Rajasekhar: రాజశేఖర్ కొత్త సినిమా - ప్రభాస్ కజిన్ నిర్మాణంలో...
Rajasekhar to share screen space with one more Young Hero: రెబల్ స్టార్ ప్రభాస్ కజిన్ నిర్మాణంలో యాంగ్రీ స్టార్ రాజశేఖర్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా ఏది? దర్శకుడు ఎవరు? వంటి వివరాలు తెలుసుకోండి.
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ (Rajasekhar) యువ హీరోలతో కలిసి నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. నితిన్ హీరోగా తెరకెక్కిన 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమాలో కీలక పాత్రలో ఆయన కనిపించారు. ఇప్పుడు మరో యువ కథానాయకుడు శర్వానంద్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ప్రభాస్ కజిన్ ఓ ప్రొడ్యూసర్ అయిన ఆ సినిమా ఏది? దర్శకుడు ఎవరు? వంటి పూర్తి వివరాల్లోకి వెళితే...
శర్వా - యువి క్రియేషన్స్ కొత్త సినిమాలో రాజశేఖర్!
ప్రామిసింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand), అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన యువి క్రియేషన్స్ కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్. 'రన్ రాజా రన్', 'ఎక్స్ ప్రెస్ రాజా', 'మహానుభావుడు' విజయాల తర్వాత డబుల్ హ్యాట్రిక్‌కి శ్రీకారం చుట్టారు. జీ 5 ఒరిజినల్ వెబ్ సిరీస్ 'లూజర్'తో విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. అందులో రాజశేఖర్ నటిస్తున్నారు.
Also Read: విశ్వంభర ఇంటర్వెల్... మెగాస్టార్ కెరీర్‌లోనే బెస్ట్ బ్యాంగ్!
View this post on Instagram
Rajasekhar In Sharwanand 36 Movie: హీరోగా శర్వానంద్ 36వ చిత్రమిది. దీనిని అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో విక్రమ్ సమర్పణలో యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రభాస్ కజిన్ ప్రమోద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ మొదలు అయ్యింది. అందులో రాజశేఖర్ సైతం జాయిన్ అయ్యారు. కథ, కథలో ఆయన క్యారెక్టర్ నచ్చడంతో సినిమా చేసేందుకు వెంటనే ఓకే చేశారని తెలిసింది. అయితే, ప్రస్తుతానికి ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అనేది సస్పెన్స్. మూవీ స్టార్టింగ్ టు ఎండింగ్ కనిపించే కీ రోల్ అని తెలిసింది.
Also Read: విశ్వంభర ఇంటర్వెల్... మెగాస్టార్ కెరీర్‌లోనే బెస్ట్ బ్యాంగ్!
స్పోర్ట్స్ బేస్డ్ సినిమా... హీరో బైక్ రైడర్!
స్పోర్ట్స్ నేపథ్యంలో శర్వా 36 సినిమా రూపొందుతోంది. హీరో బైక్ రైడర్ పాత్రలో కనిపించనున్నారు. సినిమా అనౌన్స్ చేసినప్పుడు విడుదల చేసిన ప్రీ లుక్ కాన్సెప్ట్ పోస్టర్‌లో రైడర్స్ కొందరు దుమ్ము ధూళితో కూడిన రోడ్ మీద డ్రైవ్ చేస్తున్న దృశ్యం కనిపించింది. వారిలో ఓ రైడర్ జాకెట్ మీద 'ఎస్ 36' అని ఉంది. శర్వా 36వ సినిమా కనుక అలా రాశారు.
Also Read: కొరటాల చేసిన తప్పు నాగ్ అశ్విన్ చెయ్యలేదు - ఆచార్యకు, కల్కికి తేడా అదే మరి!
''మోటర్ సైక్లింగ్ నేపథ్యంలో ఓ ఫ్యామిలీలో మూడు తరాలకు చెందిన కథతో ఈ సినిమా రూపొందుతోంది. శర్వానంద్ తొలిసారి స్పోర్ట్స్ నేపథ్యంలో సినిమా చేస్తున్నారు. ఆయన ఇంతకు ముందు నటించిన సినిమాలు, క్యారెక్టరైజేషన్లతో పోలిస్తే ఇందులో పూర్తిగా కొత్తగా కనిపిస్తారు'' అని దర్శక నిర్మాతలు తెలిపారు. మాళవికా నాయర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు జిబ్రాన్ సంగీత దర్శకుడు. ఇంతకు ముందు శర్వా, యువి కలయికలో వచ్చిన 'రన్ రాజా రన్'కి ఆయన సంగీతం అందించారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎన్ సుదీప్, కళా దర్శకుడు: ఎ పన్నీర్ సెల్వం, ఎడిటర్: అనిల్ కుమార్ పి, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవన్, సినిమాటోగ్రఫీ: జె యువరాజ్, సమర్పణ: విక్రమ్, నిర్మాతలు: వంశీ - ప్రమోద్, రచన - దర్శకత్వం: అభిలాష్ కంకర.