‘హాయ్ నాన్న’ రివ్యూ, ‘యానిమల్’ ఓటీటీ రిలీజ్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
బాలకృష్ణ కొత్త సినిమాలో తెలుగమ్మాయికి ఛాన్స్
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ఓ భారీ సినిమా రూపొందుతోంది. 'వాల్తేరు వీరయ్య' విజయం తర్వాత బాబీ కొల్లి (కె ఎస్ రవీంద్ర) దర్శకత్వంలో ఆయన ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఇందులో ఓ తెలుగు అమ్మాయి నటిస్తున్నారు. తెలుగు అమ్మాయి, యువ కథానాయిక చాందిని చౌదరి సైతం ఓ పాత్రలో యాక్ట్ చేస్తున్నారని ఈ రోజు క్లారిటీ వచ్చింది. సెట్స్ నుంచి బాబీ, మరొకరితో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో చాందిని చౌదరి షేర్ చేశారు. ఆ ఫోటోకు 'కూల్ కిడ్స్' అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
థియేటర్లలోకి 'డెవిల్' వచ్చేది ఆ రోజే - కళ్యాణ్ రామ్ ఇయర్ ఎండ్ కిక్!
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ 'డెవిల్'. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్... అనేది ఉప శీర్షిక. అభిషేక్ నామా నిర్మాత. ఈ సినిమాతో ఆయన దర్శకుడిగానూ పరిచయం అవుతున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. డిసెంబర్ 29న 'డెవిల్' చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకు వస్తామని అభిషేక్ నామా అనౌన్స్ చేశారు. ఇయర్ ఎండ్‌కు కళ్యాణ్ రామ్ కిక్ ఇవ్వనున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ఓ ఇంటివాడైన దగ్గుబాటి వారసుడు - అభిరామ్ పెళ్లి ఫోటోలు చూశారా?
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో యువ కథానాయకుడు ఓ ఇంటివాడు అయ్యాడు. మరో అగ్ర కుటుంబంలో పెళ్లి ఘనంగా జరిగింది. నిర్మాత డి. సురేష్ బాబు రెండో తనయుడు, రానా తమ్ముడు, యువ హీరో దగ్గుబాటి అభిరామ్ (Daggubati Abhiram) ఓ ఇంటి వాడు అయ్యారు. డిసెంబర్ 6వ తేదీన అంటే గురువారం బంధువుల అమ్మాయి ప్రత్యూషతో ఆయన ఏడు అడుగులు వేశారు. ఈ పెళ్లి కోసం దగ్గుబాటి ఫ్యామిలీ శ్రీలంక వెళ్లిన సంగతి తెలిసిందే. శ్రీలంకలోని ఓ రిసార్టులో అభిరామ్, ప్రత్యూష వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు. వాళ్ళ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'యానిమల్' ఓటీటీలోకి వచ్చేది ఆ రోజేనా? అసలు నిజం ఏమిటంటే?
'యానిమల్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. హిందీ సినిమాలకు మల్టీప్లెక్స్ యాజమాన్యాలు ఓ రూల్ పెట్టాయి... థియేటర్లలో విడుదలైన ఆరు వారాల తర్వాత ఓటీటీలో సినిమాను విడుదల చేయాలని! నాలుగు వారాలకు స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం చేసుకున్న సినిమాలను మల్టీప్లెక్స్ స్క్రీన్లలో ప్రదర్శించడం లేదు. అందుకని, ఆరు నుంచి ఎనిమిది వారాల తర్వాత నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తోందట. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
హాయ్ నాన్న రివ్యూ : నాని అంత ఏడిపించేశాడా? కర్చీఫ్, టవల్స్ తీసుకువెళ్లక తప్పదా?
'దసరా' విజయం తర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన సినిమా 'హాయ్ నాన్న'. దసరా మాస్ అయితే... హాయ్ నాన్న క్లాస్! ఈ సినిమాలో 'సీతారామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్. 'బేబీ' కియారా ఖన్నా కీలక పాత్రలో నటించింది. మనసుకు హాయినిచ్చేలా ప్రచార చిత్రాలు, పాటలు ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ రోజు సినిమా విడుదలైంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)