By: ABP Desam | Updated at : 04 May 2022 11:35 AM (IST)
'ఎఫ్3' ట్రైలర్ డబ్బింగ్ పూర్తి చేసిన వెంకీ - ఫ్యాన్స్ రెడీనా?
వెంకటేష్, వరుణ్ తేజ్ తోడల్లుళ్లుగా నటిస్తోన్న సినిమా 'ఎఫ్3'. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమా 'ఎఫ్ 2'కి సీక్వెల్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. 'ఎఫ్ 2' సినిమాలో కనిపించిన తారలే ఈ సినిమాలో కూడా కనిపించనున్నారు. వీరితో పాటు కొన్ని పాత్రలను యాడ్ చేస్తున్నారు. అందులో సునీల్, సోనాల్ చౌహన్ లాంటి స్టార్లు ఉన్నారు. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 28న విడుదల చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు మే 27న సినిమాను విడుదల చేయనున్నారు.
దానికి తగ్గట్లే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా సినిమా నుంచి రెండు పాటలను విడుదల చేశారు. ఇప్పుడు మే 9న సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఈ ట్రైలర్ కి సంబంధించిన డబ్బింగ్ ని పూర్తి చేశారు వెంకటేష్. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ ఫొటోను షేర్ చేశారు. 'ఎఫ్2' సినిమా సూపర్ హిట్ కావడంతో 'ఎఫ్3' సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో పూజాహెగ్డే ఐటెం సాంగ్ లో కనిపించనుంది. దీనికి సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: విశ్వక్ సేన్ ‘F’ వర్డ్, మంత్రి తలసానికి ఫిర్యాదు చేసిన టీవీ యాంకర్, చర్యలు తప్పవా?
Wrapped up dubbing for #F3Trailer! Super excited to share it with you all on May 9th ❤️#F3Movie@AnilRavipudi @IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @ThisIsDSP @SVC_official pic.twitter.com/azqqXVFCfq
— Venkatesh Daggubati (@VenkyMama) May 4, 2022
Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?
RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!
Rgv Complaint : నా సంతకం ఫోర్జరీ చేశారు, నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఆర్జీవీ పోలీస్ కేసు
Pakka Commercial: 'పక్కా కమర్షియల్' సెకండ్ సాంగ్ ప్రోమో!
Ram Charan: రామ్ చరణ్ కోసం వరి చిత్రం - 264 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అభిమాని
Nalgonda Accident : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, రథానికి విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి
NTR Centenary Celebrations : ఎన్టీఆర్ అప్పట్లోనే చేసి చూపించారు - అవినీతికి పాల్పడితే మంత్రినీ వదల్లేదు !
Minister Sabitha Indrareddy అనుచరుల వీరంగం.. అధికారుల అంతు చూస్తామని బెదిరింపులు | ABP Desam
RR vs RCB, Mohammed Siraj: ఇదేంది సిరాజ్ మియా! హైదరాబాదీ పేస్ కెరటం కెరీర్లో కోరుకోని రికార్డు