Kiran Abbavaram: మాస్ లుక్ లో 'మీటర్', క్లాసీ లుక్ లో 'రూల్స్ రంజన్'
వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram). తాజాగా తన రెండు కొత్త చిత్రాలకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఒకటి మంచి మాస్ ఎంటర్ టైనర్ కాగా మరొకటి క్లాసీ లుక్ లో కనిపిస్తున్నారు.
వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram). తాజాగా తన రెండు కొత్త చిత్రాలకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఒకటి మంచి మాస్ ఎంటర్ టైనర్ కాగా మరొకటి క్లాసీ లుక్ లో కనిపిస్తున్నారు. తన బర్త్ డే సందర్భంగా ఈ రెండు చిత్రాలకి సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్స్ విడుదల చేశారు. అందులో ఒకటి "మీటర్". ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసింది. తను ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న మాస్ బొమ్మ వచ్చేసిందంటూ కిరణ్ అబ్బవరం తన ఇన్ స్టాలో రాసుకొచ్చారు. ఇందులో కిరణ్ క్రేజీ అండ్ మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి రమేష్ కాడురీ దర్శకత్వం వహిస్తుండగా, సి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రి మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) కథానాయకుడిగా నటిస్తున్న మరో సినిమా "రూల్స్ రంజన్". 'ప్రేమకి మాత్రం నో రూల్స్' అనేది ట్యాగ్ లైన్. ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అందులో కిరణ్ క్లాసీ లుక్ లో కనిపిస్తున్నారు. ఇందులో కథానాయికగా నేహా శెట్టి (Neha Shetty) నటిస్తోంది. ఎ.యం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. పతాకంపై దివ్యాంగ్ లవానియా, వి.మురళీకృష్ణ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి రతినం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. వీటితో పాటు కిరణ్ ప్రస్తుతం 'వినరో భాగ్యము విష్ణు కథ' (Vinaro Bhagyamu Vishnu Katha Movie) లో నటిస్తున్నారు. ఈ సినిమాలో కశ్మీర పర్ధేశీ హీరోయిన్ గా నటిస్తోంది. మురళీ కిశోర్ అబ్బురు ఈ సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఇవే కాకుండా 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' అనే మరో చిత్రంలోనూ నటిస్తున్నారు. కోడి ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి, తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రమిది. చిత్ర దర్శకుడు, దివంగత కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా పరిచయం అవుతున్న సినిమా ఇది. సంజనా ఆనంద్ హీరోయిన్. కార్తీక్ శంకర్ రచన, దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ విదలైంది. 'రాజావారు రాణివారు' చిత్రంతో కిరణ్ తన కెరీర్ ను మొదలుపెట్టారు. ఈ మధ్య కాలంలో కిరణ్ అబ్బవరం నటిస్తోన్న సినిమాలు పెద్దగా వర్కవుట్ కాలేదు. మరి ఈ సినిమాలతోనైన హిట్ ని తన ఖాతాలో వేసుకుంటారో లేదో చూడాలి.
View this post on Instagram
View this post on Instagram