Samantha: సెక్సీగా కనిపించడం కోసం ఎంత కష్టపడ్డానో.. 'పుష్ప' ఐటెం సాంగ్ పై సామ్ రియాక్షన్..
తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది సమంత. అందులో ఐటెం సాంగ్ కోసం ఎంత కష్టపడిందో చెప్పుకొచ్చింది.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెడుతోంది. ఇటీవల విడుదలైన 'పుష్ప' సినిమాలో సమంత ఐటెం సాంగ్ లో కనిపించింది. 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా' అంటూ సాగే ఈ సాంగ్ లో సమంత తన మాస్ స్టెప్స్ తో ఇరగదీసింది. ఈ సాంగ్ లో ఆమె వేసుకున్న కాస్ట్యూమ్స్ చాలా సెక్సీగా ఉన్నాయి. సమంతను ఈ అవతారంలో చూసిన ఫ్యాన్స్ షాకైపోయారు. అయితే చాలా మంది ఆమె డాన్స్ పెర్ఫార్మన్స్ ను పొగడగా.. మరికొందరు మాత్రం ఆమెని ట్రోల్ చేశారు.
కానీ సమంత మాత్రం ఈ పాటలో నటించినందుకు చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ సాంగ్ పై వచ్చిన కొన్ని ఫన్నీ మీమ్స్ ను ట్విట్టర్ లో షేర్ చేస్తుంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది. అందులో ఈ సాంగ్ కోసం ఎంత కష్టపడిందో చెప్పుకొచ్చింది. 'ఇప్పటివరకు తెరపై మంచిదానిలా, బ్యాడ్ గా, ఫన్నీగా, సీరియస్ గా కనిపించాను.. చాట్ షో హోస్ట్ గా కూడా చేశాను. చేసే ప్రతిపనిలో నా బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నించాను. కానీ సెక్సీ కనిపించడమనేది నెక్స్ట్ లెవెల్ హార్డ్ వర్క్' అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
ఇదిలా ఉండగా.. 'శాకుంతలం' సినిమా షూటింగ్ పూర్తి చేసిన సమంత.. ఇటీవల 'యశోద' సినిమా సెట్స్ పైకి వెళ్లింది. కొత్త దర్శకులు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలో కనిపించనున్నారు. అలానే మలయాళ నటుడు ఉన్నిముకుందన్ ను మరో పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాతో పాటు సమంత చేతిలో మరో రెండు, మూడు సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కావడం విశేషం.
View this post on Instagram
Also Read: పవన్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. సంక్రాంతి రేసు నుంచి 'భీమ్లానాయక్' ఔట్..
Also Read: ప్రభాస్ ఫ్యాన్స్‌కు సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన రాధే శ్యామ్ టీమ్... రెబల్ స్టార్ లుక్ రిలీజ్!
Also Read: అప్పుడు అనుష్కతో... ఇప్పుడు సమంతతో
Also Read: పవన్ కల్యాణ్‌తో క్రిష్ మీటింగ్... 'హరి హర వీరమల్లు' గురించి కొత్త అప్‌డేట్!
Also Read: మణిరత్నం సినిమా వల్ల నాని సినిమాకు ఆ ఇద్దరూ దొరకలేదు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి