Liger First Glimpse: ముంబై స్లమ్ డాగ్.. బాక్సింగ్ బరిలోకి దిగితే.. దేవరకొండ ఫ్యాన్స్ కి పూనకాలే..
తాజాగా 'లైగర్' సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేశారు. ముంబై సిటీ నుంచి వచ్చిన స్లమ్ డాగ్ బాక్సర్ గా ప్రపంచ స్థాయికి ఎలా ఎదిగాడనే కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కించారు.
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో 'లైగర్' అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా మొదలై చాలా కాలమవుతోంది. కానీ ఇప్పటివరకు షూటింగ్ పూర్తి కాలేదు. నిజానికి దర్శకుడు పూరి జగన్నాథ్ ఏ సినిమానైనా ఆరు నెలల్లో పూర్తి చేసేస్తాడు. ఆయన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అలానే తీశారు. కానీ ఈ సినిమా కోసం చాలా సమయం తీసుకుంటున్నారు. మొత్తానికి ఆగస్టు 25, 2022న సినిమాను విడుదల చేయనున్నట్టు రీసెంట్ గా ప్రకటించారు.
ఇక తాజాగా సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేశారు. ముంబై సిటీ నుంచి వచ్చిన స్లమ్ డాగ్ బాక్సర్ గా ప్రపంచ స్థాయికి ఎలా ఎదిగాడనే కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కించారు. బాక్సింగ్ బరిలోకి విజయ్ ఎంట్రీని చాలా పవర్ ఫుల్ గా చూపించారు. విజువల్స్ అన్నీ చాలా సాలిడ్ గా ఉన్నాయి. విజయ్ ఫైట్ మూవ్స్ చూస్తుంటే.. రియల్ బాక్సర్ లానే అనిపిస్తున్నాడు. వాట్ లగా దేంగే.. అంటూ చాలా అగ్రెసివ్ గా డైలాగ్ చెప్తాడు. విజయ్ ఫ్యాన్స్ కోరుకునే యాటిట్యూడ్ ని ఈ చిన్న గ్లింప్స్ లోనే ఓ రేంజ్ లో చూపించాడు. ఇక సినిమా ఏ లెవెల్ ఉంటుందో చూడాలి!
బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థాయ్‌లాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ్చా యాక్షన్ సీక్వెన్స్‌లు డిజైన్ చేస్తున్నారు. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్‌ను కీలక పాత్ర కోసం తీసుకున్నారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు.
Glimpse. That's it. #LigerFirstGlimpse#Ligerhttps://t.co/nJoyeDmZtu
— Vijay Deverakonda (@TheDeverakonda) December 31, 2021
Also Read: ప్రేమలో కళ్లు మూసుకుపోయాయ్... కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్ లాస్య
Also Read: యువరానర్... వీళ్లే ఈ ఏడాది ఆన్-స్క్రీన్ లాయర్స్!
Also Read: నాలుగు గోడల మధ్య జరిగేది... నచ్చేలా చూపించారు... 2021లో బోల్డ్ అటెంప్ట్స్!
Also Read: కాలర్ ఎగరేసిన కమర్షియల్ సినిమా... దుమ్ము దులిపేసిన స్టార్స్!
Also Read: ప్రేమకథ ప్లేస్‌లో 'ఆర్ఆర్ఆర్' ఎలా వచ్చింది? రాజమౌళి వైఫ్ చేసిందేమిటి?
Also Read: సామాన్యుడికి దూరంగా తెలుగు హీరో!? మనలో ఒకడిగా కనిపించలేరా!?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి