అన్వేషించండి

Chiranjeevi: 'పద్మవిభూషణ్‌' చిరంజీవికి అభినందనల వెల్లువ.. రామ్‌ చరణ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

Celebrities Wishes to Chiranjeevi: పద్మవిభూషణ్ అవార్డుకు ఎన్నికైన చిరంజీవికి సెలబ్రిటీల నుంచి శుభాకాంకలు వెల్లువెత్తున్నాయి. ఈ సందర్భంగా రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు.

Telugu Celebrities Congratulation to Chiranjeevi: కేంద్ర ప్రభుత్వం నిన్న పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలోని సినీ, కళారంగం, విద్య, వ్యాపారం, సాంకేతిక రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందిస్తుంది. ప్రతి ఏటా రిపబ్లిక్‌డే సందర్భంగా ప్రకటించే ఈ అవార్డులకు మన తెలుగు తేజాలు ఉండటం విశేషం. ఇందులో మెగాస్టార్‌ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి పద్మవిభూషణ్‌ వరించాయి, తెలంగాణకు చెంది పలువురు కళాకారులకు పద్మ అవార్డులకు ఎన్నికయ్యారు.

ఇక కళారంగంలో అందించిన విశేష సేవలకు గానూ చిరంజీవికి పద్మవిభూషణ్‌ వరించింది. ఈ సందర్భంగా ఆయనకు సినీ రాజకీయ ప్రముఖుల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తున్నాయి. ఆయన తమ్ముడు, జనసేన అధినేత పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేకంగా విషెస్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు. అలాగే తనయుడు రామ్ చరణ్, మెగా కోడలు ఉపాసన కొణిదెల, మెగా హీరోలు వరుణ్‌ తేజ్, సాయి ధరమ్‌ తేజ్‌, దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, మహేష్ బాబు వంటి స్టార్స్‌ ఆయనకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.

'స్వయంకృషి'తో ఎదిగిన అన్నయ్యకు..

"భారత చలన చిత్రసీమలో తనదైన ప్రత్యేక స్థానాన్ని స్వయంకృషితో సాధించుకున్న అన్నయ్య శ్రీ చిరంజీవి గారిని 'పద్మవిభూషణ్' పురస్కారం వరించడం ఎనలేని సంతోషాన్ని కలిగించింది. నటనలోకి ఎంతో తపనతో అడుగుపెట్టిన అన్నయ్య తనకు వచ్చిన ప్రతి పాత్రను, చిత్రాన్నీ మనసుపెట్టి చేశారు. కాబట్టే ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు. అగ్రశ్రేణి కథానాయకుడిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. సామాజిక సేవా రంగంలో అన్నయ్య చిరంజీవి గారు చేస్తున్న సేవలు ఎందరికో ఆదర్శం. పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన శుభ సందర్భంగా శ్రీ చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను" అని పవన్ కల్యాణ్ తన ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు.

భారత ప్రభుత్వానికి ఎనలేని కృతజ్ఞతలు: రామ్‌ చరణ్‌

తండ్రికి ప్రతిష్టాత్మక అవార్డు దక్కడంపై గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఉప్పోంగిపోయాడు. చిరు విషెస్‌ చెబుతూ ఎమోషన్‌ పోస్ట్‌ షేర్‌ చేశాడు. "ప్రతిష్టాత్మకమైన 'పద్మవిభూషణ్‌' అవార్డుకు ఎన్నికైన @KChiruTweets అభినందనలు. భారతీయ సినిమా, సమాజానికి మీరు అందించిన సహకారం నాలో స్ఫూర్తి నింపాయి. అలాగే అసంఖ్యాక అభిమానులను ప్రేరేపించడంలోనూ కీలక పాత్ర పోషించింది. మీరు ఈ  దేశానికి నిష్కళంకమైన పౌరులు.." అంటూ రాసుకొచ్చారు. అనంతరం భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోదీకి చరణ్‌ కృతజ్ఞతలు తెలిపాడు.

ఎక్కడి నుంచో వచ్చి..

రాజమౌళి ట్వీట్‌ చేస్తూ.. "ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి, భారతదేశంలోనే రెండవ అత్యున్నత పౌర పురస్కారం గ్రహీతగా పునాధిరాళ్లు కోసం మొదటి రాయి వేసిన ఒక కుర్రాడు... మీ ప్రయాణం తరతరాలకు స్ఫూర్తినిస్తుంది చిరంజీవి గారూ.. పద్మవిభూషణ్ అందుకున్న మీకు అభినందనలు" విషెస్‌ తెలిపారు.

'రాబోయే తరాలకు స్ఫూర్తి..'

పద్మవిభూషణ్‌ అవార్డుకు ఎన్నికైన చిరంజీవి, వెంకయ్య నాయుడికి జూనియర్‌ ఎన్టీఆర్‌ శుభకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్‌లో పోస్ట్‌ షేర్‌ చేశారు. "చిరంజీవి,  భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇద్దరినీ అభినందిస్తూ.. “పద్మ విభూషణ్ అందుకున్నందుకు @MVenkaiahNaidu గారు మరియు @KChiruTweets గారికి అభినందనలు! అలాగే పద్మ అవార్డులు అందుకున్న వారందరికీ అభినందనలు. మీ అద్భుతమైన విజయం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది…” అని పేర్కొన్నారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP 10th class exam Dates: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల -ఇదిగో ఫుల్ టైంటేబుల్
ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల -ఇదిగో ఫుల్ టైంటేబుల్
Four Labour Codes: కేంద్రం సంచలనం - 29 కార్మిక చట్టాల రద్దు - కొత్తగా నాలుగు లేబర్ కోడ్స్ - ఇవిగో డీటైల్స్
కేంద్రం సంచలనం - 29 కార్మిక చట్టాల రద్దు - కొత్తగా నాలుగు లేబర్ కోడ్స్ - ఇవిగో డీటైల్స్
Sathya SaiBaba guests: వీఐపీల రాకతో కళకళాడుతున్న పుట్టపర్తి - బాబా శతజయంతి వేడుకలకు బీజేపీ అగ్రనేతల రాక
వీఐపీల రాకతో కళకళాడుతున్న పుట్టపర్తి - బాబా శతజయంతి వేడుకలకు బీజేపీ అగ్రనేతల రాక
Tejas Fighter Jet :దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం, కుప్పకూలిన తేజస్ ఫైటర్ జెట్ , వీడియో వైరల్
దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం, కుప్పకూలిన తేజస్ ఫైటర్ జెట్ , వీడియో వైరల్
Advertisement

వీడియోలు

Akhanda 2 Thaandavam Trailer Reaction | బాబోయ్ బాలయ్యా...వన్ మ్యాన్ ఆర్మీగా మారి యుద్ధం | ABP Desam
India vs South Africa 2nd Test | రేపటి నుంచి రెండో టెస్ట్ మ్యాచ్
India vs South Africa ODI | రోహిత్, కోహ్లీ రీఎంట్రీ !
World Boxing Cup Finals 2025 | 20 పతకాలు సాధించిన ఇండియన్‌ ప్లేయర్స్‌
IPL Auction 2026 | ఐపీఎల్ 2026 మినీ వేలం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP 10th class exam Dates: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల -ఇదిగో ఫుల్ టైంటేబుల్
ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల -ఇదిగో ఫుల్ టైంటేబుల్
Four Labour Codes: కేంద్రం సంచలనం - 29 కార్మిక చట్టాల రద్దు - కొత్తగా నాలుగు లేబర్ కోడ్స్ - ఇవిగో డీటైల్స్
కేంద్రం సంచలనం - 29 కార్మిక చట్టాల రద్దు - కొత్తగా నాలుగు లేబర్ కోడ్స్ - ఇవిగో డీటైల్స్
Sathya SaiBaba guests: వీఐపీల రాకతో కళకళాడుతున్న పుట్టపర్తి - బాబా శతజయంతి వేడుకలకు బీజేపీ అగ్రనేతల రాక
వీఐపీల రాకతో కళకళాడుతున్న పుట్టపర్తి - బాబా శతజయంతి వేడుకలకు బీజేపీ అగ్రనేతల రాక
Tejas Fighter Jet :దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం, కుప్పకూలిన తేజస్ ఫైటర్ జెట్ , వీడియో వైరల్
దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం, కుప్పకూలిన తేజస్ ఫైటర్ జెట్ , వీడియో వైరల్
Jagan letter to Chandrababu: కృష్ణా జలాలపై హక్కులు కాపాడండి - చంద్రబాబుకు జగన్ 9 పేజీల లేఖ
కృష్ణా జలాలపై హక్కులు కాపాడండి - చంద్రబాబుకు జగన్ 9 పేజీల లేఖ
KTR Vs Revanth Reddy:
"నన్ను అరెస్టు చేసే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు" కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు 
Rajamouli : రాజమౌళిపై దేవుడికి లేని కోపం మీకెందుకు? - హనుమాన్ కామెంట్స్ కాంట్రవర్సీ... RGV సెన్సేషనల్ కామెంట్స్
రాజమౌళిపై దేవుడికి లేని కోపం మీకెందుకు? - హనుమాన్ కామెంట్స్ కాంట్రవర్సీ... RGV సెన్సేషనల్ కామెంట్స్
Deekshith Shetty : రష్మిక ఎంగేజ్మెంట్‌పై క్వశ్చన్ - 'ది గర్ల్ ఫ్రెండ్' హీరో దీక్షిత్ రియాక్షన్
రష్మిక ఎంగేజ్మెంట్‌పై క్వశ్చన్ - 'ది గర్ల్ ఫ్రెండ్' హీరో దీక్షిత్ రియాక్షన్
Embed widget