Abhiram Daggubati Marriage : ఓ ఇంటివాడైన దగ్గుబాటి వారసుడు - అభిరామ్ పెళ్లి ఫోటోలు చూశారా?
Daggubati Abhiram wedding photo: ప్రముఖ నిర్మాత సురేష్ బాబు రెండో కుమారుడు, రానా తమ్ముడు, యువ హీరో అభిరామ్ ఓ ఇంటివాడు అయ్యారు. నిన్న పెళ్లి చేసుకున్నారు. ఆయన పెళ్లి ఫోటోలు చూశారా?
Abhiram Daggubati Pratyusha Wedding Photos: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో యువ కథానాయకుడు ఓ ఇంటివాడు అయ్యాడు. మరో అగ్ర కుటుంబంలో పెళ్లి ఘనంగా జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే...
తెలుగు చిత్రసీమలో అగ్ర కుటుంబాలలో దగ్గుబాటి ఫ్యామిలీ ఒకటి. మూవీ మొఘల్ డి. రామానాయుడు తర్వాత తరంలో ఆయన కుమారులు ఇద్దరూ వారసత్వాన్ని నిలబెట్టారు. రామానాయుడి పెద్ద కుమారుడు సురేష్ బాబు నిర్మాతగా, స్టూడియో నిర్వహణలో మంచి పేరు తెచ్చుకున్నారు. రెండో కుమారుడు వెంకటేష్ హీరోగా విజయవంతంగా కొనసాగుతున్నారు. దగ్గుబాటి ఫ్యామిలీ మూడో తరం సైతం సినిమాల్లో ఉంది. సురేష్ బాబు పెద్ద కుమారుడు రానా హీరోగా, నిర్మాతగా విజయాలు అందుకున్నారు. ఆయన తమ్ముడు అభిరామ్ దగ్గుబాటి 'అహింస' సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు.
ప్రత్యూషతో ఏడు అడుగులు వేసిన అభిరామ్!
నిర్మాత డి. సురేష్ బాబు రెండో తనయుడు, రానా తమ్ముడు, యువ హీరో దగ్గుబాటి అభిరామ్ (Daggubati Abhiram) ఓ ఇంటి వాడు అయ్యారు. డిసెంబర్ 6న... అంటే గురువారం బంధువుల అమ్మాయి ప్రత్యూషతో ఆయన ఏడు అడుగులు వేశారు. ఈ పెళ్లి కోసం దగ్గుబాటి ఫ్యామిలీ శ్రీలంక వెళ్లిన సంగతి తెలిసిందే.
శ్రీలంకలోని ఓ రిసార్టులో అభిరామ్, ప్రత్యూష వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు. వాళ్ళ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Best wishes and hearty congratulations to Abhiram Daggubati🎉🎉 https://t.co/NxwIKbHoP0 pic.twitter.com/wUMxXe6igy
— Nagaraja Reddy (@NagarajaReddyS) December 7, 2023
Happy Married Life Abhiram Babu 😍#AbhiPrathyusha ❤️ pic.twitter.com/Mb73S1voZh
— Raja⚡ (@VenkyYuvasena_) December 6, 2023
డెస్టినేషన్ వెడ్డింగ్ కావడంతో బంధువులతో పాటు అతికొద్ది మందిని మాత్రమే ఆహ్వానించారు. శ్రీలంక నుంచి దగ్గుబాటి ఫ్యామిలీ తిరిగి వచ్చిన తర్వాత హైదరాబాద్ సిటీలో టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు, సన్నిహితుల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.
శ్రీలంకలో డిసెంబర్ 6వ తేదీ రాత్రి 8.50 గంటలకు అభిరామ్, ప్రత్యూష చపరాల వివాహం జరిగింది. ఈ పెళ్లి కోసం ఐదారు రోజుల ముందు హైదరాబాద్ నుంచి సుమారు 200 మంది వెళ్లారట. సోమవారం రాత్రి పార్టీ, మంగళవారం సంగీత్ & మెహందీ, బుధవారం పెళ్లి జరిగాయట. పెళ్లికి ముందు అభిరామ్ దగ్గుబాటి ఓ సినిమా చేశారు. తేజ దర్శకత్వం వహించిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయం సాధించలేదు. ఫ్లాప్ అయ్యింది.
తెలుగు ఇండస్ట్రీలో ఇటీవల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సొట్ట బుగ్గల సుందరి & అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీలో జరిగింది. ప్రజెంట్ ఆ స్టార్ కపుల్ హనీమూన్ టూర్ లో ఉంది.
Also Read: హాయ్ నాన్న సినిమా రివ్యూ: నాని, మృణాల్ నటించిన రొమాంటిక్ & ఎమోషనల్ డ్రామా ఎలా ఉంది?