అన్వేషించండి

Tollywood Updates: టాలీవుడ్ హీరోల్లో కొత్త యాంగిల్! దర్శకులు, రచయితలకు వర్క్ టెన్షన్ తగ్గిస్తున్న యాక్టర్స్

అనుభవం, టాలెంట్ ఉన్న హీరోలంతా కథల విషయంలో దర్శకులకు సహాయం చేస్తూ పనిభారం తగ్గిస్తున్నారు.

సరైన కథల కోసం హీరోలు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడంతా పాన్ ఇండియా హడావిడి నడుస్తుండడంతో అన్ని భాషల ప్రేక్షకులకు నచ్చే విధంగా కథలను ఎన్నుకుంటున్నారు. అయితే మన దగ్గర కథలు రాసేవారు తగ్గిపోతున్నారు. దీంతో మన హీరోలే ఆ కొరత తీర్చడానికి రెడీ అయిపోతున్నారు. కాస్త అనుభవం, టాలెంట్ ఉన్న హీరోలంతా కథల విషయంలో దర్శకులకు సహాయం చేస్తూ పనిభారం తగ్గిస్తున్నారు. ఇక డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేసిన వారైతే స్వయంగా కథలు రాసుకుంటున్నారు. 

ప్రస్తుతం టాలీవుడ్ లో కొంతమంది హీరోలు కథలు రాస్తున్న సంగతి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. నేచురల్ స్టార్ నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దర్శకత్వం మీద ఆసక్తితోనే ఇండస్ట్రీకి వచ్చారు. కానీ హీరోగా మారారు. అయినప్పటికీ కథల విషయంలో అతడి ఆసక్తి తగ్గిపోలేదు. దర్శకుడిగా పని చేయాలని ఉన్నా.. ప్రస్తుతం ఆ దిశగా అడుగులు వేయలేరు. కానీ నిర్మాతగా మాత్రం నాని చాలా బిజీగా గడుపుతున్నారు. 
హీరోగా ఆయన చేతిలో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నా.. నిర్మాతగా ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం నాని నిర్మాతగా 'మీట్ క్యూట్' అనే సినిమా తెరకెక్కుతోంది. ఇది కాకుండా తన బ్యానర్ లో చేయబోయే మరో సినిమా కోసం నాని కథ రెడీ చేశారట. తన కథను బాగా డీల్ చేసే దర్శకుడి కోసం నాని వెతుకుతున్నట్లు సమాచారం. 

మరో హీరో అల్లరి నరేష్ కూడా సహాయ దర్శకుడిగా పని చేశారు. తన తండ్రి ఈవీవీ సత్యనారాయణ మాదిరి ఎప్పటికైనా మెగాఫోన్ పెట్టాలనేది అల్లరి నరేష్ కోరిక. అయితే ప్రస్తుతానికి దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ.. హీరోగానే కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు ఆయన కూడా ఓ కథను సిద్ధం చేశారట. ఆ కథతో తనే సినిమా చేయాలనుకుంటున్నారు. కానీ డైరెక్షన్ మాత్రం చేయరట. ప్రస్తుతం ఈ కథ స్క్రిప్ట్ రూపంలో మారుతోందట. ఆ పనులన్నీ ఓ కొలిక్కి వచ్చిన తరువాత దీనిపై ప్రకటన రానుంది. 

సీనియర్ హీరో మోహన్ బాబు కూడా కథ -స్క్రీన్ ప్లే విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆయన తాజా సినిమా 'సన్ ఆఫ్ ఇండియా' టైటిల్ కార్డులో మోహన్ బాబు పేరుంది. మరో హీరో రవితేజ దగ్గర కూడా కొన్ని కథలు ఉన్నాయి. వాటిలో ఓ కథను ఎన్నుకొని డైరెక్షన్ చేయాలనేది రవితేజ ఆలోచన. ఇలా హీరోల్లో కొంతమంది కథలను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. లాక్ డౌన్ సమయం వీరికి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. మరి రైటర్లుగా వీరికి ఎలాంటి గుర్తింపు వస్తుందో చూడాలి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget