Samantha: ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. సమంత పోస్ట్..
సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంటోంది సమంత. ఎప్పటికప్పుడు తన ఫొటోలను, పలు విషయాలను షేర్ చేసుకుంటుంది.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత.. నటుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడాకులు తీసుకొని షాకిచ్చింది. ఇప్పటివరకు వీరి విడాకులకు గల కారణాలు మాత్రం బయటకు రాలేదు. నాలుగేళ్ల తమ వివాహబంధానికి ఫుల్ స్టాప్ పెడుతూ.. ఈ ఏడాది అక్టోబర్ 2న ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించింది.
అప్పటినుంచి సమంతను టార్గెట్ చేస్తూ.. సోషల్ మీడియాలో చాలా మంది ట్రోల్ చేశారు. దీంతో సమంతకు ఇండస్ట్రీలో అవకాశాలు రావేమో అనుకున్నారు. కానీ ఇంతకముందుకంటే మరింత జోరుగా ప్రాజెక్ట్ లు ఓకే చేస్తుంది సమంత. రీసెంట్ గా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కూడా ఓకే చేసింది. తెలుగులోనే కాకుండా.. బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలను లైన్ లో పెడుతోంది. త్వరలోనే ఆ సినిమాలకు సంబంధించిన వివరాలు తెలియనున్నాయి. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంటోంది సమంత. ఎప్పటికప్పుడు తన ఫొటోలను, పలు విషయాలను షేర్ చేసుకుంటుంది.
తాజాగా ఈ బ్యూటీ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఓ పోస్ట్ పెట్టింది. అందులో ఏం రాసిందంటే.. 'ఇతరుల మీద ఎమోషనల్ గా ఆధారపడడం మానుకోవాలి. ఇతరులు ఏం ఆలోచిస్తారు.. వారేం నమ్ముతారు.. వాళ్లు ఆశించేది ఏంటి..? ఇవన్నీ కూడా జైలు గదికి ఉండే కడ్డీలు. అలా ఆలోచించడం మానుకోవాలి. ఆ జైలు నుంచి బయటపడడానికి.. మీకు మీరే రియలైజ్ అవ్వాలి. మీరు ఎప్పుడైనా.. దాని నుంచి బయటకు రావొచ్చు. ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరి ఒపీనియన్ మేటర్ కాదు. నిజం ఒక్కటే మేటర్. ఈ విషయాన్ని మీరు అర్ధం చేసుకోగలిగితే.. మీరు మరింత గౌరవాన్ని పొందుతారు' అంటూ తన స్టేటస్ లో రాసుకొచ్చింది.
Also Read:సమ్మర్ రేసులో విజయ్ 'బీస్ట్'.. ఇదిగో అఫీషియల్ అనౌన్స్మెంట్..
Also Read:'ఆచార్య' హైవోల్టేజ్ పార్టీ సాంగ్.. రిలీజ్ ఎప్పుడంటే..?
Also Read:అజిత్ అలా చేయడం చాలా ఇబ్బందిగా అనిపించింది.. రాజమౌళి వ్యాఖ్యలు..