Saamanyudu Teaser: 'రాక్షసుల తలరాతను మార్చే పరిస్థితి సామాన్యుడుకి వస్తే..'
విశాల్ నటిస్తోన్న 'సామాన్యుడు' సినిమా టీజర్ ను విడుదల చేశారు.
విశాల్ హీరోగా నటిస్తూ.. నిర్మిస్తోన్న చిత్రం 'సామాన్యుడు'. తు.ప.శరవణన్ దర్శకత్వంలో వహిస్తోన్న ఈ సినిమాలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను కోలీవుడ్ తో పాటు తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు.
'ఇక్కడ రెండు రకాల మనుషులే ఉన్నారు.. ఒకరు.. జీవితాన్ని అది నడిపించే దారిలో జీవించాలనుకునే సామాన్యులు. ఇంకొకరు.. ఆ సామాన్యులను డబ్బు, పదవి, అధికారం కోసం అంతం చేయాలనుకునే రాక్షసులు.. ఆ రాక్షసుల తలరాతను మార్చి రాయాల్సిన పరిస్థితి ఒకరోజు ఒక సామాన్యుడికి వస్తుంది' అనే డైలాగ్ తో టీజర్ మొదలైంది.
టీజర్ మొత్తం యాక్షన్ సన్నివేశాలతో నింపేశారు. విశాల్ ఫైటింగ్ సీన్స్ లో ఇంటెన్సిటీ కనిపిస్తోంది. 'అయితే నువ్ ఈ పోరాటాన్ని ఆపవు కదా..' అని హీరోని ప్రశ్నిస్తే.. 'అది నిర్ణయించాల్సింది నా శత్రువు' అంటూ చెప్పే డైలాగ్ తో టీజర్ ముగిసింది. టీజర్ తో పాటు సినిమా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. 2022 జనవరి 26న 'సామాన్యుడు' ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. విశాల్ నటిస్తున్న 31వ సినిమా ఇది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కొంత భాగం షూటింగ్ హైదరాబాద్ లోనే నిర్వహించారు.
#VeeramaeVaagaiSoodum #Saamanyudu Teaser Out Now. GB
— Vishal (@VishalKOfficial) December 25, 2021
Tamil: https://t.co/979lhigs4d
Telugu: https://t.co/AVk8BW0E4s#RiseofACommonMan #VVSTeaser #VeeramaeVaagaiSoodumTeaser@Thupasaravanan1 @thisisysr @DimpleHayathi @johnsoncinepro @UrsVamsiShekar @HariKr_official pic.twitter.com/4oiH6N2iPM
Also Read: సన్నీకి మాధవీలత వార్నింగ్.. అతడు కనిపిస్తే చెంప పగలగొడతా అంటూ ఫైర్..
Also Read:అవమానకర రీతిలో డాన్స్.. సన్నీలియోన్ ను ఇండియా నుంచి తరిమేయమంటూ ఫైర్..
Also Read:పవన్ కి సపోర్ట్ చేసి ఉంటే.. పరిస్థితి ఇలా ఉండేదా..?
Also Read:'ఆర్ఆర్ఆర్'కి పెద్ద దెబ్బే.. కలెక్షన్స్ పై ఎఫెక్ట్ తప్పదు..
Also Read:స్టార్ కమెడియన్ కి ఒమిక్రాన్..? హాస్పిటల్ లో ట్రీట్మెంట్..
Also Read:హీరోయిన్ తో ఆమిర్ ఖాన్ సీక్రెట్ మ్యారేజ్.. అసలు నిజమిదే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి