Thunivu Trailer: అదిరిపోయే యాక్షన్‌తో ‘తునివు’ ట్రైలర్ - తమిళనాట ‘వారిసు’కి చెక్ పెడుతుందా?
అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న ‘తునివు’ తమిళ ట్రైలర్ యూట్యూబ్‌లో విడుదల అయింది.
Thunivu Trailer: తమిళ హీరో అజిత్ నటిస్తున్న సినిమా ‘తునివు’. ఈ సినిమా ట్రైలర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. బ్యాంక్ దోపిడి చేసే ముఠాకు లీడర్‌గా అజిత్ ఈ సినిమాలో కనిపించనున్నారు. యాక్షన్ సన్నివేశాలు అయితే నెక్స్ట్ లెవల్ అని చెప్పాలి. అజిత్‌తో ‘వలిమై’ తీసిన హెచ్.వినోద్ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు.
తెలుగులో ఈ సినిమా ‘తెగింపు’ పేరుతో రిలీజ్ కానుంది. నైజాం, వైజాగ్ ఏరియాల్లో దిల్ రాజు ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతానికి తమిళ ట్రైలర్ మాత్రమే రిలీజ్ అయింది. తెలుగు ట్రైలర్‌ను తర్వాత లాంచ్ చేయనున్నారు. తమిళ నటుడు అజిత్ కు తెలుగులోనూ మంచి పాపులారిటీ ఉంది.
సంక్రాంతి సందర్బంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. సాధారణంగా సినిమా ప్రమోషన్స్ అంటే రకరకాల కార్యక్రమాలు చేస్తుంటారు మేకర్స్. అయితే అజిత్ నటించిన ‘తునివు’ మూవీ టీమ్ మాత్రం సరికొత్త రీతిలో ప్రచారాన్ని మొదలుపెట్టింది.
సినిమాకు సంబంధించిన భారీ పోస్టర్ ను గాలిలో ఎగరేస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. స్కై డైవింగ్ ద్వారా చేసిన ఈ వినూత్న ప్రచారాన్ని వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది మూవీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్. అజిత్ సినిమాను ఇంత వీర లెవల్ లో ప్రచారం చేయడం వెనుక ఓ కారణం ఉంది. తమిళనాట ఎప్పటి నుంచో అజిత్, విజయ్ సినిమాల మధ్య పోటీ ఉంది.
ఈ యేడాది కూడా అజిత్ ‘తునివు’, విజయ్ ‘వారిసు’ సినిమాలు ఒకేసారి విడుదల అవ్వబోతున్నాయి. ఇటు తెలుగులో కూడా మార్కెట్ ను పెంచుకునే పనిలో ఉన్నారు ఈ ఇద్దరు హీరోలు. దీంతో ఈ రెండు సినిమాలు పోటా పోటీగా ప్రమోషన్స్ ను సాగిస్తున్నాయి. మొదటి నుంచీ ఈ రెండు సినిమాలకు సంబంధించిన పోస్టర్, పాటలు ఇలా అన్నింటిలోనూ పోటా పోటీగా అప్డేట్ లను రివీల్ చేస్తూ వస్తున్నారు.
‘వారిసు’ ట్రైలర్ కూడా జనవరి 2వ తేదీన విడుదల కానుందని తెలుస్తోంది. లైకా ప్రోడక్షన్ సంస్థ గతంలోనూ ఓ సినిమా ప్రచార విషయంలో ఇలాంటి వినూత్న ప్రచారం చేయడం గమనార్హం. మరి ఈ తమిళ డబ్బింగ్ సినిమాలు ఈసారి సంక్రాంతికి తెలుగు ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటాయో చూడాలి.
View this post on Instagram