Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP Desam
ఆయన చేతిలో పేపర్, పెన్సిల్ ఉంటే చాలు మిమ్మల్ని చూసి పావుగంటలో బొమ్మ గీసేస్తాడు.దేవుళ్ల చిత్రాలు, స్వతంత్ర సమరయోధులు, సినీ హీరో హీరోయిన్లు అంటే ఓకే మిమ్మల్ని చూస్తూ ఆన్ స్పాట్ లో బొమ్మ గీసే కళాకారులు అరుదుగా ఉంటారు. అలాంటి ఆర్టిస్టే జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కొత్త పేట గ్రామానికి చెందిన పోచయ్య. మనుషులను ఉన్నది ఉన్నట్లుగా ఇంత అందంగా చిత్రీకరిస్తున్న పోచయ్య జీవితం మాత్రం అంతే అందంగా ఏం లేదు. పోచయ్య తల్లితండ్రులిద్దరికీ మూగచెవుడు. 2017లో తల్లి మరణించటంతో చదువు మధ్యలోనే ఆపేశాడు. తర్వాత కొంతమంది ప్రోత్సాహంతో పనిచేసుకుంటూనే చదువుకుంటూ ఇంటర్ పూర్తి చేశాడు. ఫైన్ ఆర్ట్స్ ఎంట్రన్స్ లో స్టేట్ లో పదమూడో ర్యాంకు సాధించి నాలుగేళ్ల ఫైన్ ఆర్ట్స్ కోర్సును కంప్లీట్ చేశాడు పోచయ్యా. చాలా ప్రైవేట్ స్కూళ్లలో ఆర్ట్స్ టీచర్ పోస్ట్ కు అప్లికేషన్లు పెట్టుకున్నా ఫైన్ ఆర్ట్స్ పట్ల యాజమాన్యాలకు అంతగా ఆసక్తి లేకపోవటంతో ఇదిగో ఇలా పెన్సిల్ ఆర్ట్స్ వేస్తూ రోజు వెళ్లదీస్తున్నాడు.