Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
India's T20 World Cup Glory Celebrations: బార్బడోస్ లో దక్షిణాఫ్రికాను ఓడించి 2024 టీ20 వరల్డ్ కప్ ను గెలిచిన టీమిండియా భారత్ చేరుకుంది. ముంబైలోని విక్టరీ పరేడ్‌కు సిద్ధం అయ్యింది.
India's T20 World Cup Glory Celebrations: ముంబై జనసంద్రంలా మారింది. ముంబై విజయోత్సవంతో తడిసి ముద్దయింది. లక్షలాది అభిమానుల కోలహలాల మధ్య... టీ 20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు ముంబైలో అడుగుపెట్టింది. క్రికెటర్లకు ఘన స్వాగతం పలికేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ముంబైలో ఎటుచూసినా త్రివర్ణ పతాకాలే రెపరెపలాడాయి. మువ్వన్నెల జెండాలను చేతపట్టిన అభిమానులు... భారత్ మాతాకి జై నినాదాలతో గర్జిస్తున్నారు.
All in readiness for the #T20WorldCup Champions homecoming 🤩🇮🇳 pic.twitter.com/vCvvcJaIEZ
— ICC (@ICC) July 4, 2024
కనీవినీ ఎరుగని రీతిలో తరలివచ్చిన అభిమానులు జయహో భారత్ అంటూ నినదించారు. ఆ జన గర్జనలో సముద్ర ఘోష ఏ మాత్రం వినపడలేదు. నారిమన్ పాయింట్ నుంచి ముంబై వాంఖడే స్టేడియం వరకూ ఓపెన్ టాప్ బస్సులో టీమిండియా ఆటగాళ్లు.. భారీ జన సందోహం మధ్య ప్రయాణిస్తున్నారు. వాంఖడే స్టేడియంలో అభిమానులకు సన్మానం చేయనున్నారు. బీసీసీఐ ప్రకటించిన రూ.125 కోట్ల నజరానాను కూడా అందించనున్నారు.
#WATCH | Mumbai: A massive sea of people covers every inch of Marine Drive as fans cheer on and await Team India's arrival.
— ANI (@ANI) July 4, 2024
The team will have a victory parade shortly, to celebrate their #T20WorldCup2024 victory. pic.twitter.com/oibKAzzhZc
అంతకు ముందు ఎయిర్‌పోర్టు లో దిగిన ఆటగాళ్ళ విమానానికి ముందు మూడు కార్లు భారత జండాతో లాంఛనంగా స్వాగతం పలికాయి. టీం ఇండియా ఆటగాళ్ళను కలవడానికి అభిమానులు బారులు తీరారు.
#WATCH | Team India - the #T20WorldCup2024 champions - arrives in Mumbai. They will have a victory parade here in the city shortly, to celebrate their victory.
— ANI (@ANI) July 4, 2024
(Video - Mumbai International Airport Limited) pic.twitter.com/mSehaLmsNZ