Shaitaan: మాంత్రికుడిగా భయపెడుతున్న మాధవన్ - ఆసక్తికరంగా జ్యోతిక, అజయ్ దేవగన్ ‘సైతాన్’ టీజర్
Shaitaan Teaser: అజయ్ దేవగన్, జ్యోతిక, మాధవన్ కీలక పాత్రల్లో పోషిస్తున్న ఒక డిఫరెంట్ హారర్ మూవీ త్వరలోనే బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే ‘సైతాన్’. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలయ్యింది.

Shaitaan Teaser Out Now: తాజాగా విడుదలయిన ‘సైతాన్’ టీజర్.. బాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. అజయ్ దేవగన్, జ్యోతిక, మాధవన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ‘సైతాన్’ మూవీ చేతబడి నేపథ్యంలో తెరకెక్కుతుందని మూవీ ఫస్ట్ లుక్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఈ సినిమా టీజర్‌లో ఆ విషయం మరింత క్లియర్‌గా తెలిసేలా చేశారు మేకర్స్. మాధవన్ వాయిస్ ఓవర్‌తోనే టీజర్ విడుదలయ్యింది. భయంకరమైన వాయిస్ ఓవర్, అంతకంటే భయంకరమైన విజువల్స్‌తో ‘సైతాన్’ టీజర్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఈ 90 సెకండ్ల టీజర్ చివర్లో అజయ్ దేవగన్, జ్యోతిక గ్లింప్స్ కూడా ఉంది.
మొదటిసారి అలాంటి పాత్రలో..
బ్లాక్ మ్యాజిక్, చేతబడి లాంటి కాన్సెప్ట్స్ ప్రస్తుతం టాలీవుడ్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇక అదే ట్రెండ్‌ను బాలీవుడ్ కూడా స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. గతకొంతకాలంగా అజయ్ దేవగన్ తనకు సూట్ అయ్యే కథలను ఎంచుకుంటూ హిట్లు కొడుతున్నాడు. అదే తరహాలో ‘సైతాన్’లాంటి డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక చాక్లెట్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న మాధవన్.. తన కెరీర్‌లోనే మునుపెన్నడూ చేయని పాత్రను చేస్తున్నట్టు అర్థమవుతోంది. ‘సైతాన్’లో చేతబడి చేసే వ్యక్తిగా మాధవన్ కనిపించనున్నాడని టీజర్ ద్వారా స్పష్టమవుతోంది. ఇక అజయ్ దేవగన్.. ఒక పైలెట్ పాత్రలో కనిపిస్తుండగా.. జ్యోతిక తన భార్య పాత్రను పోషించింది.
గుజరాతీ సినిమాకు రీమేక్‌గా..
‘సైతాన్’ అనేది ఒక పాపులర్ గుజరాతీ హారర్ మూవీ ‘వష్’కు రీమేక్‌గా తెరకెక్కింది. ‘వష్’.. గుజరాతీలో మంచి హిట్‌ను అందుకుంది. ఇప్పుడు అదే కథతో బాలీవుడ్‌లో హిట్ అందుకోవాలని అజయ్ దేవగన్ ప్రయత్నిస్తున్నాడు. ‘సైతాన్’ను వికాస్ బాహ్ల్ డైరెక్ట్ చేశాడు. జియో స్టూడియోస్, దేవగన్ ఫిల్మ్స్, పనోరమా స్టూడియోస్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. మార్చి 8న థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టడానికి ‘సైతాన్’ వచ్చేస్తున్నాడు. ఇప్పటికే మూవీ టీజర్.. సినిమాపై ఆసక్తి పెంచేయడంతో మూవీ నుండి వచ్చే తరువాతి అప్డేట్స్ ఎలా ఉంటాయా అని ప్రేక్షకులు ఎదురుచూడడం మొదలుపెట్టారు.
View this post on Instagram
సెకండ్ ఇన్నింగ్స్‌లో మొదటిసారి..
ఒకప్పుడు హీరోయిన్‌గా ఎన్నో హిట్లు తన ఖాతాలో వేసుకొని పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యింది జ్యోతిక. కానీ ఎక్కువకాలం వెండితెరకు దూరంగా ఉండలేకపోయింది. అందుకే కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్‌లో నటించిన ప్రతీ సినిమా.. తనకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. తాజాగా మలయాళంలో మమ్ముట్టి సరసన నటించిన ‘కాథల్’లో జ్యోతిక నటనకు ప్రశంసలు దక్కాయి. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో మొదటిసారిగా ఒక హిందీ చిత్రంలో నటించింది జ్యోతిక. అదే ‘సైతాన్’. ఇందులో కూడా తన పాత్రకు కావాల్సినంత ప్రాధాన్యత ఉంటుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. జ్యోతిక.. తన కెరీర్‌లో నటించింది కొన్ని హిందీ సినిమాల్లోనే అయినా.. ‘సైతాన్’ వల్ల మళ్లీ తనకు బాలీవుడ్‌లో కూడా అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: మెగా ప్రిన్సెస్ క్లీంకార అమ్మమ్మ ఇంట్లో ఒకరు, నానమ్మ ఇంట్లో మరొకరు - ఊహ తెలిసే వయసుకు ఇంకెన్నో?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

