పానని, చెప్పాల్సింది ఇంకా ఉందని బయటపెట్టారు. ఇక తాజాగా ప్రభాస్.. ‘సలార్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీపై ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్ని అంచనాలు పెట్టుకున్నారో.. అవన్నీ రీచ్ అయ్యాయి. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల తర్వాత ప్రభాస్‌కు ‘సలార్’లాంటి హిట్ అందడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. అంతే కాకుండా ఆ మూవీ సక్సెస్ అయ్యిందన్న సంతోషంలో ఉండగానే.. ప్రభాస్, మారుతీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ నుండి సంక్రాంతికి ఫస్ట్ లుక్ రిలీజ్ అని అప్డేట్ వచ్చింది. దీంతో వారికి డబుల్ హ్యాపీనెస్ అందింది. మరి అందరూ తక్కువ అంచనా వేస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Also Read: రవితేజ ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్న ఫిబ్రవరి నెల, ఎందుకంటే?

టాప్ హెడ్ లైన్స్

Jailer 2 Twitter Review - 'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
Crime Thriller OTT : అమ్మాయిల చేతులతో పర్ఫ్యూమ్ - సైకో కిల్లర్ అమ్మాయా? అబ్బాయా?... ఓటీటీ ప్లాట్ ఫామ్‌పై బిగ్ హైప్
అమ్మాయిల చేతులతో పర్ఫ్యూమ్ - సైకో కిల్లర్ అమ్మాయా? అబ్బాయా?... ఓటీటీ ప్లాట్ ఫామ్‌పై బిగ్ హైప్
Crime Thriller Series OTT : అసలు రహస్యాన్ని బయటపెట్టే మరో సీక్రెట్ - మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ రెండో సీజన్... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అసలు రహస్యాన్ని బయటపెట్టే మరో సీక్రెట్ - మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ రెండో సీజన్... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Fauzi Heroine Birthday: 'ఫౌజీ' హీరోయిన్ బర్త్ డే... ప్రభాస్ ఎంత ఫుడ్ పంపించారో చూశారా?
'ఫౌజీ' హీరోయిన్ బర్త్ డే... ప్రభాస్ ఎంత ఫుడ్ పంపించారో చూశారా?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Embed widget