By: ABP Desam | Updated at : 05 Jan 2023 12:54 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@iamsrk/twitter
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, జాన్ అబ్రహం నటించిన తాజా సినిమా ‘పఠాన్’. ఈ చిత్రానికి 'వార్' లాంటి సూపర్ డూపర్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తీసిన సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. యాక్షన్ థ్రిల్లర్, స్పై ఫిల్మ్ గా ఈ సినిమా రూపొందింది. ఇందులో షారుఖ్ ఖాన్ గూఢచారిగా కనిపించనున్నారు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ ట్విట్టర్ లో ‘Ask SRK’ (ఆస్క్ షారుఖ్) పేరుతో నెటిజన్లతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా అభిమానుల నుంచి వచ్చిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. కొందరు ఆయన సినిమాలు, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి అడిగారు. మరికొంత మంది ఆయనపై ట్రోలింగ్ కు కూడా దిగారు.
ఇంటరాక్షన్ లో భాగంగా ఓ నెటిజన్ "పఠాన్ డిజాస్టర్ ఆల్రెడీ, రిటైర్మెంట్ తీస్కో" అని ట్వీట్ చేశాడు. దీనికి షారుఖ్ ఖాన్ చాలా సంయమనంతో సమాధానం చెప్పారు. "బేటా బడోన్ సే ఐసే బాత్ నహీ కర్తే!!" (బిడ్డా, పెద్దవాళ్లతో ఇలా మాట్లాడకూడదు) అంటూ రిప్లై ఇచ్చారు. ఆయన రిప్లై పట్ల నెటిజన్లు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఎదుటి వారు రెచ్చగొట్టేలా, కించపరిచేలా మాట్లాడినా షారుఖ్ మాత్రం చక్కగా సమాధానం చెప్పారంటూ కామెంట్స్ పెట్టారు.
Beta badhon se aise baat nahi karte!! https://t.co/G5xPYBdUCK
— Shah Rukh Khan (@iamsrk) January 4, 2023
జనవరి 25న ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో షారుఖ్ ఖాన్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా, జాన్ అబ్రహం కీలక పాత్రలో కనిపించనున్నారు. గత సంవత్సరం SRK పుట్టిన రోజు సందర్భంగా టీజర్ విడుదల అయ్యింది. ఈ జనవరి 10న మళ్లీ తన బర్త్ డే సందర్భంగా ట్రైలర్ విడుదల కానుంది. ఈ ట్రైలర్ దాదాపు మూడు నిమిషాల నిడివితో ఉంటుందని పింక్ విల్లా వెల్లడించింది. ఈ ట్రైలర్ యాక్షన్ సీక్వెన్సులు, మ్యూజిక్, హీరోయిజంతో కలిపి ఉంటుందని తెలిపింది.
మూడేళ్ల తర్వాత షారుక్ ఖాన్ మళ్లీ తెరపై కనిపించనున్నారు. 2018 వచ్చిన ‘జీరో’ సినిమా తర్వాత ఆయన నుంచి సినిమా రాలేదు. అయితే ‘పఠాన్’ సినిమా టీజర్ విడుదల అయినప్పటి నుంచి సినిమాపై సోషల్ మీడియాలో విమర్శలు మొదలైయ్యాయి. సోషల్ మీడియాలో కూడా మూవీను బహిష్కరించాలని కామెంట్లు చేశారు కొంతమంది నెటిజన్స్. ఈ సినిమా హాలీవుడ్ వార్ అండ్ మార్వెల్స్ కు కాపీ లా ఉందనే ఆరోపణలు వచ్చాయి. మరోవైపు ఈ సినిమాలో ‘బేషరమ్ రంగ్’ అనే పాటపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఓ వర్గం ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఈ పాట ఉందని ఆందోళనలు జరిగాయి. కాగా ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also: సమ్మర్‌లో శర్వానంద్ షాదీ! వధువు ఎవరో తెలుసా?
Ennenno Janmalabandham February 8th: బయటపడిన అభిమన్యు అసలు రంగు, మాళవిక బతుకు బస్టాండ్- మనసులతో ఊసులాడుకున్న వేద, యష్
Pawan Kalyan As God : ప్రేమికుల రోజు నుంచి దేవుడిగా పవన్ కళ్యాణ్
Guppedanta Manasu February 8th: మహేంద్రనా మజాకా! టామ్ అండ్ జెర్రీ కొత్త ప్రయాణం మొదలైంది
Jailer vs Indian 2: ఒకే రోజు కమల్, రజినీ సినిమాలు విడుదల, 18 ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్!
Prabhas Team Reaction : కృతితో ప్రభాస్ ఎంగేజ్మెంట్ - రెబల్ స్టార్ టీమ్ క్లారిటీ
Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కాంలో వరుస అరెస్టులు - ఆడిటర్ బుచ్చిబాబుతో పాటు గౌతమ్ని కూడా !
PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?
బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
RBI Policy: దాస్ ప్రకటనల్లో స్టాక్ మార్కెట్కు పనికొచ్చే విషయాలేంటి?