Extra Ordinary Man: నితిన్ సినిమాకు 'ఎక్స్ట్రాడినరీ' బిజినెస్ - ఫ్లాప్స్ ఎఫెక్ట్ లేదుగా!
Extra Ordinary Man Pre Release Business: నితిన్ లేటెస్ట్ సినిమా 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది. ఆయన లాస్ట్ సినిమాల కంటే ఎక్కువ రేటు వచ్చింది.
![Extra Ordinary Man: నితిన్ సినిమాకు 'ఎక్స్ట్రాడినరీ' బిజినెస్ - ఫ్లాప్స్ ఎఫెక్ట్ లేదుగా! Extra Ordinary Man to Bheeshma Nithin last five movies pre release business details break even target Telugu news Extra Ordinary Man: నితిన్ సినిమాకు 'ఎక్స్ట్రాడినరీ' బిజినెస్ - ఫ్లాప్స్ ఎఫెక్ట్ లేదుగా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/07/e972f2c244ff98f28dfd773a9f39ae771701936220587313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Nithin Sreeleela's Extra Ordinary Man movie pre release business: నితిన్ హీరోగా నటించిన తాజా సినిమా 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్'. ఇందులో శ్రీ లీల హీరోయిన్. ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. డిసెంబర్ 8న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వస్తోందీ సినిమా. థియేట్రికల్ రైట్స్ విడుదలకు ముందు అమ్మేశారు. నితిన్ లాస్ట్ సినిమాల కంటే ఎక్కువ రేటుకు సినిమాను అమ్మారు. ఫ్లాప్స్ ఎఫెక్ట్ ఈ సినిమా మీద పడలేదని చెప్పవచ్చు.
'ఎక్స్‌ట్రా' @ రూ. 24.50 కోట్లు!
Extra Ordinary Man movie Telugu states pre release business: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది.
నైజాం రైట్స్ రూ. 7.50 కోట్ల కింద లెక్క కట్టినట్లు సమాచారం. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ కూడా. నైజాంలో సొంతంగా విడుదల చేస్తున్నారు. సీడెడ్ రైట్స్ రూ. 3 కోట్లకు విక్రయించారు. ఆంధ్రలో ఏరియాలను రూ. 9.10 కోట్ల రేషియోలో విక్రయించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవర్సీస్ రైట్స్ రూ. 3 కోట్లు, కర్ణాటక అండ్ రెస్టాఫ్ ఇండియా రైట్స్ రూ. 1.90 కోట్లు కలిపితే... టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 24.50 కోట్ల అయ్యిందని తెలిసింది. బ్రేక్ ఈవెన్ కావాలి అంటే... మినిమమ్ 25.50 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయాలి.
'ఎక్స్‌ట్రా'కు ముందు నితిన్ బిజినెస్ పరిస్థితి ఏంటి?
నితిన్ లాస్ట్ ఐదు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ చూస్తే... 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' హయ్యస్ట్ బిజినెస్ చేసిందని చెప్పాలి. 'మాచర్ల నియోజకవర్గం' రూ. 21.20 కోట్లు, 'రంగ్ దే' రూ. 24 కోట్లు, 'చెక్' రూ. 16 కోట్లు, 'భీష్మ' రూ. 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాయి. 'శ్రీనివాస కళ్యాణం' సినిమా 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' కంటే 30 లక్షల ఎక్కువ బిజినెస్ చేసింది.
Also Read: హాయ్ నాన్న సినిమా రివ్యూ: నాని, మృణాల్ నటించిన రొమాంటిక్ & ఎమోషనల్ డ్రామా ఎలా ఉంది?
'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ట్రైలర్ బావుండటం... ఫన్ బావుందని పేరు రావడంతో బుకింగ్స్ బావున్నాయి. మరి, సినిమా టాక్ బట్టి కలెక్షన్స్ ఉంటాయి. దర్శక రచయిత వక్కంతం వంశీ కిక్ తరహా కథ, క్యారెక్టరైజేషన్లతో సినిమా చేశారు. నితిన్ కూడా ఆయన రాసిన బెస్ట్ క్యారెక్టరైజేషన్లలో 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ఉంటుందని చెప్పారు. నితిన్, శ్రీ లీల జంటగా నటించిన ఈ సినిమాలో యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కీలక పాత్ర చేశారు. రావు రమేష్, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, రోహిణి, 'హైపర్' ఆది, హర్షవర్ధన్, సుదేవ్ నాయర్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)