Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Pinnelli Issue : ఈవీఎంల ధ్వంసం ఘటనలో పిన్నెల్లిని జగన్ సమర్థించడంపై టీడీపీ విమర్శలు గుప్పించింది. జగన్ మానసిక స్థితి తేడాగా ఉందని మండిపడింది.
TDP criticized Jagan support To Pinnelli : ఈవీఎంలను ధ్వంసం చేయడంతో పాటు మూడు హత్యాయత్నం కేసుల్లో ముందస్తు బెయిల్ కొట్టి వేయడంతో జైలుకు వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు ఆ తర్వాత చేసిన వ్యాఖ్యల్లో ఈవీఎంలను ధ్వంసం చేయడం తప్పేం కాదని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు టీడీపీ, జనసేన నేతలు మండిపడుతున్నారు.
పిన్నెల్లిని జగన్ ఏమని సమర్థించారంటే ?
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై అన్యాయమైన రీతిలో ఆయనపై కేసులు బిగించారు. " గ్రామంలో ఉన్న ఎస్సీలు ఓటు వేసే పరిస్థితి లేకపోవడంతో, మా ఎమ్మెల్యే ఎస్పీకి ఫోన్ చేసినా స్పందన లేకపోయింది. సున్నితమైన ఏరియాలో ఉన్న ఆ బూత్ లో కేవలం ఒక హోంగార్డును సెక్యూరిటీగా పెట్టారు. ఆ బూత్ లో అన్యాయం జరుగుతుండడంతో ఎమ్మెల్యే లోపలికి వెళ్లి ఈవీఎం పగులగొట్టాడు. వైసీపీకే ఓట్లు పడుతుంటే ఎమ్మెల్యే వెళ్లి ఈవీఎంను పగులగొట్టాల్సిన అవసరం ఏముంది? అక్కడికి వెళ్లినప్పుడు జరుగుతున్న అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవీఎంను పగులగొట్టాడు! ఈవీఎంను పగులగొట్టిన కేసులో తనకు బెయిల్ వచ్చింది. ఇవాళ తను లోపల ఉంది ఈవీఎంను పగులగొట్టిన కేసులో కాదు." అని జగన్ అన్నారు.
టీడీపీ విమర్శలు
అహంకారానికి, ఇదే అణచివేతకు ప్రజలు చాచి పెట్టి కొట్టి 2 వారాలు అవ్వలేదు...మానసికస్థితి సరిగ్గా లేని ఇతన్ని సొంత తల్లి, చెల్లి దూరం పెట్టారు. ప్రజలు ఎందుకు ఈ భారం భరించడం? ఇలాంటి వాడికి ఆ 11 కూడా ప్రజలు ఇవ్వకూడదు. పులివెందుల ప్రజలు కూడా ఈ సైకోని ఎంత తొందరగా వదిలించుకుంటే మీ ప్రాంతానికి అంత మంచిదని టీడీపీ మండిపడింది. ఈవీఎంల ధ్వంసం చేయడాన్ని సమర్థించడం ఏమిటని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు.
వైసీపీ ఉంటుందో..లేదో..చూసుకో జగన్ మోహన్ రెడ్డి ..ఈవీఎం పగలగొట్టి, హత్యాయత్నం చేస్తే తప్పు లేదా..ఐదేళ్లలో లెక్కకు మించి పాపాలు చేశారు..కాబట్టే ఈ రోజు ఫలితం అనుభవిస్తున్నారు.: సోమిరెడ్డి, MLA సర్వెపల్లి (మాజీ మంత్రి )@Somireddycm @JaiTDP @iTDP_Official pic.twitter.com/lFHj1gxv2s
— iTDP Nellore Parliament (@iTDP_NellorePC) July 4, 2024
నాగబాబు విమర్శలు
ఈవీఎంల ధ్వంసాన్ని జగన్ సమర్థించడాన్ని జనసేన తప్పు పట్టింది. జగన్ మోహన్ రెడ్డి గారు మీరేం మాట్లడుతున్నారో మీకు అర్ధమవుతుందా అని నాగబాబు ప్రశ్నిచారు. కోపమొచ్చి E.V.M లు పగలగొట్టారా.. ఒకవేళ నిజంగా అన్యాయం జరగుంటే అక్కడ పోలిస్ సిబ్బంది లేరా ఎన్నిల సిబ్బంది లేరా.. ఆర్వో లేరా అని ప్రశ్నంచారు. మారకపోతే ఈసారి సింగల్ డిజిట్ నే కట్టబెట్టడానికి సిద్ధంగా ఉంటారుని హెచ్చరించారు.
జగన్ మోహన్ రెడ్డి గారు మీరేం మాట్లడుతున్నారో మీకు అర్ధమవుతుందా?
— Naga Babu Konidela (@NagaBabuOffl) July 4, 2024
కోపమొచ్చి E.V.M లు పగలగొట్టార??
ఒకవేళ నిజంగా అన్యాయం జరగుంటే అక్కడ పోలిస్ సిబ్బంది లేరా Election సిబ్బంది లేరా?R.O లేరా??
ఇవన్నీ ఆలోచించకుండా కోపమొచ్చి పగలగొట్టేస్తే దాన్ని సమర్దిస్తార మీరు??
ఏం మాట్లడుతున్నారండి…
పిన్నెల్లిని సమర్థించిన తీరుపై విమర్శలు
పిన్నెల్లిని జగన్ సమర్థించిన తీరుపై రాజకీయ వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. మాచర్లలో అరాచకాలపై అనేక ఆరోపణలు వస్తున్న సమయంలో ఇలా మాజీ ఎమ్మెల్యేలను పరామర్శించి ఆయన తప్పులన్నీ కరెక్టేనని వాదించడం చర్చనీయాంశం అయింది.