అన్వేషించండి

Thalaivar 171 Title: ‘కూలీ’గా వస్తున్న రజనీ - తలైవర్‌ను ఇలా చూసి ఎన్నాళ్లయిందో!

Thalaivar 171 Title Reveal: సూపర్ స్టార్ రజనీకాంత్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి ‘కూలీ’ అని టైటిల్ ఖరారు చేశారు.

Coolie Movie: సూపర్ స్టార్ రజనీకాంత్ 2023లో ‘జైలర్’తో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చూపించాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూడా తలపతి విజయ్ ‘లియో’తో దాదాపు ‘జైలర్’ స్థాయి వసూళ్లు సాధించాడు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి సినిమా చేయనున్నారు. ప్రకటించిన నాటి నుంచే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇప్పుడు ఈ సినిమా టైటిల్‌ను నిర్మాతలు రివీల్ చేశారు. రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌కు ‘కూలీ’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ టైటిల్‌ను గ్లింప్స్ వీడియో ద్వారా రివీల్ చేశారు.

‘కూలీ’ సినిమా గురించి ఎన్నో ఇంట్రస్టింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా కీలక పాత్రలో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ నాగార్జున ఈ సినిమాలో నటిస్తే 32 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ కలిసి నటించినట్లు అవుతుంది. 1991లో విడుదల అయిన ‘శాంతి క్రాంతి’ అనే సినిమాలో చివరి సారిగా నాగార్జున, రజనీకాంత్ కలిసి కనిపించారు.

Also Readవిశ్వంభర ఇంటర్వెల్... మెగాస్టార్ కెరీర్‌లోనే బెస్ట్ బ్యాంగ్!

కింగ్ నాగార్జున ప్రస్తుతం శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘కుబేర’లో కీలక పాత్రలో కనిపిస్తున్నారు. 2022లో వచ్చిన ‘బ్రహ్మాస్త్ర’లో నంది పాత్రలో నాగార్జున కనిపించి మెప్పించారు. కాబట్టి నాగార్జునకు ఇటువంటి మల్టీస్టారర్లు కొత్తేమీ కాదు. మరో వైపు ‘కూలీ’లో కీలక పాత్ర కోసం షారుక్ ఖాన్, రణ్‌వీర్ సింగ్‌లను కూడా లోకేష్ కనగరాజ్ సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చాలా మంది స్టార్లు కనిపిస్తారని తెలుస్తోంది.

లోకేష్ కనగరాజ్ ఈ సినిమాలో రజనీకాంత్‌ను నెగిటివ్ షేడ్‌లో చూపించనున్నాడు. ఈ విషయాన్ని లోకేష్ పలు ఇంటర్వ్యూల్లో కూడా తెలిపాడు. రజనీకాంత్‌ను నెగిటివ్ షేడ్‌లో చూడటం తనకు ఇష్టమని, ‘కూలీ’ సినిమా అదే జోనర్‌లో ఉంటుందని పేర్కొన్నాడు.

‘కూలీ’ తర్వాత రజనీకాంత్ మరో క్రేజీ ప్రాజెక్టులో నటించనున్నారు. 2023లో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో, రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘జైలర్’ రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రజనీ బాక్సాఫీస్ స్టామినాను తిరిగి ప్రపంచానికి చాటి చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘జైలర్’ సీక్వెల్‌కు కథ వండే పనిలో నెల్సన్ బిజీగా ఉన్నారు. ‘జైలర్ 2’ని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. లోకేష్ కనగరాజ్ సినిమా పూర్తి కాగానే రజనీ ‘జైలర్ 2’ మీదకి వెళ్లిపోతారు.

రజనీకాంత్ ప్రస్తుతం కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'వేట్టయాన్'. టీజే జ్ఞానవేల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య 'జై భీమ్' సినిమాకు కూడా ఆయనే దర్శకుడు. టి.సుబాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ హౌస్ నిర్మాణ సంస్థ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ నెలలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా అనౌన్స్ చేశారు. ‘వేట్టయాన్’ సినిమాలో కూడా భారీ స్టార్ కాస్టింగ్ ఉంది. రజనీకాంత్‌తో పాటు అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషార విజయన్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

Also Readరాజశేఖర్ కొత్త సినిమా - ప్రభాస్ కజిన్ నిర్మాణంలో...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget