By: ABP Desam | Updated at : 10 Nov 2021 03:14 PM (IST)
'ఆర్ఆర్ఆర్' ఊరనాటు సాంగ్ వచ్చేసింది..
'బాహుబలి'తో టాలీవుడ్ రేంజ్ మార్చేసిన రాజమౌళి తర్వాతి ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’ పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో మెగా-నందమూరి వారసులు నటిస్తుండడంతో క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 7వ తేదిన విడుదల చేయబోతున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్లు కూడా మొదలుపెట్టారు. ఇటీవల దీపావళి సందర్భంగా 'ఆర్‌ఆర్‌ఆర్' గ్లింప్స్ ను విడుదల చేసి అభిమానుల్లో జోష్ పెంచారు.
Also Read: అల్లు అర్జున్ కి షాక్.. లీగల్ నోటీసులు పంపించిన సజ్జనార్..
45 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో సినిమాపై అంచనాలను పెంచేసింది. దీనిపై మొత్తం ఇండస్ట్రీ స్పందించింది. అభిమానులైతే ఈ విజువల్ ట్రీట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సినిమాలో మొదటి పాటను విడుదల చేయగా.. రీసెంట్ గా సినిమాలో రెండో పాటను విడుదల చేయబోతున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన ప్రోమో కూడా వచ్చింది. తాజాగా పూర్తి పాటను విడుదల చేశారు.
'పొలం గట్టు దుమ్ములోన పోట్లగిత్త దూకినట్టు.. పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు..' అంటూ సాగే ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించారు. ఐదు భాషల్లో సాంగ్ ను రిలీజ్ చేశారు. చిత్రబృందం చెప్పినట్లుగానే ఈ బ్లాస్టింగ్ బీట్స్.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల డాన్స్ స్టెప్పులు ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ అనే చెప్పాలి. ఇద్దరూ తమ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ఇరగదీశారు.
ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరీస్, రామ్ చరణ్ జంటగా ఆలియా భట్ నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగణ్, శ్రియా శరణ్, అలీసన్ డూడీ, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు.
The Dancing Dynamites @tarak9999 & @alwaysramcharan are here to rock the floor and shake the screen with our #RRRMassAnthem 🕺🕺💥
— RRR Movie (@RRRMovie) November 10, 2021
Tel - https://t.co/7CvdjgvW7p
Hin- https://t.co/zJmIph6siK
Tam- https://t.co/5oGwM911gU
Kan- https://t.co/vdFXvokKFx
Mal - https://t.co/vrfwk3CTcI pic.twitter.com/0U6wYdCu2H
Also Read: అర్జున ఫల్గుణ... ఎన్టీఆర్ అభిమానిగా శ్రీవిష్ణు
Also Read: రంగమ్మత్తను మించి ద్రాక్షాయణి.. వామ్మో అందమైన అనసూయ ఇలా అయిపోయిందే...
Also Read: పెళ్లైందని మర్చిపోయారా… ఆమెతో రొమాన్స్ ఏంటి..
Also Read: సీక్రెట్ రూమ్ లో జెస్సీ.. రవికి వార్నింగ్ ఇచ్చిన షణ్ముఖ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
Kalyan Ram: ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ - ఇదిగో క్లారిటీ!
Tollywood: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించబోయే సినిమాలివే!
GodFather Movie First Look: 'గాడ్ ఫాదర్' ఫస్ట్ లుక్ - ఓల్డ్ గెటప్ లో మెగాస్టార్
Bimbisara Trailer: 'ఇక్కడ రాక్షసుడైనా భగవంతుడైనా ఈ బింబిసారుడు ఒక్కడే' - ట్రైలర్ అదిరిపోయింది!
Vishal accident: 'లాఠీ' షూటింగ్, మళ్లీ గాయపడ్డ విశాల్
No Service Charge : సర్వీస్ చార్జ్ వసూలు చట్ట విరుద్దం - ఇక బిల్లు చెల్లించేటప్పుడు ఓ సారి చూసుకోండి !
IND vs SL Womens: రికార్డు సృష్టించిన స్మృతి మంథన, షెఫాలీ వర్మ - ఒక్క వికెట్ కూడా పడకుండా!
IND Vs ENG 5th Test England Target: 245 పరుగులకు టీమిండియా ఆలౌట్ - ఇంగ్లండ్ లక్ష్యం భారీనే అయినా!
OnePlus TV 50 Y1s Pro: వన్ప్లస్ కొత్త టీవీ దిగింది - 50 ఇంచుల టీవీల్లో బెస్ట్!