Singer Mano Sons: సింగర్ మనోకు షాక్, ఇద్దరు కొడుకులు అరెస్ట్
Singer Mano: ప్రముఖ గాయకుడు మనో ఇద్దరు కొడుకులు అరెస్ట్ అయ్యారు. వారం రోజుల క్రితం ఓ యువకుడిపై దాడి చేసిన ఘటనలో రఫీ, షకీర్ ను చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Singer Mano Sons Arrested: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా కొనసాగుతున్న మనో ఇద్దరు కొడుకులను పోలీసులు అరెస్టు చేశారు. వారంలో రోజుల క్రితం ఓ యువకుడిపై దాడి చేసి పరారు కాగా, తాజాగా వారిని చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొలుత ఈ కేసులు మనో మేనేజర్ తో పాటు, వంట మనిషిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి సమాచారంతో ఇప్పుడు మనో కొడుకులను పట్టుకున్నారు.
ఫుట్ బాల్ ప్లేయర్ పై మనో కొడుకుల దాడి
గత మంగళవారం నాడు ఓ ఫుట్ బాల్ ప్లూయర్ మీద మనో కొడుకులు దాడి చేశారు. చెన్నై ఆలప్పాక్కానికి చెందిన కృపాకరన్ తో పాటు మధురవాయల్ కి చెందిన 16 ఏళ్ల కుర్రాడు శ్రీదేవికుప్పంలోని ఫుట్ బాల్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారు. వాళ్లు ట్రైనింగ్ పూర్తయ్యాక, సుమారు 9 గంటల సమయంలో డిన్నర్ చేసేందుకు వలసరవాక్కంలోని ఓ హోటల్ కు వెళ్లారు. అదే సమయంలో మనో ఇద్దరు కొడుకులతో పాటు మరో ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చారు. అప్పటికే వాళ్లంతా మద్యం సేవించారు. హోటల్లో డిన్నర్ చేసతున్న కృపాకరన్ తో గొడవ పడ్డారు. అడ్డగోలుగా మాట్లాడ్డంపై కృపాకరన్ సీరియస్ అయ్యాడు. దీంతో రెచ్చిపోయిన మనో కొడుకులు, వారి ఫ్రెండ్స్ కృపాకరన్ పై విచాక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో కృపాకరన్ కు ముక్కు, నోటి నుంచి రక్తం బయటకు వచ్చింది. తీవ్రంగా గాయపడిన కృపాకరన్ ను స్థానికులు హాస్పిటల్లో చేర్చారు.
కృపాకరన్ ఫిర్యాదుతో మనో కొడుకులు సహా ఐగుగురిపై కేసు
కృపాకరన్ నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు విచారణ చేశారు. ఈ గొడవకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు మనో ఇద్దరు కొడుకులు రఫీ, షకీర్ తో పాటు వారి స్నేహితులు విఘ్నేష్, ధర్మా, జహీర్ పై హత్య బెదిరింపులు, దాడి, అనుచితంగా ప్రవర్తించడం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీరిలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు పరారయ్యారు. ఈ నేపథ్యంలో మనో మేనేజర్, ఇంటి పనిమనిషిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి సమాచారంతో రఫీ, షకీర్‌ని అరెస్ట్ చేశారు.
దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ సింగర్
దక్షిణాది సినీ పరిశ్రమలో సింగర్ మనో ప్రముఖ గాయకుడిగా కొనసాగుతున్నారు. సుమారు 4 దశాబ్దాలుగా సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకు ఆయన 35 వేలకు పైగా పాటలు పాడారు. 3 వేలకు పైగా స్టేజి షోలలో పాల్గొన్నారు. ఓవైపు ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరోవైపు బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి వివాదాల జోలికి పోని మనో, ఆయన కొడుకుల కారణంగా అవమానం ఎదుర్కొంటున్నారు. ఇక మనో కొడుకు షకీర్ ఇప్పటికే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. 2012లో వచ్చిన తమిళ చిత్రం ‘నాన్గా’లో నటించాడు.
Read Also: ‘మ్యాడ్’ బాయ్స్ మళ్లీ వచ్చేశారు, పట్టు బట్టల్లో ఫస్ట్ లుక్ అదిరిందంతే!