అన్వేషించండి

హన్సిక ‘105 మినిట్స్’ రివ్యూ, ‘రాబిన్ హుడ్’ గ్లింప్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

వన్ నాట్ ఫైవ్ మినిట్స్ రివ్యూ: హన్సిక విశ్వరూపం - స్టార్టింగ్ టు ఎండింగ్ ఆమెను చూడగలమా?
'దేశముదురు' సినిమాతో కథానాయికగా పరిచయమై... ఆ తర్వాత 'కందిరీగ', 'ఓ మై ఫ్రెండ్', 'దేనికైనా రెడీ', 'పవర్' వంటి హిట్ సినిమాలు చేసిన ఉత్తరాది భామ హన్సిక. తెలుగులో వరుస అవకాశాలు, విజయాలు వచ్చినప్పటికీ... తమిళ చిత్రసీమలో మరిన్ని అవకాశాలు రావడంతో అక్కడ సెటిల్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ తెలుగు సినిమాలపై దృష్టి సారించారు. ముఖ్యంగా పెళ్లి తర్వాత హీరోయిన్, ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువ చేస్తున్నారు. '105 మినిట్స్' కూడా అటువంటి చిత్రమే.'105 మినిట్స్' ప్రత్యేకత ఏమిటంటే... సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు స్క్రీన్ మీద సింగిల్ క్యారెక్టర్ కనబడుతుంది. హన్సిక తప్ప మరొకరు ఉండరు. ఈ ప్రయోగాత్మక సినిమా జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా థియేటర్లలో విడుదల అయ్యింది. సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

'పద్మవిభూషణ్‌' చిరంజీవికి అభినందనల వెల్లువ.. రామ్‌ చరణ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌
కేంద్ర ప్రభుత్వం నిన్న పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలోని సినీ, కళారంగం, విద్య, వ్యాపారం, సాంకేతిక రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందిస్తుంది. ప్రతి ఏటా రిపబ్లిక్‌డే సందర్భంగా ప్రకటించే ఈ అవార్డులకు మన తెలుగు తేజాలు ఉండటం విశేషం. ఇందులో మెగాస్టార్‌ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి పద్మవిభూషణ్‌ వరించాయి, తెలంగాణకు చెంది పలువురు కళాకారులకు పద్మ అవార్డులకు ఎన్నికయ్యారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మనసుకు హత్తుకుంటున్న అమ్మ పాట - ‘గుంటూరు కారం’ నుంచి ఆ ఎమోషనల్ సాంగ్ వచ్చేసింది
టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మహేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ‘అత‌డు’, ‘ఖ‌లేజా’ లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావడంతో ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. అయితే, ఈ సినిమా తొలి షో నుంచే మిశ్రమ స్పందన లభించింది. అయినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

డబ్బు చాలా చెడ్డది, దోచుకున్న నితిన్ - కొత్త సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ చూశారా?
నితిన్ కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న సినిమాకు 'రాబిన్ హుడ్' టైటిల్ ఖరారు చేశారు. 'భీష్మ' విజయం తర్వాత వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న చిత్రమిది. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు వీడియో గ్లింప్స్ కూడా విడుదల చేశారు. నితిన్ క్యారెక్టర్ మరింత రివీల్ చేయడంతో పాటు ఆయనతో చెప్పించిన డైలాగులు సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేసేలా ఉన్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మాంత్రికుడిగా భయపెడుతున్న మాధవన్ - ఆసక్తికరంగా జ్యోతిక, అజయ్ దేవగన్ ‘సైతాన్’ టీజర్
తాజాగా విడుదలయిన ‘సైతాన్’ టీజర్.. బాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. అజయ్ దేవగన్, జ్యోతిక, మాధవన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ‘సైతాన్’ మూవీ చేతబడి నేపథ్యంలో తెరకెక్కుతుందని మూవీ ఫస్ట్ లుక్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఈ సినిమా టీజర్‌లో ఆ విషయం మరింత క్లియర్‌గా తెలిసేలా చేశారు మేకర్స్. మాధవన్ వాయిస్ ఓవర్‌తోనే టీజర్ విడుదలయ్యింది. భయంకరమైన వాయిస్ ఓవర్, అంతకంటే భయంకరమైన విజువల్స్‌తో ‘సైతాన్’ టీజర్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఈ 90 సెకండ్ల టీజర్‌ చివర్లో అజయ్ దేవగన్, జ్యోతిక గ్లింప్స్ కూడా ఉంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget