Happy Birthday Mahesh Babu : అందంలో ప్రిన్స్.. మనసులో మారాజు.. సింపుల్ గా సూపర్ స్టార్..
అమ్మాయిల కలల 'రాజకుమారుడు'.. సినీ ఇండస్ట్రీ 'యువరాజు'.. మన ఘట్టమనేని వారసుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు.
అమ్మాయిల కలల 'రాజకుమారుడు'.. సినీ ఇండస్ట్రీ 'యువరాజు'.. మన ఘట్టమనేని వారసుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. మహేష్ గురించి సింపుల్ గా చెప్పాలంటే 'మిస్టర్ పెర్ఫెక్ట్' అనొచ్చు. ప్రముఖ సినీ నటుడు కృష్ణ,ఇందిరదేవి దంపతులకు 1975 ఆగస్టు 9న చెన్నైలో జన్మించిన మహేష్ బాబుకి నేటితో 46 ఏళ్లు. నాలుగేళ్ల వయసులోనే బాలనటుడిగా 'నీడ' అనే సినిమాతో పరిచయమయ్యారు మహేష్ బాబు. బాలనటుడిగా 'పోరాటం', 'గూఢచారి 117', 'ముగ్గురు కొడుకులు', 'బజార్ రౌడీ', 'బాల చంద్రుడు' వంటి సినిమాల్లో నటించి మెప్పించారు.
రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'రాజకుమారుడు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు మహేష్ బాబు. ఇప్పటివరకు 27 సినిమాల్లో నటించిన మహేష్ 7 రాష్ట్ర నంది అవార్డులు, ఐదు ఫీల్మ్ ఫేర్, మూడు సైమా అవార్డులను అందుకున్నారు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నారు మహేష్ బాబు.
ప్రతి పుట్టినరోజు నాడు మహేష్ బాబు సినిమా నుండి ఒక టీజరో.. ఫస్ట్ లుక్కో మనం ఎక్స్పెక్ట్ చేయడం మనకి సెంటిమెంట్ గా మారింది. దానికి తగ్గట్లే మహేష్ సినిమా దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తుంటారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుకి కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. కావాలనే చేస్తారా..? లేక యాదృచ్చికంగా జరుగుతుందో తెలియదు కానీ దాదాపు అన్ని సినిమాల విషయంలో ఆయనొక ప్యాటర్న్ ఫాలో అవుతుంటారు. అవేంటో ఒకసారి చూద్దాం!
స్పీచ్ లతో అదరహో..
నిజానికి మహేష్ బాబు బయట పెద్దగా మాట్లాడారు. ఇంటర్వ్యూలలో కూడా వన్ వర్డ్ ఆన్సర్ ఇస్తుంటారు. అలాంటిది 'దూకుడు' సినిమా నుండి అనుకుంటా.. తన సినిమాల ఈవెంట్స్ లో స్పీచ్ లు ఓ రేంజ్ లో ఇస్తున్నారు.
సినిమా పూజలకు దూరంగా..
సినిమాల ఓపెనింగ్ అంటే హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇలా టీమ్ మొత్తం హాజరవుతుంటుంది. కానీ మహేష్ బాబు మాత్రం తన సినిమాల ఓపెనింగ్ పూజకి వెళ్లరు. ఇది ఆయనకొక సెంటిమెంట్. 'సర్కారు వారి పాట' సినిమా పూజా కార్యక్రమాలకు కూడా మహేష్ భార్య నమ్రత, కూతురు సితార హాజరయ్యారు.
హిట్టిస్తే మరో ఆఫర్..
తనతో పని చేసిన దర్శకులు హిట్టిస్తే గనుక వెంటనే వారికి మరో ఛాన్స్ ఇవ్వడంతో మహేష్ కి అలవాటు. గుణశేఖర్, త్రివిక్రమ్, శ్రీనువైట్ల, శ్రీకాంత్ అడ్డాల, పూరి జగన్నాథ్, కొరటాల శివ లాంటి దర్శకులకు అలానే ఆఫర్లు ఇచ్చారు.
ఫ్యామిలీతో ట్రిప్స్..
సినిమా రిలీజ్ బజ్ అంతా అయిపోయిన తరువాత.. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే.. పనులన్నీ పక్కన పెట్టి ఒక ఫ్యామిలీ ట్రిప్ వేయాల్సిందే. ఇప్పటివరకు మహేష్ తన ఫ్యామిలీతో కలిసి చాలా ప్రాంతాలు చుట్టేశారు. నమ్రత ఇన్స్టాగ్రామ్ పై ఓ లుక్కేస్తే మీకే అర్ధమవుతుంది.