అన్వేషించండి

Anasuya: ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, జానీ మాస్టర్ లైంగిక వేధింపులపై అనసూయ షాకింగ్ కామెంట్స్..

జానీ మాస్టర్ అత్యాచారం కేసుపై నటి అనసూయ స్పందించింది. బాధితురాలితో కొద్ది రోజుల పాటు కలిసి పని చేసినట్లు చెప్పింది. ఆ అమ్మాయికి ఇలా జగడం బాధ కలిగిస్తుందని చెప్పింది.

Anasuya Reacts On Jani Master Case: తెలుగు సినిమా పరిశ్రమలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అత్యాచారం, లైంగిక వేధింపుల వ్యవహారం సంచలనం కలిగిస్తోంది. లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో ఇప్పటికే ఆయపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంపై ఫిలిం ఛాంబర్ సహా పలువురు సినీ సెలబ్రిటీలు స్పందించారు. తాజాగా ఈ కేసుపై నటి అనసూయ భరద్వాజ్ రియాక్ట్ అయ్యింది. బాధితురాలికి జరిగిన అన్యాయం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆమెకు న్యాయం జరగాలని చెప్పింది.

నిజంగా బాధాకరం..

ఇంతకాలం ఆ అమ్మాయి అనుభవించిన బాధ నిజంగా దారుణమన్నది అనసూయ. “అమ్మాయిలు, మహిళలు తమకు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే వెంటనే బయటకు చెప్పాలి. మహిళలకు సానుభూతి అవసరం లేదు.. అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం రావాలి. మీరే కాదు, మీకు తెలిసిన వాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, వాటిని ప్రతిఘటించాలి. మీకు అందరూ తోడుగా నిలబడుతారనే విషయం మర్చిపోకూడదు. నేను బాధిత యువతతో కలిసి కొద్ది రోజులు పని చేశాను. ‘పుష్ప’ సెట్స్ లో రెండు, మూడుసార్లు చూశాను. కానీ, ఆ అమ్మాయి ఎదుర్కొంటున్న ఇబ్బందులు బయటకు తెలియకుండా దాచిపెట్టింది. మంచి టాలెంట్ ఉన్న అయ్యాయి. ఇలాంటి పరిస్థితులు ఆ అమ్మాయి టాలెంట్ ను ఏమాత్రం తగ్గించలేవు. కానీ, మనసులో దాచుకుని బాధ పడటం వల్ల ఎలాంటి లాభం ఉండదు. నా వర్క్ ప్లేస్ లో తోటి మహిళలకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా స్పందిస్తాను. వారికి మద్దతుగా నిలబడుతాను. బాధితురాలికి న్యాయం జరగాలని భావిస్తున్నాను. ఇందుకోసం సపోర్టుగా ఉన్న ఫిలిం ఛాంబర్ తో పాటు వోడబ్ల్యు సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.  మున్మందు ఇలాంటి పరిస్థితులు ఇండస్ట్రీలో ఏ మహిళకు ఎదురుకాకూడదని భావిస్తున్నాను” అని అభిప్రాయపడింది.  

జానీ మాస్టర్ పై అత్యాచారం సహా పలు కేసులు నమోదు

రీసెంట్ గా మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై పలుమార్లు అత్యాచారం చేయడంతో పాటు లైంగికంగా వేధింపులకు గురి చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢీ షో ద్వారా అతడితో పరిచయం ఏర్పడిందన్న యువతి, ఆ తర్వాత జానీ మాస్టర్ టీమ్ లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేరినట్లు చెప్పింది. షోల పేరుతో ముంబై, చెన్నై, హైదరాబాద్ లాంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపింది. షూటింగ్ సెట్స్ లో క్యారవాన్ లో లైంగిక వేధింపులకు గురి చేశాడని వెల్లడించింది. ఈ విషయాన్ని బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో వివరించింది. మతం మారి తనను పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ చిత్రహింసలు పెట్టారని చెప్పింది. ఈ విషయం జానీ మాస్టర్ భార్యకు కూడా తెలుసని చెప్పింది. ఆమె కూడా తన మీద దాడి చేసినట్లు వెల్లడించింది. బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ప్రస్తుతం కేసు విచారణ జరుపుతున్నారు.                                                                                                                                                                                                                                          

Read Also: జానీ మాస్టర్‌ కేసులో బయటపడ్డ సంచలన విషయాలు - ఆయన భార్య కూడా వేధించిందంటూ బాధితురాలు ఆరోపణలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Embed widget