అన్వేషించండి
Niharika NM: నిహారిక సిల్వర్ స్క్రీన్ డెబ్యూ... గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో, ఈవిడ మెగా డాటర్ కాదండోయ్!
నిహారిక త్వరలో సిల్వర్ స్క్రీన్ మీద అడుగు పెట్టబోతున్నారు. నిహారిక అంటే మెగా డాటర్, నాగబాబు కుమార్తె నిహారిక కాదు. ఈవిడ ఫేమస్ కంటెంట్ క్రియేటర్ నిహారిక. పూర్తి వివరాల్లోకి వెళితే...

తెలుగు తెరకు కథానాయికగా పరిచయం కానున్న మరో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ నిహారిక ఎన్ఎమ్
1/6

నిహారికా ఎన్ఎమ్... సోషల్ మీడియాలో చాలా పాపులర్. తనదైన శైలిలో వీడియోలు చేస్తూ... కంటెంట్ క్రియేటర్‌గా పాపులర్ అయ్యింది. అడివి శేష్ 'మేజర్' మూవీ ప్రమోషన్ సమయంలో మహేష్ బాబుతో ప్రమోషనల్ వీడియో చేసింది. యశ్ 'కెజిఎఫ్'కూ, ఇంకా పలువురు అగ్ర హీరోలతో వీడియోస్ చేసింది. ఇప్పుడీ అమ్మాయి తెలుగు తెరకు కథానాయికగా పరిచయం కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మించే సినిమాతో వెండితెరపై అడుగు పెట్టబోతోంది.
2/6

నిహారిక ఎన్ఎమ్ పుట్టినరోజు (జూలై 4) సందర్భంగా ఆమెను వెండితెరకు పరిచయం చేస్తున్నట్టు గీతా ఆర్ట్స్ సంస్థ పేర్కొంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి ఆమెకు స్వాగతం పలికింది.
3/6

నిహారిక అంటే తెలుగు ప్రేక్షకులకు మెగా డాటర్, నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల గుర్తుకు వస్తుంది. కానీ, ఈ అమ్మాయి పేరు కూడా నిహారికే. అన్నట్టు మెగా ఫ్యామిలీ నిహారికకు ఫ్రెండ్. చెన్నైలో జన్మించిన నిహారిక ఎన్ఎమ్ బెంగళూరులో పెరిగింది.
4/6

చెన్నైలో జననం... బెంగళూరులో స్కూల్, కాలేజ్ వయసు వరకు పెరిగిన నిహారిక ఎన్ఎమ్ అమెరికాలోని కాలిఫోర్నియాలో గల చాప్ మాన్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసింది. థియేటర్ ఆర్ట్స్ మీద ఆమెకు చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉంది. సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ కామెడీ క్వీన్ గా పేరు తెచ్చుకుంది.
5/6

Niharika NM Instagram: నిహారికకు సోషల్ మీడియాలో 6 మిలియన్స్ సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. సామాజిక అంశాలపై అవగాహన కల్పించేలా ఆమె వీడియోలు చేసింది, చేస్తోంది.
6/6

తెలుగు చిత్రసీమలోకి నిహారికను స్వాగతిస్తూ మెగా డాటర్ నిహారిక, నిర్మాత బన్నీ వాస్ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.
Published at : 04 Jul 2024 05:05 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఐపీఎల్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion