Bro-Daddy: మలయాళ రీమేక్ పై సురేష్ బాబు ఫోకస్.. వెంకీ-రానా హీరోలుగా..?
'బ్రో డాడీ' రీమేక్ పై మన మేకర్ల దృష్టి పడింది. ఇప్పటికే చాలా మంది నిర్మాతలు ఈ రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు.
టాలీవుడ్ అగ్ర నిర్మాత సురేష్ బాబు గతంలో చాలా సినిమాల రీమేక్ హక్కులను కొనుగోలు చేసి తన తమ్ముడు వెంకటేష్ ని హీరోగా పెట్టి తెలుగులో సినిమాలు తీశారు. అవన్నీ కూడా భారీ విజయాలను అందుకున్నాయి. రీమేక్ సినిమాలతో వెంకీ మంచి పాపులారిటీ సంపాదించారు. ఇప్పుడు మరో రీమేక్ పై సురేష్ బాబు దృష్టి పడినట్లు సమాచారం.
ఆ సినిమాలో వెంకీ-రానాలు హీరోలుగా నటిస్తారని సమాచారం. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందంటూ చాలా వార్తలు వచ్చాయి. రీసెంట్ గా నెట్ ఫ్లిక్ లో స్ట్రీమింగ్ కానున్న 'రానా నాయుడు' సిరీస్ లో వెంకీ-రానా కలిసి నటిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు వీరి కాంబోలో సినిమా రాబోతుందని టాక్. ఇటీవల హాట్ స్టార్ లో విడుదలైన మలయాళ సినిమా 'బ్రో డాడీ'కి మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఇందులో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ తండ్రీకొడుకులుగా నటించారు. కూల్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా దీన్ని తెరకెక్కించారు. రెండు కుటుంబాలు, వారి మధ్య జరిగే డ్రామా నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. పృథ్వీ రాజ్ సుకుమారన్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. గతంలో ఈయన రూపొందించిన 'లూసిఫర్' సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది.
ఆ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు 'బ్రో డాడీ' రీమేక్ పై మన మేకర్ల దృష్టి పడింది. ఇప్పటికే చాలా మంది నిర్మాతలు ఈ రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. వీరిలో సురేష్ బాబు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వెంకీ-రానాలకు ఇది పెర్ఫెక్ట్ సబ్జెక్ట్ అని ఆయన భావిస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!
View this post on Instagram