Sudeep Vikrant Rona Postponed: కరోనా వల్ల వాయిదా పడిన మరో పాన్ ఇండియా సినిమా 'విక్రాంత్ రోణ'
కరోనా మూడో దశ నేపథ్యంలో తలెత్తిన పరిస్థితుల వల్ల మరో పాన్ ఇండియా సినిమా వాయిదా పడింది.

కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా 'విక్రాంత్ రోణ'. ఈ చిత్రానికి అనూప్ భండారి దర్శకత్వం వహించారు. జాక్ మంజునాథ్, షాలిని మంజునాథ్, అలంకార్ పాండియన్ నిర్మించారు. ఇందులో సుదీప్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండేజ్ నటించారు. తొలుత ఈ సినిమాను ఫిబ్రవరి 24న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే... ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో విడుదల వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు.
"ఫిబ్రవరి 24న మీ అందరినీ థియేటర్లలో కలవాలని మేం అనుకున్నాం. అయితే... ప్రస్తుత కరోనా పరిస్థితులు, కరోనాను కట్టడి చేయడానికి విధించిన ఆంక్షల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున సినిమాను విడుదల చేసే పరిస్థితులు లేవు. సినిమా కోసం ఎక్కువ రోజులు ఎదురు చూడటం బాధించే విషయమే. అయితే... ఎదురు చూపులకు తగ్గట్టుగా సినిమాటిక్ అనుభూతి ఇస్తుందీ 'విక్రాంత్ రోణ'. కొత్త విడుదల తేదీతో మిమ్మల్ని కలుస్తాం" అని 'విక్రాంత్ రోణ' టీమ్ పేర్కొంది.
View this post on Instagram
కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆల్రెడీ 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం', 'రాధే శ్యామ్' వంటి సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి విడుదల కావాల్సిన 'ఆర్ఆర్ఆర్' వాయిదా పడింది. మార్చి 18న లేదంటే ఏప్రిల్ 28న విడుదల చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. మార్చి తొలి వారం లేదంటే రెండో వారంలో 'రాధే శ్యామ్'ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
#VikrantRona will meet you on a newer date.
— Anup Bhandari (@anupsbhandari) January 27, 2022
Stay Safe! @KicchaSudeep @nirupbhandari @neethaofficial @Asli_Jacqueline @JackManjunath @Alankar_Pandian @shaliniartss @InvenioF @ZeeStudios_ @TSeries @LahariMusic @VikrantRona pic.twitter.com/8r3IpwWPz9
Before You Go
Allu Arjun Graces Forbes India 2026 Cover | ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై అల్లు అర్జున్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















