అన్వేషించండి

BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!

Harish Rao: మాజీ మంత్రి హరీశ్ రావు గురువారం (జూలై 4) ఎక్స్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. అందులో ఓ రైతు తన పొలంలోనే పురుగుల మందు తాగి పడిపోయి ఉన్నాడు.

Telangana News: తెలంగాణ రైతుల ఆత్మహత్యలు జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్రంలో రైతుల చావులు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యం అవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడం దుర్మార్గమని అన్నారు. మొన్న ఖమ్మం జిల్లాలో ఓ రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలాడని గుర్తు చేశారు. తన సమస్యకు పరిష్కారం చూపడం లేదనే ఆవేదనతో నిన్న సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంకో రైతు ఆత్మహత్యకు యత్నించాడని అన్నారు. మళ్లీ ఈరోజు ఖమ్మం జిల్లా, కారేపల్లి మండలం, ఆలియా తండాలో మరో రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలేందుకు సిద్ధమయ్యాడని సంబంధిత వీడియోను హరీశ్ రావు షేర్ చేశారు.

హరీశ్ రావు గురువారం ఎక్స్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. అందులో ఓ రైతు తన పొలంలోనే పురుగుల మందు తాగి పడిపోయి ఉన్నాడు. అతని భార్య తన భర్తను చూసి రోదిస్తూ ఉండడం పలువుర్ని కంటతడి పెట్టిస్తోంది.

‘‘రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యం అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గం. ఖమ్మం జిల్లాలో మొన్న ఒక రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలితే, తన సమస్యకు పరిష్కారం చూపడం లేదనే ఆవేదనతో నిన్న సీఎం గారి సొంత జిల్లాలోనే ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. 
ఈ ఘటనలు మరువక ముందే నేడు ఖమ్మం జిల్లా, కారేపల్లి మండలం, ఆలియా తండాలో మరో రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలేందుకు సిద్ధమయ్యారు. 

రైతుల ఆత్మహత్యలు నివారించేందుకు, వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించకపోవడం బాధాకరం. ఈ ప్రభుత్వానికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ, పట్టెడన్నం పెట్టే రైతుల సంక్షేమం పట్ల లేదు. పురుగుల మందే రైతన్నలకు పెరుగన్నం అయ్యే దుర్భర పరిస్థితులను ఏడు నెలల కాంగ్రెస్ పాలన మళ్లీ తీసుకువచ్చింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని, రైతుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం’’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu: ప్రతీ రైతు ఇంటికి ప్రజాప్రతినిధులు, అధికారులు - ఏపీ సీఎం చంద్రబాబు వినూత్న కార్యక్రమం
ప్రతీ రైతు ఇంటికి ప్రజాప్రతినిధులు, అధికారులు - ఏపీ సీఎం చంద్రబాబు వినూత్న కార్యక్రమం
Bandi Sanjay: తెలంగాణలో ఆర్కే పాలన కొనసాగుతోందన్న బండి సంజయ్ - ఇంతకీ ఆర్కే ఎవరో తెలుసా?
తెలంగాణలో ఆర్కే పాలన కొనసాగుతోందన్న బండి సంజయ్ - ఇంతకీ ఆర్కే ఎవరో తెలుసా?
Telangana Local Elections:  తెలంగాణలో మూడు దశల్లో లోకల్ ఎన్నికలు - వారంలో షెడ్యూల్ - ఎస్‌ఈసీ సన్నాహాలు
తెలంగాణలో మూడు దశల్లో లోకల్ ఎన్నికలు - వారంలో షెడ్యూల్ - ఎస్‌ఈసీ సన్నాహాలు
రాపిడో డ్రైవర్  ఆదాయం నెలకు లక్ష...విషయం తెలిసి అవాక్కైన కస్టమర్..
రాపిడో డ్రైవర్ ఆదాయం నెలకు లక్ష...విషయం తెలిసి అవాక్కైన కస్టమర్..
Advertisement

వీడియోలు

Mukhi Cheetah Given birth Five Cubs | ఫలించిన ప్రాజెక్ట్ చీతా...కునో నేషనల్ పార్క్ లో సంబరాలు | ABP Desam
Shivanasamudra Elephant Rescue | ఏనుగును కాపాడే రెస్క్యూ ఆపరేషన్ చూశారా.? | ABP Desam
అతను పేపర్ కెప్టెన్ అంతే..  ధోనీ, రుతురాజ్‌పై కైఫ్ షాకింగ్ కామెంట్స్
బీసీసీఐ రూల్స్ బ్రేక్ చేసిన గిల్.. మరి పనిష్మెంట్ లేదా?
Suma about Her Retirement in Premiste Event | రిటైర్మెంట్ పై సుమ కామెంట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu: ప్రతీ రైతు ఇంటికి ప్రజాప్రతినిధులు, అధికారులు - ఏపీ సీఎం చంద్రబాబు వినూత్న కార్యక్రమం
ప్రతీ రైతు ఇంటికి ప్రజాప్రతినిధులు, అధికారులు - ఏపీ సీఎం చంద్రబాబు వినూత్న కార్యక్రమం
Bandi Sanjay: తెలంగాణలో ఆర్కే పాలన కొనసాగుతోందన్న బండి సంజయ్ - ఇంతకీ ఆర్కే ఎవరో తెలుసా?
తెలంగాణలో ఆర్కే పాలన కొనసాగుతోందన్న బండి సంజయ్ - ఇంతకీ ఆర్కే ఎవరో తెలుసా?
Telangana Local Elections:  తెలంగాణలో మూడు దశల్లో లోకల్ ఎన్నికలు - వారంలో షెడ్యూల్ - ఎస్‌ఈసీ సన్నాహాలు
తెలంగాణలో మూడు దశల్లో లోకల్ ఎన్నికలు - వారంలో షెడ్యూల్ - ఎస్‌ఈసీ సన్నాహాలు
రాపిడో డ్రైవర్  ఆదాయం నెలకు లక్ష...విషయం తెలిసి అవాక్కైన కస్టమర్..
రాపిడో డ్రైవర్ ఆదాయం నెలకు లక్ష...విషయం తెలిసి అవాక్కైన కస్టమర్..
Will KTR arrest: ఫార్ములా ఈ కేసులో  KTR ప్రాసిక్యూషన్‌కు తెలంగాణ గవర్నర్ అనుమతి - అరెస్టు చేసే అవకాశం ఉందా?
ఫార్ములా ఈ కేసులో KTR ప్రాసిక్యూషన్‌కు తెలంగాణ గవర్నర్ అనుమతి - అరెస్టు చేసే అవకాశం ఉందా?
UP twin marriages: ఒకే నెలలో రెండు పెళ్లిళ్లు -  భార్యలకు తెలిసిపోయింది -ఇక ఆ భర్త పరిస్థితి ఏంటో తెలుసా?
ఒకే నెలలో రెండు పెళ్లిళ్లు - భార్యలకు తెలిసిపోయింది -ఇక ఆ భర్త పరిస్థితి ఏంటో తెలుసా?
Nepal Gen Z: నేపాల్‌లో మళ్లీ అంటుకున్న జెడ్Z ఆవేశం - పలు చోట్ల కర్ఫ్యూ
నేపాల్‌లో మళ్లీ అంటుకున్న జెడ్Z ఆవేశం - పలు చోట్ల కర్ఫ్యూ
Temple Fire: భక్తితో వెలిగించిన దీపం ఆలయాన్ని బుగ్గి చేసింది - జాగ్రత్త లేని భక్తి - వీడియో వైరల్
భక్తితో వెలిగించిన దీపం ఆలయాన్ని బుగ్గి చేసింది - జాగ్రత్త లేని భక్తి - వీడియో వైరల్
Embed widget