అన్వేషించండి
Advertisement
Acharya: 'ఆచార్య' హైవోల్టేజ్ పార్టీ సాంగ్.. రిలీజ్ ఎప్పుడంటే..?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'ఆచార్య' సినిమాకి సంబంధించిన ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం.
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కీలక పాత్రలో తెరకెక్కుస్తోన్న చిత్రం 'ఆచార్య'. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని పాటలను, టీజర్లను విడుదల చేశారు.
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇందులో చిరు డాన్స్ చేస్తూ కనిపించారు. ఈ పోస్టర్ తో ఓ అనౌన్స్మెంట్ చేసింది చిత్రబృందం. జనవరి 3న సాయంత్రం 4:05 గంటలకు సినిమా నుంచి 'సానా కష్టం' అనే పాటను విడుదల చేయబోతున్నారు. ఇదొక హైవోల్టేజ్ పార్టీ సాంగ్ అని తెలిపింది చిత్రబృందం. మణిశర్మ మాస్ బీట్ కి చిరు స్టెప్పులు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.
ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్.. రామ్ చరణ్ జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. దేవాదాయ భూములు అన్యాక్రాంతం కావడం అనే అంశంపై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మెసేజ్‌తో పాటు కమర్షియల్ అంశాలను మిక్స్ చేసి సినిమాలను తీయడంలో కొరటాలకు మంచి పేరుంది. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి!
Let's begin 2022 with the High Voltage Party Song 💥💥#SaanaKastam Lyrical Video out on 3rd JAN at 4:05 PM#Acharya#AcharyaOnFeb4th
— Matinee Entertainment (@MatineeEnt) December 31, 2021
Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma @KonidelaPro @adityamusic pic.twitter.com/u1EILCzmda
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
హైదరాబాద్
హైదరాబాద్
ప్రపంచం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion