X

Samantha: ‘అలా చేస్తే నొప్పి కలుగుతుంది’.. సమంత ఇన్‌స్టా పోస్ట్ వైరల్

‘‘అలా చేస్తే మీరు బాధపడతారు. నొప్పి కలుగుతుంది’’ అంటూ సమంత పోస్ట్ చేసిన తాజా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

FOLLOW US: 

నాగచైతన్య-సమంత విడాకులు గురించి ఇప్పటికీ చర్చ నడుస్తూనే ఉంది. అయితే, ఈ విడాకుల వల్ల ఎక్కువగా బాధపడింది సమంతానే. మీడియా కూడా ఆమెనే వేలెత్తి చూపడం, ఆమెకు మరొకరితో ఎఫైర్ అంటగట్టడం, గుడ్డిగా ఆమెపై ప్రతికూల కథనాలను ప్రసారం చేయడం.. ఆమె విడాకులకు కారణాలు ఇవేనంటూ పలు టీవీ చానెళ్లు ఏకంగా చర్చలు పెట్టడం.. సామ్‌ను ఎంతో బాధపెట్టాయి. చివరికి ఆమె సోషల్ మీడియాలోకి వచ్చి.. ‘‘దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి’’ అని చెప్పినా సరే.. ఆమెను ఇబ్బందిపెడుతూనే ఉన్నారు. 

విడాకుల బాధ నుంచి సమంతా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నట్లు కనిపిస్తోంది. వీలైనంత ఎక్కువ సమయాన్ని జిమ్‌లో తన స్నేహితులతో గడిపేందుకు ఇష్టపడుతోంది. ఆమె స్నేహితులు సైతం సమంతను ఒంటరిగా విడిచిపెట్టేందుకు ఇష్టపడటం లేదు. వివిధ గేమ్స్, చిట్‌చాట్‌తో సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో ప్రకారం.. సమంతా వీకెండ్‌లో బాగా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. తన స్నేహితులతో కలిసి జిమ్‌లో తాడు లాగే ఆటను ఆడుతూ కనిపించింది. ఈ సందర్భంగా ఆమె తన వ్యక్తిగత అభిప్రాయాన్ని కూడా షేర్ చేసింది. దాన్ని లోతుగా అర్థం చేసుకుంటే.. సమంత ఇంకా విడాకుల వల్ల కలిగిన బాధను మరిచిపోలేదేమో అనిపిస్తోంది. 

View this post on Instagram

A post shared by Samantha (@samantharuthprabhuoffl)‘‘నా స్నేహితులతో ఈ వారం విశ్రాంతి లేకుండా క్రేజీగా, సరదాగా సాగిపోయింది. నా కోసం.. ఓ సూచన - కుటుంబం, గ్రూప్ యాక్టివిటీల్లో ఎప్పుడూ పిచ్చిగా, వెర్రిగా పాల్గోవద్దు. మీరు బాధపడతారు. మీకు నొప్పి కలుగుతుంది’’ అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. అంటే.. సమంత ఒంటరిగా ఉండటాన్నే ఇష్టపడుతుందా? ఆ కుటుంబంతో కలిసి ఉండటం వల్ల ఆమె వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చాయా? అనే సందేహాలను నెటిజనులు వ్యక్తం చేస్తున్నారు. అయితే, సమంత ఉద్దేశం ఏదైనా.. ప్రస్తుతం ఆమె విడాకులు తీసుకున్న ఆవేదనలో ఉన్న నేపథ్యంలో.. మనసులో మాటను ఈ విధంగా తెలియజేసి ఉండవచ్చని భావిస్తున్నారు. స్నేహితులతో సరదాగా గడిపినా.. ఇష్టమైన వ్యక్తి దూరం కావడాన్ని ఆమె ఇంకా మరిచిపోలేకపోతుందని అనుకుంటున్నారు. 

Also Read: అందుకే పవన్‌తో మాట్లాడలేదు.. ఎవరుపడితే వాళ్లు ‘మా’లో సభ్యులు కాకూడదు: విష్ణు

సమంతా విడాకుల తర్వాత వరుసగా సినిమా ఆఫర్లను అంగీకరిస్తోంది. ఇప్పటికే ఆమె గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన ‘శాకుంతలం’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. తమిళంలో విజయ్‌ సేతుపతి కలిసి నటిస్తున్న ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం సమంత డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోన్న 30వ చిత్రానికి ఆమె సంతకం చేసింది. తాజాగా మరో బాలీవుడ్‌ చిత్రానికి కూడా సమంత గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌ హీరోగా, అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో సామ్ ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. ఇప్పటికే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో హిందీ ప్రేక్షకుల్లో క్రేజ్ పెంచుకున్న సామ్.. ఈ సినిమాతో డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇందుకు సమంత రూ.7 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

Also Read: ‘మా’ గొడవ విష్ణుతో కాదు, ఈసీతోనే.. సీసీటీవీ వీడియోల కోసం ప్రకాష్ రాజ్ పట్టు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: samantha సమంత Samantha Divorce సమంత విడాకులు Samantha Instagram Samantha instagram video Samantha with friends

సంబంధిత కథనాలు

Siddharth : టికెట్ రేట్లపై ఏపీ స‌ర్కార్‌కు హీరో సిద్ధార్థ్ కౌంట‌ర్‌!?

Siddharth : టికెట్ రేట్లపై ఏపీ స‌ర్కార్‌కు హీరో సిద్ధార్థ్ కౌంట‌ర్‌!?

Omicran Movie: ‘ఒమిక్రాన్’ ఇది వైరస్ కాదు 1963లో విడుదలైన సినిమా.. ట్విస్ట్ ఏమిటంటే...

Omicran Movie: ‘ఒమిక్రాన్’ ఇది వైరస్ కాదు 1963లో విడుదలైన సినిమా.. ట్విస్ట్ ఏమిటంటే...

Mega154 : సెట్స్‌కు వ‌చ్చిన మెగాస్టార్‌... నెర్వ‌స్‌లో డైరెక్ట‌ర్‌

Mega154 : సెట్స్‌కు వ‌చ్చిన మెగాస్టార్‌... నెర్వ‌స్‌లో డైరెక్ట‌ర్‌

Chiyaan61: ర‌జ‌నీకాంత్‌తో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేసిన ద‌ర్శ‌కుడితో విక్ర‌మ్‌... ద‌ళిత్ సినిమా క‌న్ఫ‌ర్మ్‌

Chiyaan61: ర‌జ‌నీకాంత్‌తో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేసిన ద‌ర్శ‌కుడితో విక్ర‌మ్‌... ద‌ళిత్ సినిమా క‌న్ఫ‌ర్మ్‌

Ileana D'cruz: బికినీ షోలో ఇలియానా తర్వాతే ఎవరైనా అనేలా...

Ileana D'cruz: బికినీ షోలో ఇలియానా తర్వాతే ఎవరైనా అనేలా...
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Samsung Galaxy A13 5G: అత్యంత చవకైన శాంసంగ్ 5జీ ఫోన్ వచ్చేసింది.. లాంచ్ చేసిన కంపెనీ.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Samsung Galaxy A13 5G: అత్యంత చవకైన శాంసంగ్ 5జీ ఫోన్ వచ్చేసింది.. లాంచ్ చేసిన కంపెనీ.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

AP NGT Polavaram : పర్యావరణ అనుమతుల ఉల్లంఘన.. ఏపీ ప్రాజెక్టులకు ఎన్జీటీ రూ. 120 కోట్ల జరిమానా !

AP NGT Polavaram :  పర్యావరణ అనుమతుల ఉల్లంఘన.. ఏపీ ప్రాజెక్టులకు ఎన్జీటీ రూ. 120 కోట్ల జరిమానా !

OnePlus RT: వన్‌ప్లస్ ఆర్‌టీ ధర లీక్.. 9 సిరీస్ కంటే తక్కువే.. ఎంతంటే?

OnePlus RT: వన్‌ప్లస్ ఆర్‌టీ ధర లీక్.. 9 సిరీస్ కంటే తక్కువే.. ఎంతంటే?

IND Vs NZ: భారత్, న్యూజిలాండ్ రెండో టెస్టు రేపే.. తెలుగు తేజానికి అవకాశం దక్కేనా?

IND Vs NZ: భారత్, న్యూజిలాండ్ రెండో టెస్టు రేపే.. తెలుగు తేజానికి అవకాశం దక్కేనా?