Animal OTT Release: 'యానిమల్' ఓటీటీలోకి వచ్చేది ఆ రోజేనా? అసలు నిజం ఏమిటంటే?
Animal Movie OTT Release Date: 'యానిమల్' థియేటర్లలో రికార్డు వసూళ్లు సాధిస్తోంది. మరి, ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది? బాలీవుడ్ వర్గాల్లో వినబడుతున్న సమాచారం ప్రకారం...
Animal Movie OTT release date Netflix: ఇండియన్ సినిమా బాక్సాఫీస్ చరిత్రలో 'యానిమల్' సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఆల్రెడీ ఈ సినిమా రూ. 500 కోట్ల కలెక్షన్స్ మార్క్ చేరుకుంది. మరిన్ని రికార్డులు క్రియేట్ చేసే దిశగా ముందుకు వెళుతోంది.
'యానిమల్' సినిమాలో రణబీర్ కపూర్ నటనకు ప్రేక్షక లోకం ఫిదా అంటోంది. మరీ ముఖ్యంగా యువత ఆయనకు జేజేలు పలుకుతున్నారు. కేవలం నార్త్ ఇండియాలో మాత్రమే కాదు... సౌత్ ఇండియాలో, తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వసూళ్లు నమోదు చేస్తోందీ సినిమా. థియేటర్లలో కలెక్షన్స్ దుమ్ము దులుపుతున్న ఈ సినిమా ఓటీటీ వేదికల్లోకి ఎప్పుడు వస్తుంది? అంటే...
సంక్రాంతికి ఓటీటీలో 'యానిమల్'?
Animal movie digital streaming platform: 'యానిమల్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. హిందీ సినిమాలకు మల్టీప్లెక్స్ యాజమాన్యాలు ఓ రూల్ పెట్టాయి... థియేటర్లలో విడుదలైన ఆరు వారాల తర్వాత ఓటీటీలో సినిమాను విడుదల చేయాలని! నాలుగు వారాలకు స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం చేసుకున్న సినిమాలను మల్టీప్లెక్స్ స్క్రీన్లలో ప్రదర్శించడం లేదు. అందుకని, ఆరు నుంచి ఎనిమిది వారాల తర్వాత నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తోందట.
Also Read: హాయ్ నాన్న ఆడియన్స్ రివ్యూ : నాని అంత ఏడిపించేశాడా? కర్చీఫ్, టవల్స్ తీసుకువెళ్లక తప్పదా?
థియేటర్లలో డిసెంబర్ 1న 'యానిమల్' విడుదల అయ్యింది. సంక్రాంతికి ఓటీటీలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని హిందీ చిత్రసీమ వర్గాల సమాచారం. ఒకవేళ సంక్రాంతికి లేదంటే రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల చేసే ఛాన్సులు ఉన్నాయట! అధికారికంగా అయితే 'యానిమల్' ఓటీటీ విడుదల తేదీని ఇంకా అనౌన్స్ చేయలేదు. అదీ సంగతి! చాలా మంది 'యానిమల్' ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయినట్లు ఇస్తున్నారు. కానీ, అందులో నిజం లేదు.
'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్' తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ అయ్యే సినిమా చేశారు. హిందీ రివ్యూ రైటర్స్ సినిమాకు బావుందని చెప్పలేదు. కానీ, ప్రేక్షకులు మాత్రం బ్రహ్మరథం పడుతున్నారు.
'యానిమల్' విడుదల తర్వాత నేషనల్ క్రష్ రష్మికా మందన్నా పేరు వార్తల్లో నిలిచింది. సినిమాలో ఓ సన్నివేశం పట్ల ప్రశంసలు, విమర్శలు వ్యక్తం అయ్యాయి. డీప్ ఫేక్ వీడియో మీద రచ్చ చేసిన రష్మిక, అటువంటి సీన్ చేయడం ఏమిటి? అని కొందరు విమర్శిస్తే... కథను, క్యారెక్టర్లను అర్థం చేసుకుని అలా నటించడానికి గట్స్ ఉండాలని కొందరు కాంప్లిమెంట్ ఇస్తున్నారు. ఇంటర్వెల్ తర్వాత వచ్చే మరో హీరోయిన్ తృప్తి దిమ్రి కుర్రకారు హృదయాలను దోచుకున్నారు. ఆమె ఎవరు? అంటూ చాలా మంది గూగుల్ చేశారు.