News
News
X

Smitha: 'చచ్చినా ఆ షోకి మాత్రం వెళ్లను' - బిగ్ బాస్ షోపై సింగర్ స్మిత కామెంట్స్!

బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొనమని ఎప్పుడైనా ఫోన్ వచ్చిందా..? అని స్మితను ప్రశ్నించగా.. 'చచ్చినా ఆ షోకి మాత్రం వెళ్లను' అంటూ చెప్పుకొచ్చింది.

FOLLOW US: 

బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోగా పాపులర్ అయింది బిగ్ బాస్. తెలుగులో ఇప్పటివరకు ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది ఈ షో. అలానే ఒక ఓటీటీ వెర్షన్ కూడా పూర్తయింది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6 మొదలైంది. ఈ షోకి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో.. అంతే స్థాయిలో విమర్శించే వాళ్లు కూడా ఉన్నారు. అలా విమర్శించే వారిలో సింగర్ స్మిత కూడా ఉన్నారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె బిగ్ బాస్ షోపై షాకింగ్ కామెంట్స్ చేసింది. 

బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొనమని ఎప్పుడైనా ఫోన్ వచ్చిందా..? అని స్మితను ప్రశ్నించగా.. 'చచ్చినా ఆ షోకి మాత్రం వెళ్లను' అంటూ చెప్పుకొచ్చింది స్మిత. టెలివిజన్ షోలలో బిగ్ బాస్ అనేది ఒక నెగెటివ్ షో అని.. కంటెస్టెంట్స్ అందరినీ ఒక చోట పడేసి.. తన్నుకోండి మేం టీఆర్ఫీ తెచ్చుకుంటాం అన్నట్లుగా బిగ్ బాస్ ఉంటుందని స్మిత తెలిపింది. అసలు ఆ షో ఏంటో తనకు అర్ధం కాదని.. కనీసం చూసే సాహసం కూడా చేయనని చెప్పుకొచ్చింది. 

అసలు బిగ్ బాస్ షో అంటేనే తనకు నచ్చదని.. ఆ షోకి వెళ్లాల్సిన అవసరం కూడా లేదని తెలిపింది. మనవాళ్లందరినీ వదిలేసి కొన్నాళ్లపాటు ఆ షోకి వెళ్లాల్సిన అవసరం లేదని.. ఏదైనా గట్టిగా మాట్లాడితే షోకి వెళ్లిన కంటెస్టెంట్స్ ను అన్నట్లుగా ఉంటుందని చెప్పింది. తనకు ఇష్టమైన వాళ్లు కూడా ఆ షోకి వెళ్లారని.. అక్కడకు వెళ్లిన, వెళ్లాలనుకుంటున్న ఫ్రెండ్స్ ని ఎందుకలా చేస్తున్నారని ప్రశ్నిస్తానని చెప్పింది. వాళ్లు మాత్రం షోని విమర్శించరని.. కానీ తను మాత్రం అలా కాదని చెప్పుకొచ్చింది. స్మిత మాటలను బట్టి చూస్తుంటే.. బిగ్ బాస్ షో అంటే ఆమెకి ఎంత అసహ్యమో అర్ధమవుతోంది. ఈమెతో పాటు చాలా మంది సెలబ్రిటీలు ఈ షోని హేట్ చేస్తారు. ఈ షోకి వెళ్లొచ్చిన వాళ్లు కూడా షోని విమర్శిస్తూ సంచలన  కామెంట్స్ చేశారు. 

ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లేదెవరు..?

బిగ్ బాస్ సీజన్ 6లో మొదటగా ఇంట్లోంచి వెళ్లబోయేది ఎవరు? అనే చర్చలు మొదలైపోయాయి. ఈసారి లేడీ కంటెస్టెంట్లలో ఒకరు బయటికి వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. వారిద్దరిలో ఒకరు ఆరోహి రావ్ కాగా, మరొకరు ఇనయా సుల్తానా. అలాగే అభినయశ్రీ పేరు కూడా వినిపిస్తోంది కానీ, ఆమె కన్నా వీరిద్దరికే వెళ్లే ఛాన్సులు అధికంగా ఉన్నట్టు తెలుస్తున్నాయి. 

ఆరోహి లేదా ఇనయాల్లో ఎవరు బయటికి వెళ్తారనే అంశం గురించి మాట్లాడుకుంటే ఎక్కువ మంది ఇనయా వెళ్తుందనే భావిస్తున్నారు. ఇనయా మీర ఆరోహి ఆట ఫర్వాలేదనిపిస్తోంది. ఇనయా అసందర్భంగా మాట్లాడడం, తనకు సంబంధం లేని విషయాల్లో కూడా మధ్యలో దూరి మాట్లాడడం కాస్త మైనస్ కావచ్చు. ఇక ఆరోహి రేవంత్ గొడవపడడం వల్ల ఓట్లు తక్కువ పడి ఉండొచ్చు.

అయితే ఇనయాతో పోలిస్తే ఆరోహి ఆటే చాలా మెరుగ్గా ఉంది. అంతేకాదు ఇనయా కన్నా అభిప్రాయాలను స్పష్టంగా చెప్పడంలో ఆరోహినే బెటర్. ఇక అభినయశ్రీ కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టు తెలుస్తోంది. బిగ్‌బాస్ హౌస్ లో ఏమైనా జరగొచ్చు. అభినయశ్రీ అంత చురుగ్గా ఉండడం లేదు. కేవలం నలుగురితో కూర్చుని ఏదో ఒకటి మాట్లాడడంలోనే బిజీగా ఉంటోంది. ఆమె ఇంతవరకు ఓపెన్  అయింది కూడా లేదు. ఈమె కన్నా ఇనయా, ఆరోహిలే నటించుకుండా తమ రియల్ క్యారెక్టర్‌తో ఆడారు.ఈ వీక్ కంటెంట్ ఇచ్చిన వారిలో ఇనయా, ఆరోహిల పేర్లు కూడా ఉంటాయి.కానీ అభినయశ్రీ ఇచ్చిన కంటెంట్ ఏమీ లేదు. కాబట్టి ఇలా ఆలోచిస్తే బిగ్ బాస్ అభినయను ఎలిమినేట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

Also Read : 'బ్రహ్మాస్త్ర' ఫ్లాప్‌ - ఐనాక్స్, పీవీఆర్‌కు 800 కోట్లు లాస్

Published at : 10 Sep 2022 02:54 PM (IST) Tags: Bigg Boss Telugu Bigg Boss Bigg Boss Telugu 6 Singer Smitha Smitha

సంబంధిత కథనాలు

Bigg Boss Season 6: ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఎలక్షన్స్, సూర్యకు హ్యాండిచ్చిన ఇనయా - యాంగ్రీ మ్యాన్ కి కెప్టెన్సీ?

Bigg Boss Season 6: ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఎలక్షన్స్, సూర్యకు హ్యాండిచ్చిన ఇనయా - యాంగ్రీ మ్యాన్ కి కెప్టెన్సీ?

Vijay Deverakonda Rashmika: రౌడీ బాయ్‌తో రష్మిక మాల్దీవులకు టూర్? ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమైన జంట!

Vijay Deverakonda Rashmika: రౌడీ బాయ్‌తో రష్మిక మాల్దీవులకు టూర్? ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమైన జంట!

Bheeshma Parvam in Telugu: మమ్ముట్టి ‘భీష్మ పర్వం’ మూవీని రామ్ చరణ్ రీమేక్ చేయనున్నారా?

Bheeshma Parvam in Telugu: మమ్ముట్టి ‘భీష్మ పర్వం’ మూవీని రామ్ చరణ్  రీమేక్ చేయనున్నారా?

అహంకారానికి మమకారమే సమాధానం - గరికపాటి వివాదంపై బ్రహ్మాజీ, శ్రీనివాస కుమార్ సీరియస్ కామెంట్స్!

అహంకారానికి మమకారమే సమాధానం - గరికపాటి వివాదంపై బ్రహ్మాజీ, శ్రీనివాస కుమార్ సీరియస్ కామెంట్స్!

Janaki Kalaganaledu October 7th: జ్ఞానంబని నిలదీసిన పీటర్, మేరీ- ఆగ్రహించిన జెస్సి, ధైర్యం చెప్పిన జానకి

Janaki Kalaganaledu October 7th: జ్ఞానంబని నిలదీసిన పీటర్, మేరీ- ఆగ్రహించిన జెస్సి, ధైర్యం చెప్పిన జానకి

టాప్ స్టోరీస్

MP Laxman on BRS Party: బీఆర్ఎస్ పార్టీ పేరుతో మునుగోడులో గెలిచి చూపించండి - ఎంపీ లక్ష్మణ్

MP Laxman on BRS Party: బీఆర్ఎస్ పార్టీ పేరుతో మునుగోడులో గెలిచి చూపించండి - ఎంపీ లక్ష్మణ్

Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

Police Seized Money In Munugode: మునుగోడు నామినేషన్ల తొలిరోజే రెండు చోట్ల డబ్బు స్వాధీనం, నిఘా పెంచిన పోలీసులు

Police Seized Money In Munugode: మునుగోడు నామినేషన్ల తొలిరోజే రెండు చోట్ల డబ్బు స్వాధీనం, నిఘా పెంచిన పోలీసులు

Nobel Prize Facts: నోబెల్‌ శాంతి బహుమతికి గాంధీ ఎన్నిసార్లు నామినేట్‌ అయ్యారు? ఎక్కువసార్లు అందుకున్నదెవరు?

Nobel Prize Facts: నోబెల్‌ శాంతి బహుమతికి గాంధీ ఎన్నిసార్లు నామినేట్‌ అయ్యారు? ఎక్కువసార్లు అందుకున్నదెవరు?