Koratala Siva Nag Ashwin: కొరటాల చేసిన తప్పు నాగ్ అశ్విన్ చెయ్యలేదు - ఆచార్యకు, కల్కికి తేడా అదే మరి!
Amitabh Bachchan Kalki Look Vs Chiranjeevi Acharya Look: 'కల్కి' సినిమాలో అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ఇంట్రో విడుదలైన తర్వాత 'ఆచార్య' సినిమా, ఆ దర్శకుడు కొరటాల శివ మరోసారి వార్తల్లోకి వచ్చారు.

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) 'కల్కి' మూవీ (Kalki Movie) టీమ్ విడుదల చేసిన లేటెస్ట్ వీడియో గ్లింప్స్ చూశారా? లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)కు ఎర్లీ కెరీర్‌లో యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ ఉండేది. అప్పట్లో ఆయన ఎలా ఉండేవారో యాజిటీజ్ అలాగే 'కల్కి' వీడియోలో చూపించారు. డీ ఏజింగ్ టెక్నాలజీ ద్వారా అమితాబ్ యంగ్ లుక్ క్రియేట్ చేశారు.
అమితాబ్ యంగ్ లుక్ చూసి ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ టాలెంటెడ్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఎట్ ద సేమ్ టైమ్... మరో డైరెక్టర్ కొరటాల శివను ట్రోల్ చేస్తున్నారు. అందుకు కారణం ఆచార్య మూవీ.
'ఆచార్య'లో చిరు యంగ్ లుక్ మీద విమర్శలు
'కల్కి'లో అమితాబ్ యంగ్ లుక్ ఎలా అయితే క్రియేట్ చేశారో... సేమ్ డీ ఏజింగ్ టెక్నాలజీ యూజ్ చేసి 'ఆచార్య'లో మెగాస్టార్ చిరంజీవి యంగ్ లుక్ క్రియేట్ చేశారు. కానీ, ఆ లుక్ విమర్శలకు దారి తీసింది. అమితాబ్ బచ్చన్ యంగ్ లుక్ సెట్ అయినంత బాగా చిరు యంగ్ లుక్ సెట్ కాలేదు. సినిమా రిలీజైన రోజు నుంచి ఆ లుక్ మీద ట్రోల్స్ వచ్చాయి. మూవీ డిజాస్టర్ కావడంతో ఆ ట్రోల్స్ ఎఫెక్ట్ ఎక్కువ అయ్యింది. ఇప్పుడు మరోసారి ఆచార్య లుక్ తెరపైకి వచ్చింది.
Also Read: విశ్వంభర ఇంటర్వెల్... మెగాస్టార్ కెరీర్‌లోనే బెస్ట్ బ్యాంగ్!
De-aging done right #Kalki2829AD #AmitabhBachchan pic.twitter.com/OMAl4HjGFB
— HOMELANDER 🦅 (@PrudhviVRR) April 22, 2024
టెక్నాలజీ మీద గ్రిప్ ముఖ్యం బిగులూ!
Koratala Siva trolled again: కొరటాల శివ కమర్షియల్ డైరెక్టర్. 'మిర్చి' నుంచి 'ఆచార్య' వరకు తన సినిమాల్లో సమాజానికి ఉపయోగపడే మంచి సందేశం ఇచ్చారు. అయితే, కథతో పాటు డైలాగ్స్ మీద పెట్టిన కాన్సంట్రేషన్ విజువల్ ఎఫెక్ట్స్ మీద పెట్టలేదని మెగా ఫ్యాన్స్ నుంచి విమర్శలు వస్తున్నాయి. ఆయన టెక్నాలజీని సరిగా వాడుకుని చిరు లుక్ మీద కేర్ తీసుకుని ఉంటే విమర్శలు వచ్చేవి కాదని పలువురు అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. ఇండస్ట్రీ ఇన్ సైడ్ సర్కిళ్లలో కూడా అమితాబ్ వర్సెస్ చిరంజీవి యంగ్ లుక్స్ గురించి డిస్కషన్ జరిగిందట.
Also Read: కల్కి రిలీజ్ జూన్‌లో... ఆ రెండు రోజుల్లో ఏదో ఒక తేదీన ప్రేక్షకుల ముందుకు ప్రభాస్ సినిమా?
'కల్కి' వీడియో గ్లింప్స్ ఆ ఒక్క హోప్ ఇచ్చింది
డీ ఏజింగ్ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న డిస్కషన్ ఫ్యాన్ మధ్య వార్‌కి దారి తీసింది. అది పక్కన పెడితే... ఇండస్ట్రీకి కొత్త హోప్ ఇచ్చింది. సీనియర్ హీరోలను యంగ్ లుక్‌లో చూపించే సన్నివేశాలు, కథలు రాసుకోవచ్చనే ధైర్యాన్ని ఇచ్చింది. సీనియర్ హీరోలను యంగ్ రోల్స్‌లో చూపించలేమనే ఆలోచన, భయాలు దర్శక నిర్మాతలకు అవసరం లేదు. ఇకపై కథలు రాసుకోవడానికి ఆకాశమే హద్దు.
Also Read: తమిళంలో 'యానిమల్'కు రోలెక్స్ సూర్య అయితే బెస్ట్ - 'యానిమల్ పార్క్' అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

