అన్వేషించండి

Jani Master: జానీ మాస్టర్‌ కేసులో బయటపడ్డ సంచలన విషయాలు - ఆయన భార్య కూడా వేధించిందంటూ బాధితురాలు ఆరోపణలు

Jani Master Rape Case: జానీ మాస్టర్‌ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. జానీ భార్య సైతం బాధితురాలిపై దాడి చేసింది. అంతేకాదు తన భర్త పెళ్లి చేసుకోమ్మంటూ వేధించినట్టు ఎఫ్‌ఐఆర్‌ పేర్కొంది బాధితురాలు. 

ప్రముఖ స్టార్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ అలియాస్‌ షేక్‌ జానీ కేసులో షాకింగ్‌ విషయాలు వెలుగు చూశాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల మహిళ కొరియోగ్రాఫర్, ఢీ మాజీ కంటెస్టెంట్‌ జానీ మాస్టర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ముంబై, చెన్నై వంటి నగరాలకు ఔట్‌డోర్‌ షూట్‌కి వెళ్లినప్పుడు ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, తను నివాసం ఉంటున్న ఇంట్లోనూ జానీ మాస్టర్‌ తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయమై ఆమె ఫిలిం ఛాంబర్‌కు కూడా ఫిర్యాదు చేసింది. అయితే జానీ మాస్టర్‌పై ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో ఇంకా ఎన్నో విస్తుపోయే విషయాలు ఉన్నాయి.

మతం మారాలంటూ వేధింపులు

ఈ వ్యవహరంలో జానీ మాస్టర్‌ భార్య అయోషా కూడా ఉందని, తన భర్త పెళ్లి చేసుకోమంటూ ఆమె తనపై దాడి చేసినట్టు బాధిత యువతి తన స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. దీంతో ఇప్పుడు ఆమె స్టేట్‌మెంట్‌ సంచలనంగా మారింది. ఎఫ్‌ఐఆర్‌లోని వివరాల ప్రకారం.. బాధిత యువతి ఢీ 12 డ్యాన్స్‌ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొంది. అదే సమయంలో జానీ మాస్టర్‌ ఈ షోకు జడ్జీగా వ్యవహరించారు. అప్పుడే ఆమెకు జానీతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ఆమెకు తన అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా అవకాశం ఇచ్చాడు. అలా 2019లో ఆమె జానీ మాస్టర్‌ వద్ద అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా చేరింది. ఈ క్రమంలో 2019తో ఓ ప్రాజెక్ట్‌ కోసం ముంబై ఔట్‌ డోర్‌ షూటింగ్‌ తనతో పాటు ఇద్దరు అసిస్టెంట్స్‌ని జానీ తన వెంట తీసుకువెళ్లాడు.

ముంబై హోటలో బలవంతం

అప్పుడే తను ఉంటున్న హోటల్‌లో రూంకి వచ్చి ఆమెపై బలవంతంగా లైంగిక దాడి పాల్పడ్డాడు. అంతేకాదు ఈ విషయం బయటకు చెబితే తనని పని నుంచి తొలగిస్తానని కూడా బెదిరించాడు. దీంతో బాధితురాలు మౌనంగా ఉండిపోయింది. అప్పటి నుంచి ఔట్‌డోర్‌ షూటింగ్‌ వెళ్లినప్పుడల్లా జానీ తనపై లైంగికంగా వేధించేవాడు. షూటింగ్‌ సెట్స్‌లోనూ తన ప్రైవేట్‌ పార్ట్స్‌ తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ఓ రోజు ఆమె వ్యానిటీ వ్యాన్‌లోకి ప్రవేశించి లైంగిక వాంఛను తీర్చాలని బలవంతం చేశాడు.  అంగీకరించనందుకు తన జుట్టు పట్టి వ్యాన్‌లోని అద్దానికి గుద్దాడు. అంతేకాదు తనని పెళ్లి చేసుకోవాలని, మతం మారాలని ఒత్తిడి చేసేవాడు. దీనికి నిరాకరించినందుకు ఓ రోజు అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లి తన స్కూటీని ధ్వంసం చేశాడు. ఇంటిపై దాడి దాడి చేసి పెళ్లి చేసుకోమ్మని బెదిరించాడు.

నా భర్తను పెళ్లి చేసుకో..

జానీ, అతని భార్య అయేషా కూడా ఓ రోజు రాత్రి ఆమె ఇంటిపై దాడి చేశారు. బలవంతంగా తలుపులు తెరిచి లోపలికి వచ్చి ఆమెతో మతం ప్రస్తావన తీసుకువచ్చారు. మత మరాలని, తన భర్త పెళ్లి చేసుకోమ్మంటూ జానీ భార్యను ఆమెను బలవంతం చేసింది. ఈ క్రమంలో ఆమెపై పులమార్లు శారీరక దాడికి కూడా పాల్పడింది. ఇక వారి వేధింపులు భరించలేక బాధిత యువతి జానీ బృందం నుంచి బయటకు వచ్చి సొంతంగా పని చేసుకోవడం ప్రారంభించింది. కానీ తన ఇన్‌ఫ్లూయేన్స్‌తో జానీ ఆమెకు ఆఫర్స్‌ రాకుండ చేసేవాడు. కావాలని పలు ప్రాజెక్ట్స్‌కి ఆమెను సెలక్ట్‌ చేసుకుని షూటింగ్‌ మధ్యలో కావాలనే ఆమెను తీసేసి మరొకరిని నియమించుకోవడం చేసేవాడు.

అలా ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు అని బాధితురాలు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఈ వ్యవహరం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. కాగా జానీపై కేసు నమోదు అవ్వడంతో ఇప్పటికే జనసేన ఆయనను పార్టీ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాదు పార్టీకి సంబంధించిన అంశాలపై అతడు కలుగజేసుకోవద్దని కూడా ఆదేశించింది. డ్యాన్స్‌ అసోసియేషన్‌ సైతం ఆయనపై వేటు వేసింది. అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఇక అసోసియేషన్‌ నుంచి కూడా సస్పెండ్‌ చేసే ఆలోచిన ఫేడరేషన్‌ ఉందని సమాచారం. 

Also Read: త్రివిక్రమ్‌పై మా అసోసియేషన్‌కు పూనమ్‌ ఫిర్యాదు - గురూజీని ప్రశ్నించండి... సినీ పెద్దలకు నటి రిక్వెస్ట్‌

టాప్ హెడ్ లైన్స్

Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Brahmanandam Brother Sri Vadan: అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Embed widget