Klin Kara Konidela: మెగా ప్రిన్సెస్ క్లీంకార అమ్మమ్మ ఇంట్లో ఒకరు, నానమ్మ ఇంట్లో మరొకరు - ఊహ తెలిసే వయసుకు ఇంకెన్నో?
Padma Vibhushan Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారం వరించింది. మెగా ఫ్యామిలీ అమితానందంతో ఉంది. ఇప్పుడు రామ్ చరణ్ కుమార్తె క్లీంకారకు అటు, ఇటు పద్మ విభూషణ్‌లు ఉన్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతుల కుమార్తె, మెగా మనవరాలు క్లీంకార కొణిదెల జననం నుంచి మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో అన్నీ శుభ ఘడియలు అని చెప్పాలి. ఒక గుడ్ న్యూస్ తర్వాత మరొక గుడ్ న్యూస్... వరుస సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మెగాభిమానులు, ప్రేక్షకుల నోట ఒక్కటే మాట... క్లీంకార పుట్టిన వేళా విశేషం, మెగా ఇంట మహాలక్ష్మి అడుగుపెట్టిన తర్వాత ఆ ఫ్యామిలీకి బాగా కలిసొచ్చిందని!
క్లీంకార తాత, ముత్తాత పద్మ విభూషణులే
మెగాస్టార్ చిరంజీవిని దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మ విభూషణ్ వరించింది. ఇప్పుడు మెగా మనవరాలు క్లీంకార పద్మ విభూషణుడి మనవరాలు అన్నమాట.
క్లీంకార తాతయ్య మాత్రమే కాదు... ఆమె ముత్తాత కూడా పద్మ విభూషణ్. దాంతో అటు అమ్మమ్మ ఇంట్లో, ఇటు నానమ్మ ఇంట్లో... రెండు వైపులా ఆమెకు పద్మ విభూషణ్‌లు ఉన్నారు. ఉపాసన తాతయ్య, అపోలో ఆస్పత్రుల వ్యవస్థాపకుడు ప్రతాప్ సి. రెడ్డిని 2010లో పద్మ విభూషణ్ వరించింది. ఆయనకు కూడా తొలుత పద్మభూషణ్, ఆ తర్వాత పద్మ విభూషణ్ వచ్చాయి.
Congratulations dearest Mamaya ❤️❤️❤️❤️ @KChiruTweets pic.twitter.com/4AtL1e7mJf
— Upasana Konidela (@upasanakonidela) January 25, 2024
ఇప్పడు ఉపాసన పద్మ విభూషణ్ చిరంజీవి కోడలు. అలాగే, మరో పద్మ విభూషణ్ ప్రతాప్ సి రెడ్డి మనవరాలు కూడా! ఉపాసన తల్లి శోభన కామినేని తండ్రి ప్రతాప్ సి రెడ్డి అనేది తెలిసిన విషయమే. మావయ్యకు అవార్డు వచ్చిన తరుణంలో తన సంతోషాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ''చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకును ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కంగ్రాట్స్'' అని ఉపాసన పేర్కొన్నారు. ''కంగ్యాట్స్ డియరెస్ట్ మావయ్య'' (ప్రియమైన మావయ్య గారికి శుభాకాంక్షలు) అని ట్వీట్ చేశారు. ఈ పురస్కారం వచ్చిన తరుణంలో తనకు మాటలు రావడం లేదని చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.
పద్మవిభూషణ్ పై చిరంజీవి ఫస్ట్ రియాక్షన్#MegastarChiranjeevi #PadmaVibhushan #tollywood #TeluguNews #ABPDesam pic.twitter.com/qFuKol3VJu
— ABP Desam (@ABPDesam) January 25, 2024
క్లీంకారకు ఊహ తెలిసే వయసుకు...
క్లీంకార కొణిదెలకు పట్టుమని పది నెలలు కూడా నిండలేదు. ఇప్పుడు ఆ చిన్నారికి 8 నెలలు నిండాయి. బహుశా... మెగా ఇంట్లో బుడి బుడి అడుగులు వేస్తూ ఉండొచ్చు. క్లీంకార నడిచే సమయానికి తాతయ్య చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చింది. ఆమెకు ఊహ తెలిసే సమయానికి ఇంకెన్ని అవార్డులు వస్తాయో? జస్ట్ వెయిట్ అండ్ సి! ఇది బిగినింగ్ అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఆ చిన్నారి మీద తెలియకుండా అందరూ ప్రెజర్ పడుతున్నట్లు ఉన్నారు కదూ!