News
News
వీడియోలు ఆటలు
X

Spy Teaser: ‘నేతాజీ విమాన ప్రమాదంలో మరణించడం ఒక కవర్ స్టోరీ’ - నిఖిల్ స్పై టీజర్ చూశారా?

హీరో నిఖిల్ కొత్త సినిమా ‘స్పై’ టీజర్ విడుదల అయింది.

FOLLOW US: 
Share:

Spy Movie Teaser: ప్రముఖ టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న తాజా చిత్రం ‘స్పై’. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం నేపథ్యంలో సాగనున్న ఈ సినిమా టీజర్‌ను నిర్మాతలు సోమవారం విడుదల చేశారు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో నిఖిల్ గూఢచారి పాత్రలో కనిపించనున్నాడు. పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కింది.

ఇక టీజర్ విషయానికి వస్తే... నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఫైల్ మిస్ అయిందని మకరంద్ దేశ్ పాండే చెప్పడంతో టీజర్ ప్రారంభం అవుతుంది. ఆయన 1945లో విమాన ప్రమాదంలో మరణించారు కదా అని అభినవ్ గోమటం అడగ్గా... అది ఒక కవర్డ్ స్టోరీ అని మకరంద్ దేశ్ పాండే అంటారు. మధ్యలో యాక్షన్ సన్నివేశాలను కూడా చూపించారు. ‘మన చరిత్ర నీ చేతిలో ఉంది.’ అని నిఖిల్‌తో మకరంద్ దేశ్ పాండే అంటారు. ఈ టీజర్‌ను చూస్తే మరోసారి జాతీయ స్థాయిలో టాకింగ్ పాయింట్ అయ్యే సినిమాను నిఖిల్ తీశారు అనిపిస్తుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో ఈ టీజర్‌ను విడుదల చేశారు.

'స్పై' సినిమాతో ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.  జూన్ 29న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నట్లు తెలియజేసారు. స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన సీక్రెట్‌ ను కనుగొనే మిషన్‌ నేపథ్యంలో 'స్పై' సినిమా తెరకెక్కుతోందని తెలియజేసారు. దీనికి తగ్గట్టుగానే టైటిల్ లోగోలో బోస్ చిత్ర పటాన్ని ఉంచారు.

'కార్తికేయ 2' తర్వాత నిఖిల్ మరో నేషనల్ థ్రిల్లర్ తో రాబోతున్నాడని.. ఈసారి ఇండియాలో రహస్యంగా ఉంచబడిన నిజాన్ని వెలికితీయబోతున్నాడని ఈ సినిమా గ్లింప్స్‌లో పేర్కొన్నారు. నేతాజీ పేపర్ కటింగ్స్ కట్ కూడా కనిపిస్తున్న ఈ వీడియో క్లిప్ ఆకట్టుకుంటోంది.

'స్పై' చిత్రాన్ని చరణ్ తేజ్ ఉప్పలపాటి సమర్పణలో ఈడీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కె. రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. దీనికి నిర్మాత రాజశేఖర్ రెడ్డినే కథను కూడా అందించడం విశేషం. అత్యంత భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రం కోసం టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూరుస్తుండగా.. అనిరుధ్ కృష్ణమూర్తి మాటలు రాస్తున్నారు. అర్జున్ సూరిశెట్టి ఆర్ట్ డైరెక్టర్ గా.. రవి ఆంటోనీ ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. దర్శకుడు గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ చూసుకుంటున్నారు.

హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ లీ విటేకర్ & రాబర్ట్ లిన్నెన్ యాక్షన్ సన్నివేశాలను పర్యవేక్షిస్తున్నారు. బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కైకో నకహారా, హాలీవుడ్ డీఓపీ జూలియన్ అమరు ఎస్ట్రాడా కూడా ఈ సినిమాలో భాగమవుతున్నారు. 'కార్తికేయ 2' తో పాన్ ఇండియా వైడ్ గా 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన నిఖిల్.. స్పై తో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

Published at : 15 May 2023 05:21 PM (IST) Tags: Nikhil Garry bh Ishwarya Menon Spy Teaser Spy Telugu Movie

సంబంధిత కథనాలు

మహేష్ కోసం థమన్ కాపీ ట్యూన్ ఇచ్చాడా? 'గుంటూరు కారం' బీట్‌ను అక్కడి నుంచి లేపేశాడా?

మహేష్ కోసం థమన్ కాపీ ట్యూన్ ఇచ్చాడా? 'గుంటూరు కారం' బీట్‌ను అక్కడి నుంచి లేపేశాడా?

ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్ - రెండు సినిమాల షూటింగ్స్ ఒకేసారి!

ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్ - రెండు సినిమాల షూటింగ్స్ ఒకేసారి!

షూటింగ్ పూర్తి చేసుకున్న 'జైలర్' - రిలీజ్ ఎప్పుడంటే!

షూటింగ్ పూర్తి చేసుకున్న 'జైలర్' - రిలీజ్ ఎప్పుడంటే!

విజయ్ దేవరకొండపై సమంత ఎమోషనల్ కామెంట్స్ - రౌడీ‌బాయ్ లవ్లీ రిప్లై

విజయ్ దేవరకొండపై సమంత ఎమోషనల్ కామెంట్స్ - రౌడీ‌బాయ్ లవ్లీ రిప్లై

జోరుమీదున్న నిఖిల్ - ‘స్వయంభూ’ ఫస్ట్ లుక్ అదుర్స్

జోరుమీదున్న నిఖిల్ - ‘స్వయంభూ’ ఫస్ట్ లుక్ అదుర్స్

టాప్ స్టోరీస్

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !

YS Viveka Case  : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !