అన్వేషించండి

Kalki Release Date: కల్కి రిలీజ్ జూన్‌లో... ఆ రెండు రోజుల్లో ఏదో ఒక తేదీన ప్రేక్షకుల ముందుకు ప్రభాస్ సినిమా?

Kalki Movie Release Date: రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి' సినిమా జూన్ నెలలో రిలీజ్ కానుందా? బాలీవుడ్ వర్గాలు, ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్న వివరాల ప్రకారం ఈ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

Kalki 2989 AD movie release date: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు 'కల్కి 2989 ఏడీ' సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. లెజెండరీ యాక్టర్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ఇంట్రో గ్లింప్స్ ఆదివారం విడుదల చేశారు. ఆ వీడియో చివర్లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని అభిమానులు ఆశించారు. కానీ, 'కల్కి' మేకర్స్ ఎప్పుడు విడుదల చేసేదీ చెప్పలేదు. దాంతో డిజప్పాయింట్ అయిన ఫ్యాన్స్ కొందరు ఉన్నారు. 

బాలీవుడ్ వర్గాలు, ట్రేడ్ సర్కిల్స్ నుంచి వినబడుతున్న మాట వాళ్లకు సంతోషాన్ని కలిగించవచ్చు. జూన్ నెలలో 'కల్కి'ని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్.

జూన్ 20 లేదా 27న 'కల్కి' విడుదల!?
Kalki is set to hit the screen in June: 'కల్కి' సినిమా జూలై నెలలో థియేటర్లలోకి వస్తుందని ముంబైలోని మరాఠా మందిర్, గ్జైటీ గెలాక్సీ థియేటర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోజ్ దేశాయ్ తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. 

వికీపీడియాలో అప్డేట్ అయిన 'కల్కి' పేజీ ప్రకారం జూన్ 20న సినిమా విడుదల కానుంది. బాలీవుడ్ ట్రేడ్ వర్గాల నుంచి వినబడుతున్న సమాచారం ప్రకారం జూన్ 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏది ఏమైనా జూన్ నెలలో సినిమా విడుదల కావడం ఖాయం అని ట్రేడ్ టాక్.

Also Read: కల్కి అప్డేట్ వచ్చేసింది - ప్రభాస్ సినిమాలో అమితాబ్ బచ్చన్ వీడియో గ్లింప్స్ చూశారా? గూస్ బంప్స్ అంతే


జూలైలో విడుదల చెయ్యమని ప్రభాస్ చెప్పారా?
మే 9న 'కల్కి' థియేటర్లలోకి వస్తుందని ప్రేక్షకులు ఎక్స్‌పెక్ట్ చేశారు. వైజయంతి మూవీస్ సంస్థ నిర్మించిన 'జగదేకవీరుడు అతిలోక సుందరి', నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన 'మహానటి' సినిమాలు ఆ రోజున వచ్చాయి. సెంటిమెంట్ ప్రకారం మే 9న 'కల్కి'ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ట్రై చేశారు. కానీ, వీలు కాలేదు.

'కల్కి' బయ్యర్లు మే 30న విడుదల చెయ్యమని పట్టు బడుతున్నారట. సమ్మర్ సీజన్, హాలిడేస్ ఎండింగ్ వంటివి కలిసి వస్తాయని వాళ్ల నమ్మకం. పబ్లిసిటీ వంటివి చెయ్యడానికి టైమ్ అవసరం కనుక జూన్ నెలలో రిలీజ్ చేస్తే బెటర్ అని నిర్మాత అశ్వినీదత్ ఆలోచిస్తున్నారట. హీరో ప్రభాస్ అయితే ఏకంగా జూలైకి పోస్ట్ పోన్ చెయ్యమని చెప్పారని టాలీవుడ్ టాక్. అందువల్ల, రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యకుండా కేవలం అమితాబ్ క్యారెక్టర్ ఇంట్రో విడుదల చేశారనుకుంట. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది.

Also Readతమిళంలో 'యానిమల్'కు రోలెక్స్ సూర్య అయితే బెస్ట్ - 'యానిమల్ పార్క్' అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా


నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వినీదత్ ప్రొడ్యూస్ చేస్తున్న 'కల్కి'లో దీపికా పదుకొనే, దిశా పటానీ హీరోయిన్లు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, పశుపతి ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ గెస్ట్ రోల్స్ చేశారట.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
Sai Durgha Tej - Pawan Kalyan: జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలుఅరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
Sai Durgha Tej - Pawan Kalyan: జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Adani Group: లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
Warangal Bank Robbery: గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
PPP Model Chandrababu:  ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
Embed widget