Yashoda Teaser: సమంత అభిమానులకు గుడ్ న్యూస్, ‘యశోద’ టీజర్ వచ్చేది ఆ రోజే!
సమంత నటిస్తున్న తాజా సినిమా ‘యశోద’. పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కుతున్న యశోదకు సంబంధించి క్రేజ్ అప్ డేట్ వచ్చింది. వచ్చే నెల(సెప్టెంబర్) 9న ఈ సినిమా టీజర్ విడుదల కాబోతుంది.
నాగ చైతన్యతో విడాకులు తర్వాత కెరీర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టిన సమంతా.. వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నది. ఒకదాని తర్వాత మరో పాన్ ఇండియన్ సినిమా చేస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్–2 వెబ్‌సిరీస్, కాత్తు వాక్కుల రెండు కాదల్ తర్వాత.. సమంతా.. యశోద సినిమాలో నటిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. హరి-హరీష్ దర్శకులుగా పరిచయం చేస్తూ.. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ శ్రీదేవి మూవీస్ పతాకం పై ప్రొడక్షన్ నం.14గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూట్ ని కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. వినాయక చవితి సందర్భంగా యశోద సినిమా యూనిట్ ప్రేక్షకులకు క్రేజీ న్యూస్ వెల్లడించింది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ సెప్టెంబర్ 9న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
'యశోద' సినిమా పూర్తిగా సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతుంది. సమంత ఇంతకు ముందు చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఈ సినిమా పూర్తిగా భిన్నంగా ఉంటుందనే టాక్ నడుస్తున్నది. ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ కూడా ఉందట. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్‌తో యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారట. ఫ్యామిలీ మాన్-2 తో నార్త్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్న సమంత క్రేజ్ ని ఈ చిత్రం లో తన పెర్ఫార్మన్స్ మరో రేంజికి తీసుకెళ్తున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్ వీడియో కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో.. టీజర్ ను మరింత ఆసక్తి కలిగించేలా దర్శక నిర్మాతలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ టీజర్ కట్ పూర్తి అయినట్లు సమాచారం.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న యశోద చిత్రం లో సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి పాటలు రాస్తున్నారు. పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి డైలాగ్స్ రాస్తున్నారు. ఎం సుకుమార్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. అశోక్ ఆర్ట్ పనులు చూసుకుంటున్నారు. యానిక్ బెన్, వెంకట్ పైట్స్ రూపొందిస్తున్నారు.
View this post on Instagram
సమంతా ఇప్పటికే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతున్నది. గతేడాది విడుదలైన ది ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్ తో నేషనల్ వైడ్‌గా పాపులారిటీ అందుకుంది. ఈ నేపథ్యంలో ఆమె నటించే సినిమాలన్నీ హిందీలో విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు రెడీ అవుతున్నారు. యశోద సినిమా కోసం సమంత ఎంతో కష్టపడి అద్భుతంగా యాక్షన్ సీన్లు చేసినట్లు తెలుస్తున్నది.
ఇక ఏమాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన సమంత. తన తొలి సినిమా హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. నాలుగేళ్ల కాపురం తర్వాత చైతన్యకు విడాకులు ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా వీరిద్దరు విడాకుల విషయాన్ని ప్రకటించారు. ఆ తర్వాత ఎవరి దారిన వాళ్లు సినిమాలు చేసుకుంటున్నారు.
Also Read : సుమన్ బతికుండగా చంపేసిన యూట్యూబ్ ఛానళ్లు
Also Read : విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ వల్ల హిట్టూ ఫ్లాపులు రాలేదు - దర్శక అభిమాని సూటి లేఖ