Samantha : పచ్చబొట్టు చెరిగిపోదులే - నాగ చైతన్య టాటూ అలాగే ఉంది, సమంత లేటెస్ట్ ఫొటోలు వైరల్
సెలబ్రెటీ కపుల్ సమంత, నాగ చైతన్య మళ్లీ కలుస్తారా? సమంత ఇంకా నాగచైతన్యనే కావాలనుకుంటుందా..ఈ ప్రశ్నలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కారణం ఆమె శరీరంపై ఉన్న చై టాటూనే అంటున్నారు నెటిజన్స్.
Samantha : హాలీవుడ్ సిరీస్ సిటాడెల్ ప్రీమియర్ కోసం ఇటీవల లండన్ కు వెళ్లిన స్టార్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు.. అందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. గుణ శేఖర్ దర్శకత్వంలో వచ్చిన శాకుంతలం మూవీ తర్వాత సమంత పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ అయింది. దీంతో ఆమె ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోయారు. కానీ కొందరు నెటిజన్లు మాత్రం ఈ ఫొటోల్లో ఓ ఇంట్రస్టింగ్ థింగ్ ను చూసి కామెంట్ చేస్తున్నారు. అదే ఆమె ఒంటిపై ఉన్న పచ్చబొట్టు. ప్రస్తుతం ఈ టాటూస్ ఉన్న సమంత పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
టాలీవుడ్ హీరో నాగ చైతన్య కోసం అప్పట్లో సమంత ఓ టాటూ వేయించుకుందన్న విషయం చాలా మందికి తెలిసిందే. ఆమె పక్కటెముకకు కుడివైపున 'ఛై(Chay)' అని పేరుతో ఉన్న టాటూ అప్పట్లో వైరల్ గానూ మారింది. ఇక తాజాగా సిటాడెల్ ప్రీమియర్ లో ఆమె ఫొటోలకు ఇచ్చిన ఫోజుల్లో ఈ టాటూ కనిపించడంతో నెటిజన్లు దృష్టంతా ఆమె పచ్చబొట్టుపైనే పడింది. నాగ చైతన్యతో విడాకులైనా ఇంకా అతని టాటూ అలాగే ఉంచుకుందా అంటూ సందేహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.
నాగ చైతన్యతో విడాకులకు సంబంధించి ముందు నుంచే సమంత హింట్స్ ఇస్తూ వచ్చారు. మొదటగా తన సోషల్ మీడియా ఖాతాల్లో ఉన్న పేరులో అక్కినేని పేరును తొలగించారు. ఆ తర్వాత నాగ చైతన్యతో కలిసి ఉన్న ఫొటోలనూ తీసివేశారు. వాటన్నింటి తర్వాతే ఓ రోజున వారిద్దరూ తమ తమ సోషల్ మీడియో అకౌంట్లలో అధికారికంగా విడిపోతున్నామంటూ ప్రకటించారు. అప్పట్నుంచి ఎవరి దారిలో వారు ఉన్నప్పటికీ.. సమంత మాత్రం కొన్ని సార్లు ఈ విషయంపై స్పందించారు. ఆ తర్వాత ఆమె చైకి సంబంధించి తన శరీరంపై ఉన్న టాటూను కూడా చెరిపివేసిందని చాలా మంది అనుకున్నారు. కానీ తాజాగా ఈ ఫొటోలను చూస్తుంటే ఆ టాటూని తీయించుకోలేదని తెలుస్తోంది. అంటే మనిషికి దూరమైనా మనసు మాత్రం తనతో ఉందని ఆమె భావిస్తుందా అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికీ చైతో కలిసి ఉండేందుకు సామ్ కు ఇష్టమేనా అని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
చైతో విడాకుల తర్వాత ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న సమంత.. ఇటీవల ‘శాకుంతలం’ ప్రమోషన్స్ సందర్భంగా పాల్గొన్న ఇంటర్వ్యూల్లోనూ తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. తన వైవాహిక జీవితంలో తన వైపు నుంచి 100 శాతం ఇచ్చినా వర్కవుట్ కాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో కొన్ని రోజులు బాధపడ్డ సమంత.. ఆ తర్వాత మళ్లీ కోలుకుని ఇప్పుడిప్పుడే షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఆ తర్వాతే ‘శాకుంతలం’ మూవీని కంప్లీట్ చేసి, అందరి చేతా శభాష్ అనిపించుకున్నారు.
సమంత తొలి చిత్రం ఏం మాయ చేశావే 2010లో విడుదలై, భారీ హిట్ కొట్టడంతో ఆమె కెరీర్ తొలినాళ్లలో ఆ సినిమాను స్ఫురించేలా 'YMC'అని తన మెడ భాగంలో ఓ పచ్చబొట్టు వేయించుకుంది. చైతూ, సామ్ మధ్య ప్రేమ చిగురించడానికి కూడా ఆ సినిమానే కారణం కావడంతో దాన్ని ఆమె ఒక తీపి గుర్తుగా ఉంచుకున్నారు. ఆ తర్వాత సమంత, చైలు ఇద్దరూ తమ ముంజేయిపై బాణాల ఆకృతిలో ఉండే ఓ మ్యాచింగ్ టాటూలను వేయించుకున్నారు. నాగ చైతన్య అయితే తమ పెళ్లి తేదీని కూడా దానికి జోడించాడు. ఈ టాటూకి అర్థం మీ రియాలిటీని క్రియేట్ చేసుకోండి అని అప్పట్లో సామ్ తెలిపింది. అంతే కాదు ఈ టాటూను ఇద్దరం వేయించుకున్నామని, చైకి, తనకి చాలా స్పెషల్ అని వెల్లడించింది.
Also Read : 'విరూపాక్ష' రివ్యూ : మిస్టీక్ థ్రిల్లర్‌తో సాయి ధరమ్ తేజ్ భయపెట్టారా? లేదా?