By: ABP Desam | Updated at : 23 Jan 2023 03:45 PM (IST)
ఆత్మహత్య చేసుకున్న సుధీర్ వర్మ (ఫైల్ ఫొటో)
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్‌వర్మ వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం విశాఖపట్నంలో ఈ సంఘటన జరిగింది. అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది మాత్రం తెలియరాలేదు. 2013 సంవత్సరంలో కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన సెకండ్ హ్యాండ్ సినిమా సుధీర్ వర్మకు హీరోగా మంచి పేరు తెచ్చిపెట్టింది.
ఇందులో సంతోష్ అనే పేరున్న ఫొటోగ్రాఫర్‌గా సుధీర్ వర్మ నటించాడు. ఈ సినిమాతోనే అతడు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఆ తర్వాత వర ముళ్లపూడి దర్శకత్వంలో రూపొందిన కుందనపు బొమ్మ సినిమాలో ఒక హీరోగా నటించాడు సుధీర్‌వర్మ. 2016 సంవత్సరంలో ఈ సినిమా రిలీజైంది. ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని తెలుగు సినిమాల్లో సుధీర్ వర్మ కీలక పాత్రలు పోషించాడు.
చిరంజీవి కూతురు సుస్మిత నిర్మించిన షూటౌట్ ఎట్ ఆలేర్ అనే వెబ్‌సిరీస్‌లో కూడా సుధీర్‌వర్మ నటించాడు. ఇదే అతడు నటించిన చివరి ప్రాజెక్ట్ అని తెలుస్తోంది. సుధీర్ వర్మతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హీరో సుధాకర్ కొమాకుల ఎమోషనల్ అయ్యాడు. నువ్వు లేవు అనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. 2016లో వచ్చిన కుందనపు బొమ్మ సినిమాలో సుధీర్‌వర్మతో పాటు సుధాకర్ కొమాకుల మరో హీరోగా నటించాడు.
ఇటీవలి కాలంలో రాష్ట్రంలో ఆత్మహత్యలు ఎక్కువ అయ్యాయి. ప్రేమించి మోసపోయానని సూసైడ్ లెటర్ రాసి ఒక యువకుడు విజయవాడలో ఆత్మహత్య చేసుకున్నారు. అబ్దుల్ సలామ్ అనే యువకుడు సూసైడ్ లెటర్ లో ఇలా రాశాడు. ఓ యువతి ప్రేమించి వంచిందని వాపోయాడు. తనను ప్రేమించిన యువతి ప్రవర్తనలో కొంతకాలంగా మార్పు వచ్చిందని తీరా ఆరా తీస్తే పెళ్లైన వ్యక్తితో న్యూడ్ వీడియో కాల్స్ చేస్తూ రిలేషన్ లో ఉందని తెలిసిందన్నాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకుంటానని సలామ్ తెలిపాడు.
ఆ యువతి ప్రవర్తన మారుతుందని ఎంత ప్రయత్నించినా మారడంలేదని, దీంతో తాను సరిగా చదవలేకపోతున్నానని రాశాడు. అన్నీ వదిలేయమని చెప్పినా వినకుండా అర్థరాత్రుళ్లు మరో వ్యక్తితో వీడియో కాల్స్ మాట్లాడుతుందని సలామ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ టైమ్ పాస్ ప్రేమతో తనను పిచ్చివాడ్ని చేసిందన్నాడు. అందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని సలామ్ లెటర్ లో రాశాడు. తనలాంటి మోసపోయిన అబ్బాయిలకు న్యాయం చేయాలని సలామ్ వేడుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విజయవాడకు చెందిన బీటెక్ విద్యార్థి అబ్దుల్ సలామ్ సూసైడ్ నోట్ రాసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుకుమిక అనే యువతి తనను ప్రేమ పేరుతో మోసం చేసిందని సూసైడ్ నోట్ లో సలామ్ రాశాడు. యువతి టైమ్ పాస్ ప్రేమతో తాను పిచ్చోడిని అయ్యానని, జీవితం మీద విరక్తితో తన తల్లిదండ్రులకు సమాధానం చెప్పలేక ఈ నిర్ణయం తీసుకున్నానని వాపోయాడు. సుకుమిక తనపై ఫేక్ ప్రేమ నటించిందని, పెళ్లైన ఓ లెక్చరర్‌తో సంబంధం పెట్టుకుని న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడేదని తెలిపారు. అబ్బాయిలు మోసం చేసే హైలైట్ చేస్తారు కానీ అమ్మాయిలు మోసం చేస్తే ఎందుకు ప్రశ్నించరని సలామ్ లేఖలో రాశాడు. సుకుమిక చేతిలో మోసపోయిన తనలాంటి అమాయకపు అబ్బాయిలకు న్యాయం చేయాలంటూ సలామ్ లేఖలో కోరారు.
Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి
Thalapathy 67 Update: ‘దళపతి 67‘ నుంచి అదిరిపోయే అప్ డేట్, కీ రోల్లో సంజయ్ దత్, హీరోయిన్గా త్రిష
Urfi Javed On Kangana: ‘పఠాన్’పై ముద్దుగుమ్మల ఫైట్ - నీలో స్వచ్ఛతా, దైవత్వం ఉన్నాయంటూ ఉర్ఫీపై కంగనా కామెంట్స్
Nagababu On Jabardasth: వారిని నేను రమ్మనలేదు, ఎవరి రిస్క్ వాళ్లదే: ‘జబర్దస్త్’ రి-ఎంట్రీపై నాగబాబు కామెంట్స్
Janaki Kalaganledu Fame Priyanka: 'జానకి కలగనలేదు' సీరియల్ ఫేమ్ జానకి కొత్త ఇల్లు చూశారా?
Etala Vs Kousik Reddy : ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ - పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం