Amitabh Bachchan Kalki Glimpse: కల్కి అప్డేట్ వచ్చేసింది - ప్రభాస్ సినిమాలో అమితాబ్ బచ్చన్ వీడియో గ్లింప్స్ చూశారా? గూస్ బంప్స్ అంతే
Kalki 2898 AD Update - Amitabh Bachchan Glimpse Released: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న అప్డేట్ వచ్చేసింది. 'కల్కి 2989 ఏడీ' సినిమా రిలీజ్ డేట్ ఈ రోజు చెప్పేశారు.
Amitabh Bachchan Video Glimpse From Kalki Movie: ఎప్పుడు... ఎప్పుడు... ఎప్పుడు? మా అభిమాన కథానాయకుడు, రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ ఫిల్మ్ 'కల్కి 2989 ఏడీ' థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడు? అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. వాళ్లందరి ఎదురు చూపులకు నేడు సమాధానం రాలేదు కానీ ఓ గ్లింప్స్ వచ్చింది.
'కల్కి 2989 ఏడీ'ని ఎప్పుడు విడుదల చేస్తారో?
Kalki 2989 AD Release Date: 'కల్కి' చిత్రాన్ని తొలుత మే 9న విడుదల చేయాలని భావించారు. దర్శకుడు నాగ్ అశ్విన్ తీసిన సావిత్రి బయోపిక్ 'మహానటి'తో పాటు నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధినేత సి అశ్వనీదత్ నిర్మించిన క్లాసిక్ ఫిల్మ్ 'జగదేకవీరుడు అతిలోక సుందరి' విడుదలైనది ఆ తేదీనే. అయితే, వివిధ కారణాల వల్ల మే 9న విడుదల చేయడం కుదరడం లేదు. ఇప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు కానీ... బిగ్ బి యాంగ్రీ యంగ్ మ్యాన్ లుక్, ఓల్డ్ లుక్ - రెండు చూపించి పాన్ ఇండియా ప్రేక్షకులకు మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఆయన ద్రోణాచార్య పుత్రుడు అశ్వత్థామ పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. ఆ గ్లింప్స్ మీరూ చూడండి.
Amitabh Bachan as #Ashwathama 🔥🔥🔥#Kalki2898AD #Prabhas pic.twitter.com/5Ia5vdUKLo
— Prabhas Trends™© (@Manu41153488) April 21, 2024
రెండు పాత్రల్లో కనిపించనున్న ప్రభాస్!
Prabhas character in Kalki movie: 'కల్కి'లో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు యూనిట్ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది. భైరవగా ఆయన లుక్ విడుదల చేయడానికి ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది. అలాగే, టైటిల్ రోల్ 'కల్కి'గానూ ఆయన సందడి చేయనున్నారు.
Also Read: చిరంజీవి మద్దతు జనసేన, బీజేపీ, టీడీపీ కూటమికే - ఓపెన్‌గా చెప్పిన మెగాస్టార్!
'కల్కి'లో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ఓ కథానాయికగా నటిస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన మూవీ గ్లింప్స్‌లో ఆమెను చూపించారు. దీపికాతో పాటు 'లోఫర్', 'ధోని' సినిమాల ఫేమ్ దిశా పటానీ మరో కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవల ఇటలీలో ప్రభాస్, దిశా మీద ఓ పాటను తెరకెక్కించారు. అక్కడ వాళ్లిద్దరూ తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది కూడా!
'కల్కి'... కీలక పాత్రల్లో అమితాబ్, కమల్!
'కల్కి' సినిమాలో లెజెండరీ యాక్టర్స్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కీలక పాత్రల్లో కనిపించారు. ఆల్రెడీ విడుదలైన అమితాబ్ లుక్ ఈ మూవీపై అంచనాలు మరింత పెంచింది. కమల్ హాసన్ లుక్, రోల్ కోసం ఆయన అభిమానులతో పాటు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, తమిళ నటుడు పశుపతి, బెంగాలీ నటుడు సస్వత ఛటర్జీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Also Read: తమిళంలో 'యానిమల్'కు రోలెక్స్ సూర్య అయితే బెస్ట్ - 'యానిమల్ పార్క్' అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా
హిందూ మైథాలజీ నేపథ్యంలో 'కల్కి'ని తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ తొలిసారి ఈ తరహా సూపర్ హీరో సినిమా చేస్తున్నారు. 'కల్కి' కథ పురాణ ఇతిహాస గ్రంథమైన మహాభారతం నుంచి స్ఫూర్తి పొందిన సంఘటనల నుండి 2898 ఏడీ కాలం మధ్యలో ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. వైజయంతి మూవీస్ పతాకంపై సి అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కూర్పు: కోటగిరి వెంకటేశ్వర రావు, సంగీతం: సంతోష్ నారాయణన్.
అతిథి పాత్రల్లో 'సీతా రామం' జంట!?
'కల్కి' దర్శక నిర్మాతలు అధికారికంగా వెల్లడించలేదు కానీ... ఈ సినిమాలో 'సీతా రామం' హీరో హీరోయిన్లు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ అతిథి పాత్రల్లో తళుక్కున సందడి చేయనున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ సైతం ఓ పాత్రలో కనిపిస్తారట.