![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
SV Krishna Reddy: ఎస్వీ కృష్ణారెడ్డి కారు ఆపిన పోలీసులు - తప్పు ఒప్పుకున్న దర్శకుడు
ఎస్వీ కృష్ణారెడ్డి కారుని పోలీసులు అడ్డుకొని తనిఖీలు చేశారు. ఆయన కారు నెంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోవడంతో చలానా విధించారు.
![SV Krishna Reddy: ఎస్వీ కృష్ణారెడ్డి కారు ఆపిన పోలీసులు - తప్పు ఒప్పుకున్న దర్శకుడు SV Krishna Reddy violates traffic rules SV Krishna Reddy: ఎస్వీ కృష్ణారెడ్డి కారు ఆపిన పోలీసులు - తప్పు ఒప్పుకున్న దర్శకుడు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/04/3d5df10f778175e7f52245f6350a238a_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కొద్దిరోజులుగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు చెక్ పోస్ట్ లు పెట్టి కార్లను తనిఖీ చేస్తోన్న సంగతి తెలిసిందే. విండోలకు బ్లాక్ ఫిలిమ్స్ ఉన్నాయని గత కొన్ని రోజులుగా చాలా మంది సెలబ్రిటీల కార్లకు చలానా విధించారు ట్రాఫిక్ పోలీసులు. తాజాగా ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కారుకి కూడా జరిమానా విధించారు. మంగళవారం నాడు సుల్తాన్ బజార్ బ్యాంక్ స్ట్రీట్ రోడ్డులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
అదే సమయంలో అటుగా వెళ్తోన్న ఎస్వీ కృష్ణారెడ్డి కారుని పోలీసులు అడ్డుకొని తనిఖీలు చేశారు. ఆయన కారు నెంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోవడంతో చలానా విధించారు. ఈ క్రమంలో కృష్ణారెడ్డి పోలీసులతో మాట్లాడారు. తప్పు తనదేనని నెంబర్ ప్లేట్ సరి చేసుకుంటానని.. ఆయన పోలీసులకు వివరణ ఇచ్చారు. అనంతరం తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తోన్న పోలీసులను అభినందించారు.
టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన ఆయన తన కామెడీ అండ్ కుటుంబ కథా చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యారు. దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగానే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా పలు సినిమాలకు పని చేశారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోన్న ఆయన ఇప్పుడొక సినిమాను డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. దీనికి 'ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. రీసెంట్ గానే ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
Also Read: మహేష్ బాబుని మూడు సార్లు కొట్టిన కీర్తి సురేష్ - మరీ అంత కోపమా?
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)