అన్వేషించండి

Nithiin First Look: డబ్బు చాలా చెడ్డది, దోచుకున్న నితిన్ - కొత్త సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ చూశారా?

Nithiin Robinhood movie first look: నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాకు 'రాబిన్ హుడ్' టైటిల్ ఖరారు చేశారు. ఇంట్రెస్టింగ్ టైటిల్ టీజర్ విడుదల చేశారు.

నితిన్ కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న సినిమాకు 'రాబిన్ హుడ్' టైటిల్ ఖరారు చేశారు. 'భీష్మ' విజయం తర్వాత వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న చిత్రమిది. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు వీడియో గ్లింప్స్ కూడా విడుదల చేశారు. నితిన్ క్యారెక్టర్ మరింత రివీల్ చేయడంతో పాటు ఆయనతో చెప్పించిన డైలాగులు సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేసేలా ఉన్నాయి.

డబ్బు చాలా చెడ్డది... దోచుకున్న నితిన్!
'రాబిన్ హుడ్' టైటిల్ అనౌన్స్ చేయక ముందు... సినిమాలో నితిన్ కాన్ మ్యాన్ (మోసగాడు) రోల్ చేస్తున్నారని చిత్ర బృందం వెల్లడించింది. ఇప్పుడు క్యారెక్టర్ గురించి మరింత డిటైల్డ్‌గా వీడియో గ్లింప్స్‌లో వివరించారు. సినిమా టైటిల్‌కు తగ్గట్టు డబ్బునోళ్ల దగ్గర దోచుకునే యువకుడిగా నితిన్ పాత్రను చూపించారు. 

''డబ్బు చాలా చెడ్డది...
రూపాయి రూపాయి నువ్ ఏం చేస్తావ్ అంటే?
'అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య చిచ్చు పెడతాను' అంటాది.
అన్నట్టే చేసింది.
దేశం అంత కుటుంబం నాది… ఆస్తులున్నోళ్లంతా నా అన్నదమ్ములు, ఆభరణాలు వేసుకున్నోళ్లంతా నా అక్క చెల్లెళ్ళు. అవసరం కొద్దీ వాళ్ళ జేబుల్లో చేతులు పెడితే? ఫామిలీ మెంబెర్ అని కూడా చూడకుండా నా మీద కేసులు పెడుతున్నారు.
అయినా నేను హర్ట్ అవ్వలేదు. ఎందుకంటే... వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం నా హక్కు! మై బేసిక్ రైట్! బికాజ్... ఇండియా ఈజ్ మై కంట్రీ! ఆల్ ఇండియన్స్ అర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్!'' అని నితిన్ తనను తాను పరిచయం చేసుకున్నారు. అంటే... తన క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఇచ్చారు. అదీ సంగతి! డబ్బు, నగలు దోచుకోవడానికి వెళ్లేటప్పుడు నితిన్ శాంటా క్లాజ్ గెటప్ వేసుకోవడం భలే ఉందని నెటిజనులు చెబుతున్నారు.

Also Readచిరంజీవికి ముందు పద్మ విభూషణ్ అందుకున్న హీరోలు ఎవరు... ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరెవరికి ఆ అవార్డు వచ్చిందో తెలుసా?

దోచుకున్న డబ్బు ఏం చేశారు?
ప్రస్తుతానికి విడుదల చేసింది వీడియో గ్లింప్స్ మాత్రమే కాబట్టి... క్యారెక్టర్ వరకు ఇంట్రడ్యూస్ చేశారు. మరి, ఆ దోచుకున్న డబ్బును హీరో ఏం చేశాడు? అనేది ఇప్పుడు సస్పెన్స్. 'ఛలో', 'భీష్మ'... వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన రెండు సినిమాల్లోనూ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు నచ్చింది. ఈసారి వినోదంతో పాటు ఓ సందేశంతో కూడిన కథను వెంకీ కుడుముల చెప్పబోతున్నట్టు అర్థం అవుతోంది. ఈ క్యారెక్టర్ కోసం నితిన్ స్టైలిష్‌గా మేకోవర్ అయ్యారు.

Also Readపద్మ విభూషణ్‌కు ముందు చిరంజీవికి వచ్చిన అవార్డులు, లభించిన సత్కారాలు తెలుసా?

'రాబిన్ హుడ్' సినిమాలో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో సందడి చేయనున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అయితే... ఇంకా ఈ సినిమాలో కథానాయిక పేరును చెప్పలేదు. తొలుత రష్మికను ఎంపిక చేసినా... డేట్స్ అడ్జస్ట్ కాక ఆమె వెళ్లిపోయారు. రష్మిక బదులు శ్రీ లీలను ఎంపిక చేసినట్టు సమాచారం. ఇంకా ఈ సినిమాకు సీఈవో: చెర్రీ, ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్.

టాప్ హెడ్ లైన్స్

Gundeninda Gudigantalu July21th Episode:బాలు ఎత్తుకు చిత్తయిన చింతామణి...డబ్బుతో సహా పట్టుబడిన మేనేజర్‌
గుండెనిండా గుడిగంటలు: బాలు ఎత్తుకు చిత్తయిన చింతామణి...డబ్బుతో సహా పట్టుబడిన మేనేజర్‌
Karthika Deepam 2 Serial Today July 21st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నకి వెరైటీగా ప్రపోజ్ చేసిన సూరజ్! కుడి కాలు బొటన వేలికే ఎందుకు అలా అయిందంట!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నకి వెరైటీగా ప్రపోజ్ చేసిన సూరజ్! కుడి కాలు బొటన వేలికే ఎందుకు అలా అయిందంట!
Aishwarya Sindogi: బిగ్ బాస్ బ్యూటీకి వేధింపులు... కంప్లైంట్‌తో ఎఫ్ఐఆర్ నమోదు
బిగ్ బాస్ బ్యూటీకి వేధింపులు... కంప్లైంట్‌తో ఎఫ్ఐఆర్ నమోదు
Preethi Sharma: టాటూలంటే పిచ్చి.. టిక్‌టాక్ టు సీరియల్స్.. ‘పడమటి సంధ్యారాగం’ ప్రీతి శర్మ రియల్ లైఫ్ విషయాలు
టాటూలంటే పిచ్చి.. టిక్‌టాక్ టు సీరియల్స్.. ‘పడమటి సంధ్యారాగం’ ప్రీతి శర్మ రియల్ లైఫ్ విషయాలు

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Assembly Seats Increase: డీలిమిటేషన్ పార్లమెంట్‌కేనా.. అసెంబ్లీలకూ పెరుగుతాయా? తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు గ్యారంటీ ఎంత?
డీలిమిటేషన్ పార్లమెంట్‌కేనా.. అసెంబ్లీలకూ పెరుగుతాయా? తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు గ్యారంటీ ఎంత?
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
Trainee IPS Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ లైంగిక వేధింపుల కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నంలో మరో ట్విస్ట్
ట్రైనీ ఐపీఎస్‌ లైంగిక వేధింపుల కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నంలో మరో ట్విస్ట్, అంతా డ్రామానే!
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Rains In AP and Telangana: తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన.. ఏపీలో ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన.. ఏపీలో ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
తిరుమల యాత్రలో వారాహి అమ్మవారి దర్శనం: కోరికలు తీర్చే శ్రీశక్తిపీఠం రహస్యం!
తిరుమల యాత్రలో వారాహి అమ్మవారి దర్శనం: కోరికలు తీర్చే శ్రీశక్తిపీఠం రహస్యం!
Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Embed widget