By: ABP Desam | Updated at : 15 Jul 2022 09:08 PM (IST)
లలిత్ మోడీతో ఎంగేజ్మెంట్, పెళ్లిపై సుష్మితా సేన్ రియాక్షన్
వ్యాపారవేత్త లలిత్ మోడీ.. సుష్మితా సేన్ తో డేటింగ్ లో ఉన్నారనే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. మాల్దీవ్స్, ఇటలీలోని సార్దీనియా గ్లోబల్ టూర్ తర్వాత ఫ్యామిలీతో కలిసి లండన్ చేరుకున్నానని.. సుష్మితా సేన్ తో తీసుకున్న ఫొటోలను షేర్ చేశారు. అలానే 'జస్ట్ ఫర్ క్లారిటీ.. ఇంకా పెళ్లి చేసుకోలేదు. డేటింగ్ చేస్తున్నాం. ఏదో ఒక రోజు పెళ్లి కూడా జరుగుతుంది' అని లలిత్ మోడీ పోస్ట్ చేయడంతో అందరూ సర్ప్రైజ్ అయ్యారు.
ఈ ఫొటోల్లో సుష్మితా చేతికి ఉన్న రింగ్ చూసి.. ఆమెకి ఎంగేజ్మెంట్ అయిపోయిందని వార్తలు స్ప్రెడ్ అయ్యాయి. దీంతో నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆమెని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. లలిత్ మోడీతో రిలేషన్ కారణంగానే ఆమె రొహ్మన్ షాల్ కి బ్రేకప్ చెప్పిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. సడెన్ గా సుష్మితాపై ఇంత నెగెటివిటీ రావడంతో ఆమె ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు.
ఇదిలా ఉండగా.. కాసేపటి క్రితమే సుష్మితా ఈ వ్యవహారంపై స్పందించింది. 'హ్యాపీ ప్లేస్ లో ఉన్నా.. పెళ్లి చేసుకోలేదు.. నో రింగ్స్.. అంతులేని ప్రేమ నా చుట్టూ ఉంది. ఈ క్లారిఫికేషన్ చాలు.. ఇక బ్యాక్ టు లైఫ్ అండ్ వర్క్. నా హ్యాపీనెస్ ను షేర్ చేసుకుంటున్నందుకు థాంక్యూ' అంటూ ఇన్స్టాగ్రామ్ లో తన అడాప్టెడ్ డాటర్స్ తో తీసుకున్న ఫొటోను షేర్ చేసింది. పెళ్లి లేదు, ఎంగేజ్మెంట్ లేదని చెప్పింది కానీ లలిత్ మోడీతో డేటింగ్ గురించి మాత్రం చెప్పలేదు సుష్మితా సేన్. మరోపక్క లలిత్ మోడీ మాత్రం సుష్మితా ఫొటోలను, వారి డేటింగ్ వార్తలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
Also Read: లైవ్ లోనే సుధీర్ కి ఫోన్ - అతడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన మేనేజర్!
Also Read: మాస్ లుక్ లో 'మీటర్', క్లాసీ లుక్ లో 'రూల్స్ రంజన్'
Tollywood: విజయ్ కోసం ఎగబడుతున్న జనాలు - అలియాభట్ ఇన్స్టాగ్రామ్ సంపాదన!
NTR30: ఎన్టీఆర్ సినిమాలో కృతిశెట్టి - క్లారిటీ వచ్చేసింది!
Bimbisara: 'బింబిసార' సినిమాను రిజెక్ట్ చేసిన రవితేజ?
Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్
NTR: భుజం నొప్పితో బాధపడుతోన్న ఎన్టీఆర్ - రెండు నెలల పాటు రెస్ట్!
Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం
CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్
Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్ పవర్ - బాక్సర్ నిఖత్‌కు స్వర్ణం
Moto G62 5G: మోటొరోలా చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - రూ.15 వేలలోపే!