అన్వేషించండి

MAD Square First Look: ‘మ్యాడ్’ బాయ్స్ మళ్లీ వచ్చేశారు, పట్టు బట్టల్లో ఫస్ట్‌ లుక్‌ అదిరిందంతే!

MAD Square: యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ‘మ్యాడ్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీనికి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ చెప్పారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.

MAD Square First Look poster Revealed: తెలుగు సినిమా పరిశ్రమలోయూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన చిత్రం ‘మ్యాడ్’. జూనియర్ ఎన్టీఆర్ బావ మరిది నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌ హీరోలుగా దర్శకుడు కల్యాణ్ తెరకెక్కిచిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది. గత ఏడాది అక్టోబర్ 6న ఎలాంటి అంచనాలు లేకుండా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఊహించని ప్రేక్షకాదరణతో వసూళ్ల పరంగా  సత్తా చాటింది. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే చిత్రబృందం వెల్లడించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు.

పట్టు దుస్తుల్లో ‘మ్యాడ్‌‘ బాయ్స్ ఫస్ట్ లుక్   

‘మ్యాడ్’ సినిమాకు సీక్వెల్ గా ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు  చిత్రబృందం ప్రకటించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌ పట్టు దుస్తులు, స్టైలిష్ కళ్లజోళ్లతో అదిరిపోయే ఫోజులో ఆకట్టకున్నారు. బాయ్స్ మ్యాడ్ మ్యాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ తో తిరిగొచ్చారంటూ చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నది. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇప్పటికే ‘మ్యాడ్ 2’ కమింగ్‌ అంటూ ఆటోలో అనౌన్స్‌ మెంట్‌ మెంట్ చేస్తున్న స్టిల్ నెట్టింట వైరల్ అయ్యింది. తాజాగా వచ్చిన పోస్టర్ మూవీపై క్యూరియాసిటీ పెంచేస్తోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sithara Entertainments (@sitharaentertainments)

ఫస్ట్ సింగిల్ సెప్టెంబర్ 20న విడుదల

వాస్తవానికి ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ఫస్ట్ సింగిల్ ఇవాళే విడుదల అవుతుందనే ప్రచారం జరిగింది. కానీ, మేకర్స్ కేవలం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ సింగిల్ సెప్టెంబర్ 20న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఫస్ట్ సింగిల్ కోసం మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరోసారి ‘మ్యాడ్‘ బాయ్స్ ఎంటర్ టైన్ మెంట్ చూసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు.   

‘మ్యాడ్‘ సీక్వెల్ లోనూ వాళ్లే..

‘మ్యాడ్’లో అందరూ కొత్త వాళ్లే నటీనటులుగా చేసినా, సినిమాలో కంటెంట్ ఉండటంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకంది. ఈ చిత్రంలో శ్రీగౌరి ప్రియా రెడ్డి, అనంతికా సునీల్‌ కుమార్‌, గోపికా ఉద్యన్‌ హీరోయిన్లుగా నటించారు. సీక్వెల్ లోనూ వీళ్లే నటించనున్నట్లు తెలుస్తోంది. ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ను నాగవంశీ సమర్పిస్తున్నారు. సితార ఎంటర్‌ టైన్‌ మెంట్‌, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై హారికా సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. అటు ‘మ్యాడ్‘ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ ఫ్లిక్స్‌ లో అందుబాటులో ఉంది. 

Read Also: ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, జానీ మాస్టర్ లైంగిక వేధింపులపై అనసూయ షాకింగ్ కామెంట్స్..

టాప్ హెడ్ లైన్స్

Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Srinivasa Mangapuram OTT : ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?
Brahmamudi Serial Today August 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజును కిస్‌ చేసిన ఇందు – రేఖకు షాక్‌ ఇవ్వనున్న రాజు  
‘బ్రహ్మముడి’ సీరియల్: రాజును కిస్‌ చేసిన ఇందు – రేఖకు షాక్‌ ఇవ్వనున్న రాజు  
Illu Illalu Pillalu Serial Today August 20th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్, అమూల్యల ప్లాన్ ఫెయిల్.. వేదవతి త్రిబుల్ రైడ్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్, అమూల్యల ప్లాన్ ఫెయిల్.. వేదవతి త్రిబుల్ రైడ్!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Embed widget