News
News
X

Tollywood Drug Case : ఈరోజు ఈడీ ముందుకు నవదీప్, ఎఫ్-క్లబ్ జనరల్ మేనేజర్..ఈ కేసులో కీలక విషయాలు తెరపైకి రానున్నాయా…!

డ్రగ్స్ విచారణలో భాగంగా ఇప్పటికే పలువురు టాలీవుడ్ సెలబ్రెటీలు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ రోజు విచారణకు నవదీప్ హాజరుకానున్నాడు.

FOLLOW US: 

డ్రగ్స్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్  విచారణకు నటుడు నవదీప్ హాజరుకానున్నాడు. ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ ను కూడా ఈడీ విచారించే అవకాశం ఉంది.  మొదట్లో ఈ కేసు డ్రగ్‌ సరఫరాదారుడు కెల్విన్‌ చుట్టూ తిరిగినా, విచారణ క్రమంలో ఎఫ్‌-క్లబ్‌లో పార్టీలపైనా, ఆ పార్టీల్లో పాల్గొన్నవారి ఆర్థిక లావాదేవీలపైనా ఈడీ అధికారులు దృష్టి సారిస్తూ వచ్చారు. దీంతో సోమవారం నాటి విచారణకు హీరో నవదీప్‌, ఎఫ్‌-క్లబ్‌ మేనేజర్‌ హాజరుకానుండటం ఆసక్తికరంగా మారింది.ఇప్పటి వరకు తెలుగు సినీ ప్రముఖులను ఉక్కిరిబిక్కిరి చేసిన డ్రగ్స్ కేసుకు తోడు తాజాగా  మనీ లాండరింగ్ కోణంలో విచారణ సాగుతుండండం ఉత్కంఠ రేపుతోంది.  ఇప్పటికే పూరి జగన్నాథ్,  రకుల్ ప్రీత్ సింగ్, ఛార్మి, రవితేజ, రానా లను ఈడీ ప్రశ్నించింది. ఒక్కొక్కరిని ఏడెనిమిది గంటల పాటు విచారించిన ఈడీ మనీల్యాండరింగ్ వ్యవహారాలపై ప్రశ్నలు సంధించింది. ఈ కేసులో కెల్విన్ తో లావాదేవీలపైనా ఆరాలు తీసింది. నవదీప్ కూడా ఇలాంటి ప్రశ్నలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే బ్యాంకింగ్ లావాదేవీలను ఈడీకి వెల్లడించాల్సి ఉంటుంది.

Also Read: ఈ వారం ఏ రాశివారికి ఎలా ఉందంటే..

2017లో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో 30 మందికి పైగా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అందులో కీలకంగా కెల్విన్, వహీద్, ఖుద్దూస్, జీషాన్ లను గతంలోనే విచారించి వారి బ్యాంక్ ఖాతాలను ఈడీ పరిశీలించింది. వీరి బ్యాంక్ అకౌంట్స్ నుంచి విదేశాలకు భారీగా డబ్బు వెళ్లినట్లు ఈడీ అధికారులకు ఆధారాలు లభించాయి. అంతేకాదు.. సినీ తారల బ్యాన్ అకౌంట్స్ నుండి కెల్విన్, ఖుధూస్, వహీద్, జీషాన్ ల అకౌంట్స్ మధ్య లావాదేవీలు జరిగినట్లు కూడా తేలింది. కెల్విన్ కాల్ డేటా.. అతని బ్యాంక్ స్టేట్మెంట్స్ ను బట్టి సెలబ్రిటీలకు నోటీసులు పంపించింది ఈడీ. అధికారులు ఇచ్చిన నోటీసుల ప్రకారం విచారణకు హాజరైన సెలబ్రిటీల నుంచి పూర్తి వివరాలు రాబట్టడానికి ప్రయత్నిస్తోంది ఈడీ.  నవదీప్‌, ఎఫ్‌-క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌ చెప్పే విషయాలతో ఈ కేసులో ఇంకేమైనా కొత్త అంశాలు వెలుగులోకి వస్తాయో లేదో చూడాలి. ఈ కేసులో ఈ నెల 15న ముమైత్‌ఖాన్‌, 17న తనీశ్‌, 22న తరుణ్‌ ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు.

Also Read: ఈ రాశి ప్రేమికులకు కలిసొచ్చే రోజు…ఆ రాశుల వారికి అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త…మిగిలిన రాశుల వారి ఫలితాలు చూద్దాం..

టాలీవుడ్ ని కుదిపేస్తున్న డ్రగ్స్ విచారణపై స్పందించిన సీనియర్ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేవసం సినిమా వాళ్లే కాదు ఇందులో అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారన్నారు. ఇది తగ్గాలంటే భారతదేశంలో కఠిన చట్టాలను తేవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సింగపూర్ మలేషియా సహా అన్నిచోట్లా డ్రగ్స్ ఉన్నప్పటికీ అక్కడ కఠిన చట్టాలతో కంట్రోల్ చేస్తున్నారు కానీ మనదేశంలో అది లేదన్నారు. ఇక్కడ కూడా కఠిన చట్టాలు అమలైతే డ్రగ్స్ తో పాటు లైంగిక దాడులు కూడా ఆగిపోతాయన్నారు.

Also Read: స్వల్పంగా తగ్గిన బంగారం, తటస్థంగా వెండి ధరలు... తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవాళ్టి ధరలు ఇలా

Also Read: దళిత బంధుకు సన్నాహకం.. చారకొండలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్న ప్రభుత్వం

Also Read: దేశంలో స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు... తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఇలా

Published at : 13 Sep 2021 08:13 AM (IST) Tags: raviteja ED Rana Navdeep Tollywood drug case Investigate Poori Jagannadh Charmi

సంబంధిత కథనాలు

Grand Vitara Hybrid: దేశీయ మార్కెట్లోకి మారుతి సుజుకి గ్రాండ్ విటారా హైబ్రిడ్ - ధర, ప్రత్యేకతలు ఇవే!

Grand Vitara Hybrid: దేశీయ మార్కెట్లోకి మారుతి సుజుకి గ్రాండ్ విటారా హైబ్రిడ్ - ధర, ప్రత్యేకతలు ఇవే!

Janaki Kalaganaledu September 27th: జెస్సిని చూసి పద్ధతికి పట్టు చీర కట్టినట్టుగా ఉందన్న ముత్తైదువులు- అంతలోనే పుల్ల పెట్టేసిన నీలావతి, పెట్రోల్ మల్లిక

Janaki Kalaganaledu September 27th: జెస్సిని చూసి పద్ధతికి పట్టు చీర కట్టినట్టుగా ఉందన్న ముత్తైదువులు- అంతలోనే పుల్ల పెట్టేసిన నీలావతి, పెట్రోల్ మల్లిక

Chiranjeevi - Waltair Veerayya Update : 'మెగా'స్టార్ మాస్ రికార్డు - 'వాల్తేరు వీరయ్య' ఓటీటీ రైట్స్ ఎంతంటే?

Chiranjeevi - Waltair Veerayya Update : 'మెగా'స్టార్ మాస్ రికార్డు - 'వాల్తేరు వీరయ్య' ఓటీటీ రైట్స్ ఎంతంటే?

Gruhalakshmi September 27th Update: సామ్రాట్ జీవితంలో పెను విషాదం- తులసిని దూరం పెట్టమని సామ్రాట్ కి తెగేసి చెప్పిన అనసూయ

Gruhalakshmi September 27th Update: సామ్రాట్  జీవితంలో పెను విషాదం- తులసిని దూరం పెట్టమని సామ్రాట్ కి తెగేసి చెప్పిన అనసూయ

Guppedantha Manasu September 27th Update:మాట వెనక్కు తీసుకునేది లేదన్న వసు, జగతిని ఆపిన రిషి - అవకాశంగా వాడుకున్న దేవయాని!

Guppedantha Manasu September 27th Update:మాట వెనక్కు తీసుకునేది లేదన్న వసు, జగతిని ఆపిన రిషి - అవకాశంగా వాడుకున్న దేవయాని!

టాప్ స్టోరీస్

NIA Searches: పీఎఫ్ఐపై ఎన్ఐఏ ఫోకస్! దేశవ్యాప్తంగా స్పెషల్ ఆపరేషన్, పలువురి అరెస్టు - సడెన్‌గా ఎందుకిలా?

NIA Searches: పీఎఫ్ఐపై ఎన్ఐఏ ఫోకస్! దేశవ్యాప్తంగా స్పెషల్ ఆపరేషన్, పలువురి అరెస్టు - సడెన్‌గా ఎందుకిలా?

Kcr Reservation Politics : రిజర్వేషన్ల అంశానికి కేసీఆర్ ఎలాంటి ముగింపు తీసుకు రాబోతున్నారు ? గిరిజన కోటా జీవో ఎందుకు ఆలస్యం అవుతోంది ?

Kcr Reservation Politics :    రిజర్వేషన్ల అంశానికి కేసీఆర్ ఎలాంటి ముగింపు తీసుకు రాబోతున్నారు ? గిరిజన కోటా  జీవో ఎందుకు ఆలస్యం అవుతోంది ?

YSRCP News: టీడీపీ బంగాళాఖాతంలోకి, ఆగని పేరు మార్పు రచ్చ! వరుస ట్వీట్లతో కౌంటర్ ఇస్తున్న వైసీపీ నేతలు

YSRCP News: టీడీపీ బంగాళాఖాతంలోకి, ఆగని పేరు మార్పు రచ్చ! వరుస ట్వీట్లతో కౌంటర్ ఇస్తున్న వైసీపీ నేతలు

Chiranjeevi - Godfather Climax Fight : 'గాడ్ ఫాదర్' క్లైమాక్స్ - చిరు, సల్మాన్ ఫ్యాన్స్‌కు ట్రీట్ - ఎక్స్‌క్లూజివ్ న్యూస్ ఏంటంటే?

Chiranjeevi - Godfather Climax Fight : 'గాడ్ ఫాదర్' క్లైమాక్స్ - చిరు, సల్మాన్ ఫ్యాన్స్‌కు ట్రీట్ - ఎక్స్‌క్లూజివ్ న్యూస్ ఏంటంటే?